☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Ajinkya Shinde | సీజేపీ నిరసనల బాధ్యతలు అజింక్య షిండేకు.. ఆయన ఎవరంటే?

Ajinkya Shinde | మహారాష్ట్రలోని తీరప్రాంత పట్టణమైన అలీబాగ్‌కు చెందిన అజింక్య షిండే చాలా ఏళ్లుగా అభిజీత్ దీప్కేకు సన్నిహితుడు. 2016లో గోవాలో దీప్కేను మొదటిసారి ఆయన కలిసినట్లు సమాచారం. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) జాతీయ సంస్థాగత వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా అజింక్య షిండే ఉన్నారు.
Ajinkya Shinde | సీజేపీ నిరసనల బాధ్యతలు అజింక్య షిండేకు.. ఆయన ఎవరంటే?

న్యూఢిల్లీ: సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే, ఆయన బృందాన్ని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్లాన్‌ ‘బి’ని సీజేపీ అమలు చేయనున్నది. (Ajinkya Shinde) ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌ను ఆ పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్‌తో శనివారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద తలపెట్టిన నిరసనల బాధ్యతను కీలక సభ్యుడైన అజింక్య షిండేకు అప్పగించింది. దీంతో అభిజీత్ దిప్కే గైర్హాజరీలో జంతర్ మంతర్ వద్ద జరిగే ఆందోళనకు నాయకత్వం వహించనున్న ఆయన ఎవరు అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

కాగా, మహారాష్ట్రలోని తీరప్రాంత పట్టణమైన అలీబాగ్‌కు చెందిన అజింక్య షిండే చాలా ఏళ్లుగా అభిజీత్ దీప్కేకు సన్నిహితుడు. 2016లో గోవాలో దీప్కేను మొదటిసారి ఆయన కలిసినట్లు సమాచారం. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) జాతీయ సంస్థాగత వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా అజింక్య షిండే ఉన్నారు. సీజేపీ ముంబై విభాగంలో కీలక వ్యక్తి. ఈ నెల ప్రారంభంలో ముంబైలో జరిగిన ‘ప్రెజర్‌ గ్రూప్‌’ ఆందోళన కార్యక్రమానికి ఆయన నిర్వాహకుడిగా వ్యవహరించారు.

మరోవైపు అజింక్య షిండే గతంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్) మహారాష్ట్ర బృందానికి సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా పనిచేశారు. ఆ పార్టీ కోసం పూర్తిస్థాయిలో పనిచేయడానికి తన కార్పొరేట్ ఉద్యోగాన్ని ఆయన వదిలేశారు. ఆప్‌లో చేరిన తర్వాత గోవా ఎన్నికల కోసం ఒక సంవత్సరం పూర్తిగా తన సమయాన్ని ఆయన కేటాయించారు. గోవా అసెంబ్లీ ఎన్నికలలో ఖాతా తెరువడంలో ఆప్‌ విఫలమైనప్పటికీ ఆ పార్టీ పట్ల అజింక్య నిబద్ధతతో ఉన్నారు. ఆప్ మహారాష్ట్ర బృందంతో కలిసి ఆయన పనిచేశారు. మహారాష్ట్రలోని ప్రతి జిల్లాలో అజింక్య షిండే పర్యటించినట్లు తెలుస్తున్నది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Mrunal Takhur | ఇతరుల జీవితాలపై కామెంట్స్ చేయడానికి మీరెవరు.. మృణాల్ ఠాకూర్ సీరియ‌స్Shashi Tharoor | ఎమర్జెన్సీ కాదు.. ఇది ఎమర్‌ జెన్ జీ.. ఢిల్లీలో పోలీసుల దిగ్బంధనంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com