☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Vivo S2 FE: 10,000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లే, IP68 + IP69 రేటింగ్.. వివో నుంచి మరో స్మార్ట్ ఫోన్..

వివో సంస్థ తన స్మార్ట్‌ఫోన్ పోర్ట్‌ఫోలియోను వేగంగా విస్తరిస్తోంది. వచ్చే నెల ప్రారంభంలో లాంచ్ కానున్న వీవో V80తో పాటు ‘వివో S2 FE’ మోడల్‌ను కూడా భారత్‌లో విడుదల చేయనున్నట్లు లీక్‌ల ద్వారా తెలుస్తోంది. అక్టోబర్ 6న మధ్యాహ్నం 12 గంటలకు ఈ రెండు ఫోన్లు ఒకే వేదికపై లాంచ్ అయ్యే అవకాశముంది. ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు, డిజైన్, ధరల వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తక్కువ ధరలో మొబైల్ ఫోన్ కొనాలనుకునే […]
Vivo S2 FE: 10,000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లే, IP68 + IP69 రేటింగ్.. వివో నుంచి మరో స్మార్ట్ ఫోన్..

వివో సంస్థ తన స్మార్ట్‌ఫోన్ పోర్ట్‌ఫోలియోను వేగంగా విస్తరిస్తోంది. వచ్చే నెల ప్రారంభంలో లాంచ్ కానున్న వీవో V80తో పాటు ‘వివో S2 FE’ మోడల్‌ను కూడా భారత్‌లో విడుదల చేయనున్నట్లు లీక్‌ల ద్వారా తెలుస్తోంది. అక్టోబర్ 6న మధ్యాహ్నం 12 గంటలకు ఈ రెండు ఫోన్లు ఒకే వేదికపై లాంచ్ అయ్యే అవకాశముంది. ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు, డిజైన్, ధరల వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తక్కువ ధరలో మొబైల్ ఫోన్ కొనాలనుకునే వారికి ఈ ఫోన్ ఎంతగానో ఉపయోగపడనుంది. లీక్ అయిన సమాచారం ప్రకారం.. ఈ ఫోన్ రూ. 40,000 కంటే తక్కువ ధరలోనే లభించనుంది. బ్లాక్, గ్రీన్ కలర్స్‌లో లభించే ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు స్క్వేర్ షేప్ కెమెరా మాడ్యూల్‌తో రానుంది.

ఫీచర్ల పరంగా చూస్తే.. ఈ ఫోన్‌లో 6.83-అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. మెరుగైన పెర్ఫార్మెన్స్ కోసం ఇందులో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300e 5G చిప్‌సెట్ అమర్చారు. పొరపాటును ఎప్పుడైనా నీటిలో పడనా.. దుమ్ము నుంచి రక్షణ పొందేందుకు ఈ ఫోన్‌కు IP68 + IP69 రేటింగ్ లభించవచ్చని సమాచారం. భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఇందులో ఉండనుంది.

కెమెరా విభాగంలో.. వెనుక వైపు సోనీ IMX852 సెన్సార్ కలిగిన 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉండే అవకాశం ఉంది. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు. ఈ ఫోన్ ఆకర్షణ దీని 10,000mAh భారీ బ్యాటరీ కానుంది. దీనికి 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభించనుంది. స్టైలిష్ డిజైన్, శక్తివంతమైన ప్రొసెసర్, అద్భుతమైన బ్యాటరీ బ్యాకప్‌తో వివో S2 FE భారతీయ మార్కెట్‌లో వినియోగదారులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతోంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← The Paradise: నాని కెరీర్‌లోనే రికార్డ్ ఓపెనింగ్ దిశగా ‘ది ప్యారడైజ్’.. రిలీజ్‌కు ముందే కోటి దాటేసిన సినిమా!Chandigarh University: ఫ్రెషర్స్‌ వేడుకలో అసభ్యకర డ్యాన్స్.. నెట్టింట తీవ్ర విమర్శలు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com