☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

చైనా అధ్యక్షుడిని విమానం దగ్గరకు వెళ్లి తీసుకొచ్చిన ట్రంప్: అమెరికా చరిత్రలో సెకండ్ టైం ఇలా...

చైనా అధ్యక్షుడిని విమానం దగ్గరకు వెళ్లి తీసుకొచ్చిన ట్రంప్: అమెరికా చరిత్రలో సెకండ్ టైం ఇలా...
చైనా అధ్యక్షుడిని విమానం దగ్గరకు వెళ్లి తీసుకొచ్చిన ట్రంప్: అమెరికా చరిత్రలో సెకండ్ టైం ఇలా...
చైనా అధ్యక్షుడిని విమానం దగ్గరకు వెళ్లి తీసుకొచ్చిన ట్రంప్: అమెరికా చరిత్రలో సెకండ్ టైం ఇలా...

వాషింగ్టన్: మూడు రోజుల పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ అమెరికా పర్యటనకు వెళ్లారు. మేరీలాండ్‌లోని వైమానిక స్థావరం జాయింట్ బేస్ ఆండ్రూస్‌ (Joint Base Andrews)కు చేరుకున్న జిన్‌పింగ్ దంపతులకు డొనాల్డ్ ట్రంప్, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి గ్రాండ్ వెల్కమ్ పలికారు. అమెరికాతో ఉప్పు నిప్పులా వ్యవహారించే చైనా అధ్యక్షుడికి ప్రోటోకాల్ పక్కనబెట్టి ట్రంప్ స్వయంగా ఎయిర్ పోర్టుకు వెళ్లి వెల్కమ్ చెప్పడం హాట్ టాపిక్‎గా మారింది.

సాధారణంగా అమెరికా అధ్యక్షులు విదేశీ నేతలకు ఎయిర్ పోర్టుకు వెళ్లి స్వాగతం పలకరు. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లోనే ఆతిథ్యం ఇస్తారు. ఒక అమెరికా అధ్యక్షుడు విమానాశ్రయానికి వెళ్లి విదేశీ నేతకు స్వాగతం పలకడం గడిచిన 60 ఏళ్లలో (1962 తర్వాత) ఇదే ఫస్ట్ టైమ్. చివరగా 1962లో అప్పటి ప్రెసిడెంట్ జాన్ ఎఫ్. కెన్నెడీ బ్రిటన్ ప్రధాని హెరాల్డ్ మాక్‌మిలన్‌కు ఇలా ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలికారు.

60 ఏండ్ల తర్వాత తాజాగా ట్రంప్ ఎయిర్ పోర్టుకు వెళ్లి జిన్ పింగ్‎కు వెల్కమ్ చెప్పడం విశేషం. ఈ సందర్భంగా జిన్ పింగ్‎కు ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం లభించింది. చైనా అధ్యక్షుడి కోసం రన్‌వేపై దాదాపు 100 అడుగుల రెడ్ కార్పెట్ పరిచారు. 21 గన్ సెల్యూట్, సైనిక బ్యాండ్ వాయిద్యాల మధ్య అధికారులు స్వాగతం పలికారు.

జిన్ పింగ్, ట్రంప్ మధ్య కీలక అంశాలపై చర్చ

ఈ పర్యటనలో భాగంగా జిన్ పింగ్, ట్రంప్ మధ్య ఉన్నత స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. వాణిజ్యం, తైవాన్ సంక్షోభం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), అంతర్జాతీయ భద్రతపై ఇరుదేశాధి నేతలు చర్చించనున్నారు. రష్యా విషయంలో అమెరికా, చైనా మధ్య విభేదాల నేపథ్యంలో ట్రంప్, జిన్ పింగ్ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.


⬇ Full News JPG⬇ Short News JPG
← Telangana govt forms panel to probe lands owned by BRS leaders, associatesవినాయక నిమజ్జనం.. సెప్టెంబర్ 25 అనంత చతుర్దశి రోజు.. గంగమ్మ ఒడికి చేర్చేందుకు శుభముహూర్తం ఇదే,,! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com