☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

William O’Rourke | న్యూజిలాండ్‌కు మరో ఎదురుదెబ్బ.. భారత్‌తో వన్డే, టెస్టులకు స్టార్ పేసర్ దూరం..!

William O’Rourke: భారత జట్టుతో సిరీస్‌కు ముందే న్యూజిలాండ్‌ (Newzealand) జట్టును వరసగా గాయాలు వెంటడుతున్నాయి.కివీస్ కష్టాలను మరింత పెంచుతూ పేసర్ విలియం ఓరూర్కీ (William O’Rourke) కూడా అందుబాటులో లేడు.
William O’Rourke | న్యూజిలాండ్‌కు మరో ఎదురుదెబ్బ.. భారత్‌తో వన్డే, టెస్టులకు స్టార్ పేసర్ దూరం..!

William O’Rourke: భారత జట్టుతో సిరీస్‌కు ముందే న్యూజిలాండ్‌ (Newzealand) జట్టును వరసగా గాయాలు వెంటడుతున్నాయి. ఇప్పటికే ఓపెనర్ రచిన్ రవీంద్ర ఆస్ప్రతి పాలవ్వగా.. తాజాగా మార్క్ చాప్‌మన్, జాక్ ఫోక్స్‌లు సైతం గాయపడ్డారు. కివీస్ కష్టాలను మరింత పెంచుతూ పేసర్ విలియం ఓరూర్కీ (William O’Rourke) కూడా అందుబాటులో లేడు. భారత్‌తో వన్డే, టెస్టు సిరీస్‌లో కీలకం అవుతాడని రూర్కీపై భారీ ఆశలు పెట్టుకున్న బ్లాక్ క్యాప్స్ చివరకు అతడి సేవల్ని కోల్పోయింది. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ లోపు రూర్కీ ఫిట్‌గా మారే అవకాశముంది.

న్యూజిలాండ్ క్రికెట్ జట్టు వరసగా కీలక ఆటగాళ్ల సేవల్ని కోల్పోతోంది. ఇప్పటికే ప్రకటన షూట్‌ సమయంలో రచిన్ రవీంద్ర గాయపడగా.. మార్క్ చాప్‌మన్‌, జాక్ ఫోక్స్ సైతం ఇంజూరీకి గురయ్యారు. దీంతో ఈ ఇద్దరూ భార‌త్‌తో జ‌రిగే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు దూరం కానున్నారు. ఈ షాకింగ్ వార్త నుంచి తేరుకోకముందే పేసర్ విలియం ఓ రూర్కీ సైతం టీమిండియా సిరీస్‌కు అందుబాటులో ఉండడం లేదు. తొడ కండరాలు, కాలిపిక్క నొప్పితో బాధపడుతున్న రూర్కీ ప్రస్తుతం పునరావాస కేంద్రంలో ఉన్నాడు.

భారత్‌తో వన్డే, టెస్టుల్లో అతడిని ఆడించాలని న్యూజిలాండ్ క్రికెట్ భావించినా.. ఆస్ట్రేలియా పర్యటనను దృష్టిలో ఉంచుకొని విశ్రాంతినిచ్చింది. ‘పటిష్టమైన టీమిండియాతో స్వదేశంలో జరుగనున్న వన్డే, టెస్టు సిరీస్‌కు రూర్కీ అందుబాటులో లేకపోవడం తమను తీవ్ర నిరాశకు గురిచేసింద’ని ప్రధాన కోచ్ రాబ్ వాల్టర్ పేర్కొన్నాడు.

అక్టోబర్ 22 నుంచి

అక్టోబ‌ర్‌ మూడో వారంలో మూడు ఫార్మాట్ల సిరీస్ కోసం న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది భారత జట్టు. అక్టోబర్ 22 నుంచి శ్రేయాస్ అయ్యర్ సేన, కివీస్‌ మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఆపై నవంబర్ 4వ నుంచి ఇరుజట్లు ఐదు వన్డేల్లో తలపడతాయి. అనంతరం నవంబర్ 19 నుంచి రెండు టెస్టుల సిరీస్‌లో ఆతిథ్య జట్టును టీమిండియా ఢీకొట్టనుంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← గోల్డ్ మెడల్స్ సాధించిన మేఘన కాంతిప్రియకు సన్మానంAadi Saikumar | వైఫల్యాలు వస్తే కెరీర్‌ ముగిసినట్లా? నెటిజన్‌ పోస్ట్‌పై మండిపడ్డ ఆది సాయికుమార్‌! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com