☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Air India Pilot Suspended : జ్యూరిచ్‌లో ఎయిర్ ఇండియా పైలట్‌కు షాక్.. టెస్ట్‌లో ఫెయిల్.. వెంటనే సస్పెన్షన్!

Air India Pilot Suspended : విమానం టేకాఫ్‌కు కొద్దిసేపటి ముందు పైలట్ మద్యం పరీక్షలో విఫలమయ్యారు. దీంతో ఆయన్ను విధుల నుంచి తప్పించి, అనంతరం సస్పెండ్ చేశారు.
Air India Pilot Suspended : జ్యూరిచ్‌లో ఎయిర్ ఇండియా పైలట్‌కు షాక్.. టెస్ట్‌లో ఫెయిల్.. వెంటనే సస్పెన్షన్!

Air India Pilot Suspended : జ్యూరిచ్ నుంచి ఢిల్లీకి బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విమానం టేకాఫ్‌కు కొద్దిసేపటి ముందు పైలట్ మద్యం పరీక్షలో విఫలమయ్యాడు. దీంతో ఆయన్ను విధుల నుంచి తప్పించి, అనంతరం సస్పెండ్ చేశారు. ఈ ఘటన సెప్టెంబర్ 6న జ్యూరిచ్ విమానాశ్రయంలో చోటుచేసుకున్నట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది.

Also Read : AP Government : ఏపీ సర్కార్ సరికొత్త నిర్ణయం..టాలెంటెడ్ కంటెంట్ క్రియేటర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లకు పండగే.. వీడియో పెట్టు పైసలు పట్టు!

ఎయిర్ ఇండియా AI 151 విమానం జ్యూరిచ్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. విమానం బయలుదేరే ముందు గ్రౌండ్ హ్యాండ్లింగ్ సిబ్బందికి పైలట్ నుంచి మద్యం వాసన వచ్చింది. అధికారులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు అప్రమత్తమై ఆయనకు ఆల్కహాల్ పరీక్ష నిర్వహించారు. పరీక్షలో అనుమతించిన పరిమితికి మించి ఆల్కహాల్ ఉన్నట్లు గుర్తించారు.

దీంతో పైలట్‌ను వెంటనే విమానం విధుల నుంచి తొలగించారు. అనంతరం ఆయనను ప్రయాణికుడిగా భారత్‌కు తిరిగి పంపించారు. ప్రస్తుతం ఆయన సస్పెన్షన్‌లో ఉన్నారని, తుది వైద్య పరీక్ష నివేదికతో పాటు దర్యాప్తు పూర్తయ్యే వరకు ఈ చర్య కొనసాగుతుందని ఎయిర్ ఇండియా తెలిపింది.

ఈ వ్యవహారంపై స్విట్జర్లాండ్‌ విమానయాన అధికారులు కూడా చర్యలు తీసుకుని, భారత పౌర విమానయాన నియంత్రణ సంస్థ DGCAకి సమాచారం అందించారు. ఘటనపై తదుపరి చర్యలను DGCA చేపట్టనుంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Shiva Jyothi : యాంక‌ర్ శివ‌జ్యోతి కూతురితో ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ భార్య‌, కూతురు.. క్యూట్ ఫోటోలుBharat Behera : పెళ్లి చేసుకున్న ఫ‌న్ బ‌కెట్ భ‌ర‌త్ బెహెరా.. ఫోటోలు వైర‌ల్.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com