☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

NRI | కేసీఆర్‌, కేటీఆర్‌ల‌పై విషం చిమ్మడమే రేవంత్ రెడ్డి ఎజెండా : అనిల్ బైరెడ్డి

NRI | సిరిసిల్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడారని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా నాయ‌కుడు అనిల్ బైరెడ్డి అన్నారు.
NRI | కేసీఆర్‌, కేటీఆర్‌ల‌పై విషం చిమ్మడమే రేవంత్ రెడ్డి ఎజెండా : అనిల్ బైరెడ్డి

NRI | సిరిసిల్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడారని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా నాయ‌కుడు అనిల్ బైరెడ్డి అన్నారు. కేవలం కేసీఆర్,కేటీఆర్ పై అక్కసు వెళ్లగట్టేందుకే సిరిసిల్లలో సభను నిర్వహించారని ఆయన అన్నారు. సిరిసిల్లను అద్భుతంగా అభివృద్ధి చేసింది కేటీఆర్ మాత్రమేనని, సిరిసిల్ల నేతన్నల బతుకులు మార్చింది కేటీఆర్. అలాంటి నాయకుడి పై చిల్లర విమర్శలు చేయడం రేవంత్ రెడ్డికి తగదన్నారు. బీఆర్ఎస్ పాలనలో నేతన్నల సంక్షేమమే ఎజెండాగా కేసీఆర్, కేటీఆర్ ముందుకు సాగారని, రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు అయినాక నేతన్నలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు.

నేతన్నలకు పదవులు ఇస్తామని రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని, పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన కొండా సురేఖను పదవి నుంచి భర్తరఫ్ చేసిన వ్యక్తి నేతన్నలను ఉద్దరిస్తానని మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. సిరిసిల్లను జిల్లా చేసిన ఘనత కేటీఆర్‌కు దక్కుతుందని, సిరిసిల్లలో మెడికల్ కళాశాల ఇంజినీరింగ్ కళాశాలలను ఏర్పాటు చేసిన వ్యక్తి కేటీఆర్అన్నారు. ప్రతిపక్షనేతల ఆస్తులపై అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటు. రేవంత్ రెడ్డి తన వైఫల్యాలనుంచి ప్రజల దృష్టి మరలచేందుకు సిరిసిల్ల వేదికగా డైవర్షన్ డ్రామాకు తెరతీసారన్నారు. రేవంత్ రెడ్డి ఇకనైనా సోయి తెచ్చుకొని ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నట్టు అనిల్ బైరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Sardar 2 OTT | ఓటీటీలోకి వ‌చ్చేసిన కార్తీ ‘సర్దార్ 2’.. స్ట్రీమింగ్ ఎక్క‌డంటే!Vijaya Reddy | దానం నాగేందర్ ఎంపీ అభ్యర్థి, నేను ఎమ్మెల్యే అభ్యర్థిని ..! విజయా రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com