☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

శమీ, సిరాజ్‌లను వదిలేసి వీళ్లతోనా వరల్డ్ కప్ గెలిచేది..?

ఐసీసీ టోర్నీలు వస్తున్నాయంటే చాలు.. టీమిండియా మేనేజ్‌మెంట్‌కు ప్రయోగాల జ్వరం పట్టుకుంటుంది. సరిగ్గా ఇదే తరహా అనాలోచిత ప్రయోగానికి గువాహటి వన్డే వేదికైంది. అనుభవం లేని పేస్ అటాక్‌ను నమ్ముకుని బరిలోకి దిగిన భారత బౌలింగ్ యూనిట్‌ను వెస్టిండీస్ బ్యాటర్లు జుట్టు ముడేసుకుని మరీ బాదారు. నిర్ణీత 50 ఓవర్లలో వెస్టిండీస్ ఏకంగా 405 పరుగుల భారీ స్కోరు బోర్డుపై పెట్టిందంటే.. మన బౌలర్ల లైన్ అండ్ లెంగ్త్ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వరల్డ్ […] The post శమీ, సిరాజ్‌లను వదిలేసి వీళ్లతోనా వరల్డ్ కప్ గెలిచేది..? appeared first on Telugu Rajyam.
శమీ, సిరాజ్‌లను వదిలేసి వీళ్లతోనా వరల్డ్ కప్ గెలిచేది..?

ఐసీసీ టోర్నీలు వస్తున్నాయంటే చాలు.. టీమిండియా మేనేజ్‌మెంట్‌కు ప్రయోగాల జ్వరం పట్టుకుంటుంది. సరిగ్గా ఇదే తరహా అనాలోచిత ప్రయోగానికి గువాహటి వన్డే వేదికైంది. అనుభవం లేని పేస్ అటాక్‌ను నమ్ముకుని బరిలోకి దిగిన భారత బౌలింగ్ యూనిట్‌ను వెస్టిండీస్ బ్యాటర్లు జుట్టు ముడేసుకుని మరీ బాదారు. నిర్ణీత 50 ఓవర్లలో వెస్టిండీస్ ఏకంగా 405 పరుగుల భారీ స్కోరు బోర్డుపై పెట్టిందంటే.. మన బౌలర్ల లైన్ అండ్ లెంగ్త్ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలు గెలవాలంటే పక్కా ప్లానింగ్ ఉండాలి కానీ, ఇలాంటి గల్లీ స్థాయి బౌలింగ్ అటాక్‌తో వెళితే భవిష్యత్తు శూన్యమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వన్డే క్రికెట్‌లో పవర్‌ప్లేలో, డెత్ ఓవర్లలో మ్యాచ్‌లను మలుపు తిప్పగల సత్తా ఉన్న మహ్మద్ శమీ, మహ్మద్ సిరాజ్ వంటి సీనియర్లను ఈ సిరీస్ లో పక్కనబెట్టడం వెనుక అసలు వ్యూహం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. బుమ్రా లేని లోటు స్పష్టంగా కనిపిస్తున్నా, అనుభవజ్ఞులైన పేసర్లను కాదని గుర్నూర్ బ్రార్, ఆకిబ్ నబీ లాంటి జూనియర్లకు నేరుగా అంతర్జాతీయ క్యాప్స్ ఇచ్చి చేతులు కాల్చుకున్నారు. గుర్నూర్ బ్రార్ 10 ఓవర్లలో ఏకంగా 96 పరుగులు సమర్పించుకోగా, అరంగేట్రం చేసిన ఆకిబ్ నబీ 8.5 ఓవర్లలోనే 84 పరుగులు ఇచ్చి వికెట్ లేకుండా పీడకల లాంటి డెబ్యూని మూటగట్టుకున్నాడు. ప్రసిద్ధ్ కృష్ణ కేవలం 5 ఓవర్లలోనే 45 పరుగులు ఇచ్చి నెలకు ముందే చేతులెత్తేశాడు.

మరో ఏడాదిన్నర కాలంలో జరగబోయే 2027 వన్డే ప్రపంచకప్‌కు బలమైన పునాది వేయాల్సిన సమయంలో.. ఇలాంటి దారుణమైన రికార్డులను నమోదు చేయడం అభిమానులను కలవరపెడుతోంది. కుల్దీప్ యాదవ్ (65/2), రవీంద్ర జడేజా (68/2) వంటి స్పిన్నర్లు కాస్త పరుగలను నియంత్రించే ప్రయత్నం చేసినా.. పేస్ విభాగం పూర్తిగా విఫలమైంది. సీనియర్ల అనుభవాన్ని గౌరవించకుండా, కేవలం ఐపీఎల్ ప్రదర్శనలు లేదా దేశీవాళీ ఆటగాళ్లను అంతర్జాతీయ వేదికలపై నేరుగా ప్రయోగశాల లాగా వాడటం వల్ల టీమిండియా పరువు గాల్లో కలవడమే కాకుండా, వరల్డ్ కప్ కలలు కూడా కల్లలయ్యే ప్రమాదం పొంచి ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

The post శమీ, సిరాజ్‌లను వదిలేసి వీళ్లతోనా వరల్డ్ కప్ గెలిచేది..? appeared first on Telugu Rajyam.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← పవన్ కళ్యాణ్ మరో సంచలన నిర్ణయం..!బీజేపీలోకి వెంకయ్య నాయుడు రీ-ఎంట్రీ..? యూపీ ట్రబుల్ షూటర్..? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com