☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?

Nithiin’s Alias Rukmini Movie Heroine: ‘భీష్మ’ తర్వాత వరుస ఫ్లాప్స్‌లతో సతమతమవుతున్న హీరో నితిన్.. ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ క్రమంలోనే కొత్త చిత్రం ‘అలియాస్ రుక్మిణీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమయ్యాడు. ‘దండోరా’ ఫేమ్ మురళీ కాంత్ దర్శకుడు. నేచురల్ స్టార్ నాని నిర్మాణ సంస్థ యూనానిమస్ ప్రొడక్షన్ సమర్పణలో దీప్తి గంటా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాని డిసెంబరు 4న విడుదల చేయనున్నట్లు శుక్రవారం (అక్టోబర్ 9) అధికారికంగా ప్రకటించారు. […]
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?

Nithiin’s Alias Rukmini Movie Heroine: ‘భీష్మ’ తర్వాత వరుస ఫ్లాప్స్‌లతో సతమతమవుతున్న హీరో నితిన్.. ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ క్రమంలోనే కొత్త చిత్రం ‘అలియాస్ రుక్మిణీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమయ్యాడు. ‘దండోరా’ ఫేమ్ మురళీ కాంత్ దర్శకుడు. నేచురల్ స్టార్ నాని నిర్మాణ సంస్థ యూనానిమస్ ప్రొడక్షన్ సమర్పణలో దీప్తి గంటా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాని డిసెంబరు 4న విడుదల చేయనున్నట్లు శుక్రవారం (అక్టోబర్ 9) అధికారికంగా ప్రకటించారు. అయితే హీరోయిన్ ఎవరన్నది మాత్రం చిన్న క్లూ కూడా ఇవ్వలేదు. దాంతో ఇంతకీ ఆ రుక్మిణీ ఎవరు అన్న ప్రశ్న అభిమానుల మనస్సులో మెదులుతోంది.

అలియాస్ రుక్మిణీలో టైటిల్ రోల్ పోషించేది బాలీవుడ్ భామ ఆఫియా సయ్యద్ అని తెలుస్తోంది. ఆఫియా ఎవరో కాదు.. బాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్ సాజిద్ నడియాద్ వాలా మేనకోడలు. ఇటీవల వచ్చిన ‘ప్రేమ్ కీటాను’తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మలయాళ మూవీ ప్రేమలుకు రీమే‌గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. నెక్ట్స్ టాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైందట. రుక్మిణీ అనే హీరోయిన్ పాత్ర ఎవరు చేస్తున్నారనేది వచ్చే మంగళవారం చెబుతామని చిత్ర యూనిట్ పేర్కొంది. రుక్మిణీ టైటిల్ రోల్ పోషించేది ఆఫియానా లేదా మరొకరా అనేది ప్రస్తుతానికి సస్పెన్సే. అక్టోబర్ 13న అసలు విషయం తేలనుంది. నితిన్‌ ఈ సినిమాలో కృష్ణ అనే పాత్రలో కనిపించనున్నాడు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com