☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Vijaya Reddy | దానం నాగేందర్ ఎంపీ అభ్యర్థి, నేను ఎమ్మెల్యే అభ్యర్థిని ..! విజయా రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు

Vijaya Reddy | ఖైరతాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉపపోరు(Khairatabad by-election) నగర రాజకీయాన్ని మరింత వేడెక్కిస్తున్నది.
Vijaya Reddy | దానం నాగేందర్ ఎంపీ అభ్యర్థి, నేను ఎమ్మెల్యే అభ్యర్థిని ..! విజయా రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు

Vijaya Reddy | ఖైరతాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉపపోరు(Khairatabad by-election) నగర రాజకీయాన్ని మరింత వేడెక్కిస్తున్నది. ఈ క్ర‌మంలో ఉప ఎన్నిక‌పై దివంగ‌త పీజేఆర్ కూత‌రు విజ‌యా రెడ్డి(Vijaya Reddy) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పీజేఆర్ పేరు లేనిది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ముందుకు వెళ్లద‌ని స్ప‌ష్టం చేశారు. పీజేఆర్ బిడ్డకు ఈసారైనా న్యాయం జరుగుతుందని ప్రజలు అనుకుంటున్నారు. దానం నాగేందర్‌ను జాతీయ రాజకీయాలకు పంపి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తార‌ని ఆమె కుండ‌బ‌ద్ధ‌లు కొట్ట‌డంతో కాంగ్రెస్ పార్టీలో ముస‌లం మొద‌లైంది. ఈదఫా తనదే టికెట్‌ అనే ధీమాలో ఉన్న ఆమె ఈ మేరకు ఆమె ఇప్పటికే అనుచరులకు సంకేతాలివ్వడంతో క్షేత్రస్థాయిలో వారంతా హడావిడి మొదలుపెట్టినట్లు తెలుస్తున్నది. దానం నాగేందర్ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియదు.. ఆయన నిలకడ లేని మనిషి అందుకే దానం నాగేందర్ కంటే కాంగ్రెస్ పార్టీకి విజయా రెడ్డినే సరైన అభ్యర్థి అని గ‌తంలో కాంగ్రెస్ నాయకుడు నుమాన్ మహమ్మద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

మ‌రోవైపు ఇటీవల పార్టీ ఫిరాయింపు వేటుపడి పదవిని కోల్పోయిన దానం నాగేందర్‌ మాత్రం ధీమాగా తనకే టికెట్‌ అని చెప్పుకునే పరిస్థితి లేకపోవడం ఆయన అనుచరుల్ని అయోమయానికి గురి చేస్తున్నది. ముఖ్యంగా ఉపపోరు బరిలో నిలువకుంటే ప్రత్యక్ష రాజకీయాలే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం పొంచి ఉండగా… పోరులో నిలిస్తే కీలకమైన విజయారెడ్డి వర్గం సహకరించేలా లేకపోవడంతో దానం పరిస్థితి ముందు నుయ్యి.. వెనక గొయ్యిలా తయారైందని ఆయన అనుచరులే వాపోతున్నారు. ఈసారి గెలుపు క‌ష్ట‌మేన‌ని ఆ పార్టీ త‌ల‌లు పట్టుకోవ‌డం కొస‌మెరుపు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← NRI | కేసీఆర్‌, కేటీఆర్‌ల‌పై విషం చిమ్మడమే రేవంత్ రెడ్డి ఎజెండా : అనిల్ బైరెడ్డిRevanth Reddy Sabha | రేవంత్‌ సభకు మనుషుల తరలింపు.. కాంగ్రెస్‌ నేతల వాగ్వాదం చూడండి →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com