☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

The Paradise: నాని కెరీర్‌లోనే రికార్డ్ ఓపెనింగ్ దిశగా ‘ది ప్యారడైజ్’.. రిలీజ్‌కు ముందే కోటి దాటేసిన సినిమా!

The Paradise: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ ది ప్యారడైజ్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనాలను సృష్టిస్తుంది. థియేటర్లలోకి సినిమా రాకముందే టికెట్ బుకింగ్స్ పోటెత్తుతున్నాయి. తాజాగా అందుతున్న ట్రేడ్ సమాచారం ప్రకారం.. ప్రీమియర్ షోలు, డే-1 అడ్వాన్స్ సేల్స్‌తో కలిపి చెన్నైలో ఇప్పటికే రూ.కోటి గ్రాస్ మైలురాయిని సునాయాసంగా దాటేసింది. నాని కెరీర్‌లోనే అత్యధిక అడ్వాన్స్ సేల్ రికార్డ్ […]
The Paradise: నాని కెరీర్‌లోనే రికార్డ్ ఓపెనింగ్ దిశగా ‘ది ప్యారడైజ్’.. రిలీజ్‌కు ముందే కోటి దాటేసిన సినిమా!

The Paradise: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ ది ప్యారడైజ్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనాలను సృష్టిస్తుంది. థియేటర్లలోకి సినిమా రాకముందే టికెట్ బుకింగ్స్ పోటెత్తుతున్నాయి. తాజాగా అందుతున్న ట్రేడ్ సమాచారం ప్రకారం.. ప్రీమియర్ షోలు, డే-1 అడ్వాన్స్ సేల్స్‌తో కలిపి చెన్నైలో ఇప్పటికే రూ.కోటి గ్రాస్ మైలురాయిని సునాయాసంగా దాటేసింది. నాని కెరీర్‌లోనే అత్యధిక అడ్వాన్స్ సేల్ రికార్డ్ ఇది అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అలాగే తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రధాన నగరాల్లోనూ ‘ది ప్యారడైజ్’ టికెట్ల కోసం అభిమానులు ఎగబడుతున్నారు. కేవలం ప్రీమియర్లు, మొదటి రోజు మార్నింగ్ షోల అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే రూ.కోటి మార్కును దాటడం సినిమాపై ఆడియన్స్‌కి ఉన్న క్రేజ్‌కి నిదర్శనంగా నిలుస్తోందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతన్నాయి. బుకింగ్స్ ఓపెన్ అయిన కొద్ది గంటల్లోనే మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్లలో షోలు హాట్ కేకుల్లా అమ్ముడైపోతుండటంతో థియేటర్ల వద్ద ఫాస్ట్ ఫిల్లింగ్, హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.

గతంలో వచ్చిన ‘దసరా’, ‘సరిపోదా శనివారం’ చిత్రాలతో మాస్ హీరోగా తన రేంజ్‌ను ఎన్నో రెట్లు పెంచుకున్న నాని, ఇప్పుడు ‘ది ప్యారడైజ్’తో సరికొత్త రికార్డులను సృష్టించే దిశగా దూసుకుపోతున్నారు. ఇప్పటివరకు వచ్చిన అడ్వాన్స్ సేల్స్ ట్రెండ్‌ను పరిశీలిస్తే.. నాని కెరీర్‌లోనే ఇది ‘ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఓపెనర్’గా నిలవడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓవర్సీస్ ప్రీ-సేల్స్‌లోనూ ఈ చిత్రం భారీ సంచలనం సృష్టిస్తుండగా, ఇండియన్ మార్కెట్లో గంటగంటకూ అడ్వాన్స్ కలెక్షన్ల గ్రాఫ్ అమాంతం పెరుగుతోంది. శ్రీకాంత్ ఓదెల సరికొత్త రా అండ్ రస్టిక్ మేకింగ్, నాని నెవర్ బిఫోర్ జడల్ లుక్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే ఈ స్థాయి సునామీ కనిపిస్తుంటే.. ఇక మరికొద్ది గంటల్లో సినిమా థియేటర్లలోకి వచ్చాక బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులు బద్దలవుతాయోనని సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← UP: 2047 వరకు అఖిలేష్ కుటుంబంలో ఎవరూ ముఖ్యమంత్రి అవ్వరు.. యూపీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలుVivo S2 FE: 10,000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లే, IP68 + IP69 రేటింగ్.. వివో నుంచి మరో స్మార్ట్ ఫోన్.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com