పిల్లల్ని ప్రేమగా పెంచుతరు. ఎందుకో అంతలోనే వాళ్లని కొడతరు. భార్యకు కావాల్సిందిస్తరు. కానీ, తను కాదన్న పనిచేసిందని కోపం పెంచుకుంటరు. అడిగినవన్నీ ఇచ్చినా ప్రేమలేని జీవితంలోనే ఉండిపోతరు. ఇది సైకాలజీ ప్రాబ్లమ్. భార్య, పిల్లలు, పేరెంట్స్ మీద ఉండే ప్రేమకు, రిలేషన్ కు లింక్ ఉంది నిజమే కానీ, ఆ ప్రేమకు పరిస్థితులకు కూడా ఓ లింకు ఉందని మనసు తెలుసుకోవాలి.
అసెర్టివ్ : కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం, ఫ్రెండ్ షిప్, సోషల్ లైఫ్ లో తను చేయాల్సిన పనులు తప్పకుండా చేస్తరు. అసెర్టివ్ గా ఉన్నవాళ్లు పిల్లలు, కుటుంబం పట్ల బాధ్యతగా ఉంటరు. ఏ విషయంలో అయినా క్లారిటీతో ఉంటరు. ఆ క్లారిటీ కోసం పర్సనల్ లైఫ్, ఫైనాన్షియల్ మ్యా టర్ ను ఫ్యామిలీ మెంబర్స్ తో పంచుకుంటరు. బయటి వాళ్లతోనీ రిలేషన్స్ బాగుంటయి. అన్ని విషయాల్లో ట్రాన్సపరెంట్ గ ఉంటరు. స్నేహం, ప్రేమలో రియాలిటీ ఉంటది. రిలేషన్స్ బ్రేక్ అయినా మనోధైర్యంతో తట్టుకుని నిలబడతరు.
సబ్ మెసివ్ : వీళ్లు ఏదడిగినా ఓకే అంటరు. కానీ నో చెప్పలేరు. మొహమాటానికి అడిగింది చేస్తానని ఒప్పు కుంటరు. ఇంట్లో పిల్లలు శక్తికి మించి అడిగినా సరేనంటరు. పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు. మనం పడ్డ కష్టం వాళ్లు పడకూడదనే ఆలోచనతో కొంతమంది పేరెంట్స్ ఉంటరు. పిల్లలు బాధపడకూడదన్నది వీళ్ల ఆలోచన. కాలేజీకి పోతున్నాడని అడగకముందే బైక్ కొనిస్తారు. కాస్ట్లీ డ్రెస్ కొనిస్తారు.
తాహతుకు మించి పీజులున్నా భయపడకుండా కాలేజీలో చేర్పిస్తారు. పిల్లలకేమీ అర్థం కాదు. 'అరె కడుతున్నారు కదా. డబ్బులు ఉండే ఉంటయ్ తియ్' అనుకుంటరు. ఆ తర్వాత మీ కోసం ఇన్ని ఫీజులు కట్టినమంటే 'మేమ డిగినమా' అంటరు. మీదే తప్పని పిలగాండ్లు తప్పుబడతరు. సబ్ మెసివ్ మనస్తత్వం ఉన్నోళ్లు ఎప్పుడూ సఫర్ అవుతూనే ఉంటరు. భార్యకు కూడా ఖరీదైన నగలు, చీరలు కొనిస్తరు. బయటికి తీసుకుపోతే తాహతుకు మించిన ఖర్చులు చేస్తరు. ఇలా ఫ్యామిలీ మెంబర్స్ తనమీద ఆధారపడటాన్ని ప్రేమ అనే భ్రమలో ఉంటరు.
అగ్రెసివ్ : పిల్లలు, భార్య, పేరెంట్స్ మీద బాగా ప్రేమ చూపుతరు. కావాలన్నది అడుగుతరు. కానీ, వాళ్లని కాదంటే తట్టుకోలేరు. చిన్న పొరపాటు జరిగినా రిలేషన్ ని కట్ చేసుకుంటరు. 'ఇంత ప్రేమ చూపించినా.. నా మాట వినలే, నేను చెప్పింది చేయలే' అని తరచూ తిడతరు. చిన్న చిన్న వాటికే ఎక్కువగా కోపం పెంచుకుంటరు. రిలేషన్ కట్ చేసుకుంటరు. వాళ్ల ఇష్ట ప్రకారం జరుగుతున్నంత సేపు అతి ప్రేమను, అట్ల జరగ కుంటే ద్వేషాన్ని చూపిస్తరు.
గెలుపుకి బలం : ఫ్యామిలీని చూసుకోవడంలో మూడు రకాల మనస్తత్వాలుంటయి. సబ్ మెసివ్, అగ్రెసివ్ వాళ్ల సమస్యలకు మూలం భ్రమల్లో ఉండటమే. ఎప్పు డైనా సమస్య వస్తే అప్పుడే వాస్తవంలోకి వస్తారు. అసెర్టివ్ మనస్తత్వం ఉన్నవాళ్లు వాస్తవంలో ఉంటారు కాబట్టి సమస్య రాదు. ఇలాంటి వాళ్లు ఫ్రెండ్స్, బిజినెస్ పార్టనర్స్, ఫ్యామిలీ మెంబర్స్ రిలేషన్ ని లాంగ్ టైమ్ నిలుపుకుంటరు. దానికి కారణం మొహమాటం, భ్రమలు లేకపోవడమే. అది వదిలేస్తే అందరూ సరైన నిర్ణయాలు తీసు కుంటరు. నిర్ణయమే గెలుపుకి సగం బలం..


