☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Shankarsinh Vaghela | ప‌టేళ్లు, బ్రాహ్మ‌ణులు పాకీ ప‌నులు చేయాల‌న్న వాఘేలా.. మండిప‌డుతున్న అగ్ర‌వ‌ర్ణాలు..!

Shankarsinh Vaghela | గుజరాత్ (Gujarat) మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయ‌కుడు శంకర్‌సింహ్ వాఘేలా (Shankar Sinh Vaghela) తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న ప‌టేళ్లు (Patels), బ‌నియాలు (Baniyalu), బ్రాహ్మ‌ణులు (Brahmins) పాకీ ప‌నులు చేయాల‌ని వాఘేలా వ్యాఖ్యానించారు.
Shankarsinh Vaghela | ప‌టేళ్లు, బ్రాహ్మ‌ణులు పాకీ ప‌నులు చేయాల‌న్న వాఘేలా.. మండిప‌డుతున్న అగ్ర‌వ‌ర్ణాలు..!

Shankarsinh Vaghela : గుజరాత్ (Gujarat) మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయ‌కుడు శంకర్‌సింహ్ వాఘేలా (Shankar Sinh Vaghela) తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న ప‌టేళ్లు (Patels), బ‌నియాలు (Baniyalu), బ్రాహ్మ‌ణులు (Brahmins) పాకీ ప‌నులు చేయాల‌ని వాఘేలా వ్యాఖ్యానించారు. అలా చేస్తే తాను నెలకు రూ.50,000 వేత‌నంగా ఇస్తానని అన్నారు. ఈ వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దంగా మారాయి.

నర్మదా జిల్లాలోని సాగ్‌బారాలో ఈ నెల 2న‌ జరిగిన ఆదివాసీ రైతుల సమావేశంలో వాఘేలా మాట్లాడారు. ఈ సందర్భంగా రిజర్వేషన్‌ అంశాన్ని ప్రస్తావిస్తూ.. అది ఎవరో ఇస్తున్న భిక్ష కాదని, దశాబ్దాలుగా అనుభవించిన వివక్షకు బదులుగా లభించిన హక్కు అని అన్నారు. రిజర్వేషన్లను వ్యతిరేకించే పటేల్, బనియా, బ్రాహ్మణ సామాజిక వర్గాలను ఆయ‌న తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. అయితే వాఘేలా వ్యాఖ్యలపై బీజేపీ, పాటీదార్, బ్రాహ్మణ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

బీజేపీ నేత, బ్రహ్మ సమాజ్ నాయకుడు యజ్ఞేశ్ దవే స్పందిస్తూ.. వాఘేలానే తన ఇంట్లో ఆ పని చేస్తే నెలకు రూ.5 లక్షలు వేత‌నం ఇస్తానని ప్రతి సవాల్ చేశారు. పాటీదార్ నాయకుడు అల్పేష్ కథీరియా కూడా వాఘేలా తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వాఘేలా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన కార్య‌క్ర‌మంలో గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమిత్ చావ్డాతోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఇదే సమయంలో శంకర్‌సింహ్ వాఘేలా తిరిగి కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

2017లో పార్టీని వీడిన ఆయన.. బీజేపీని ఓడించేందుకు తిరిగి కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధమని ఇటీవల ప్రకటించారు. దీనికి సంబంధించిన చర్చలు చివరిదశలో ఉన్న‌ట్లు సమాచారం. త్వరలో జరగనున్న గాంధీనగర్ మున్సిపల్ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ తరఫున ప్రచారం కూడా చేయనున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతుండగా.. కాంగ్రెస్‌లో ఆయన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Mandadi | నెల రోజులు కూడా తిర‌గ‌క‌ముందే ఓటీటీలోకి ‘మండాడి’.. స్ట్రీమింగ్ తేదీ ఇదేనా?Digital Screens | డిజిట‌ల్ తెర‌ల‌ను ఎక్కువ సేపు వీక్షిస్తున్నారా.. కంటి స‌మ‌స్య‌లు పెరుగుతున్నాయంటున్న నిపుణులు.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com