☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

Aadi Saikumar | వైఫల్యాలు వస్తే కెరీర్‌ ముగిసినట్లా? నెటిజన్‌ పోస్ట్‌పై మండిపడ్డ ఆది సాయికుమార్‌!

Aadi Saikumar | సినీ రంగంలో ప్రతి ఒక్కరి ప్రయాణం వెనుక ఎంతో కఠిన శ్రమ, సంఘర్షణ దాగుంటాయని టాలీవుడ్ యువ నటుడు ఆది సాయికుమార్‌ స్పష్టం చేశారు.
Aadi Saikumar | వైఫల్యాలు వస్తే కెరీర్‌ ముగిసినట్లా? నెటిజన్‌ పోస్ట్‌పై మండిపడ్డ ఆది సాయికుమార్‌!

సినీ రంగంలో ప్రతి ఒక్కరి ప్రయాణం వెనుక ఎంతో కఠిన శ్రమ, సంఘర్షణ దాగుంటాయని టాలీవుడ్ యువ నటుడు ఆది సాయికుమార్‌ స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికగా కొంతమంది నెటిజన్లు హీరోల కెరీర్‌పై చేస్తున్న తప్పుడు ప్రచారాలు, వ్యంగ్య కామెంట్స్‌పై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫ్లాపులు వచ్చినంత మాత్రాన ఎవరి కెరీర్‌ ముగిసిపోయినట్లు కాదని, ప్రతి నటుడి ప్రయాణంలోనూ ఎన్నో ఒడుదొడుకులు సహజంగానే ఉంటాయని ఆయన హితవు పలికారు. సెలబ్రిటీల ఫాలోయింగ్‌పై ఓ నెటిజన్ పెట్టిన ప్రతికూల పోస్ట్‌కు ఆది సాయికుమార్ తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ప్రతి హీరో ఎంతో కష్టపడతారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా తన తండ్రి (సాయికుమార్) పడిన ఇబ్బందులను, అలాగే మాస్ మహారాజా రవితేజ ప్రారంభ రోజుల్లో ఎదుర్కొన్న సవాళ్లను ఆయన ఉదాహరణగా ప్రస్తావించారు.

ఈ సందర్భంగా సోషల్ మీడియా తీరుపై ఆది ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా రంగాన్ని వేడుకలా ఆస్వాదించాల్సిన సోషల్ మీడియా వేదికలు.. నేడు అభిమానుల మధ్య అనవసరమైన యుద్ధాలు, కుమ్ములాటలకు అడ్డాగా మారుతున్నాయని విమర్శించారు. ఎదుటివారిని కించపరిచేలా ట్రోల్స్ చేయడం మానేసి, వారిని గౌరవించడం మరియు ప్రోత్సహించడం నేర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సినీ పరిశ్రమలో జయాపజయాలు కేవలం ఒక భాగం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← William O’Rourke | న్యూజిలాండ్‌కు మరో ఎదురుదెబ్బ.. భారత్‌తో వన్డే, టెస్టులకు స్టార్ పేసర్ దూరం..!CJP Protest | మమతా బెనర్జీ, కేజ్రీవాల్, దీప్కే.. ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్న ప్రముఖులు వీరే →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com