☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై సమన్లు.. కోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి! • Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్‌ సంచలన వ్యాఖ్యలు! • ట్రెజర్ హంటర్‌గా నాగ చైతన్య.. ‘వృషకర్మ’ కొత్త పోస్టర్ విడుదల! • మీ నంబర్ Truecallerలో కనిపిస్తోందా? ఈ ట్రిక్స్‌ ద్వారా డైరెక్టరీ నుండి తొలగించండి..! • Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..! • భారత్‌తో క్రికెట్ ఆడినా మాకు పైసా రావడం లేదు.. వెస్టిండీస్ బోర్డు ఆవేదన • Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’ మూవీలో బాలయ్య రిజెక్ట్ చేసిన రోల్ ఎవరు చేశారో తెలుసా? • YS Jagan : ఎంపీ మిథున్ రెడ్డికి వైఎస్ జగన్ ఫోన్.. దాడి ఘటనపై ఆరా! చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు.. •

AP Government : ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు భారీ ఊరట లభించినట్లే..!

AP Government : ఏపీలోని పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు మేలుజరిగేలా సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
AP Government : ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు భారీ ఊరట లభించినట్లే..!

AP Government : ఏపీలోని పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు మేలుజరిగేలా సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావంతో దేశీయంగా పలు ఉత్పత్తుల ధరలు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. వాటి భారం పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలపై పడకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

Also Read : AP Elections Seat Sharing : జనసేనకు నాలుగు.. బీజేపీకి రెండు కార్పొరేషన్లు.. స్థానిక ఎన్నికల్లో కూటమి సీట్లపై క్లారిటీ.. పార్టీల వారిగా లిస్ట్ ఇదే..

కూటమి ప్రభుత్వం ఇప్పటికే రైతు బజార్లలో కిలో సన్నబియ్యాన్ని రూ.50కి, ఉల్లిపాయలను రూ.35కి విక్రయిస్తున్న విషయం తెలిసిందే. బహిరంగ మార్కెట్లో వీటి ధరలు భారీగా ఉండటంతో ఆ భారం పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలపై పడకుండా ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు సబ్సిడీపై తక్కువ ధరకు బియ్యాన్ని, ఉల్లిపాయలను అందిస్తుంది. అదేతరహాలో ఇప్పుడు కందిపప్పును కూడా సబ్సిడీ ధరలకు అందించేందుకు ప్రభుత్వం దృష్టిసారించింది. ఈ మేరకు చర్యలుసైతం ప్రారంభించినట్లు తెలుస్తోంది. తద్వారా మూడేళ్లుగా నిలిచిపోయిన ఈ పథకాన్ని తిరిగి ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

ఎల్‌నినో ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సరియైన వర్షాలు పడకపోవటంతో పంటల సాగు తగ్గిపోతోంది. ఈ క్రమంలో కంది పంట దిగుబడులు తగ్గడంతో కొరత ఏర్పడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ కందిపప్పు ధరలు పెరుగుతున్నాయి. నాణ్యమైన కందిపప్పు కిలో ధర బహిరంగ మార్కెట్లో రూ.150కు చేరింది. దీంతో పేద, మధ్య తరగతి వర్గాలకు కందిపప్పు కొనుగోలు భారంగా మారింది. ఈ క్రమంలో తెల్లరేషన్ కార్డుదారులకు కిలో కందిపప్పు రూ.60 నుంచి రూ.75కే అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.

తెల్లరేషన్ కార్డు దారులకు సబ్సిడీపై కందిపప్పు అందించేందుకు 1.20లక్షల మెట్రిక్ టన్నుల కందులను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కేంద్రం నుంచి అనుమతి, కందుల కేటాయింపు లభిస్తే వాటిని కందిపప్పుగా మార్చి వినియోగదారులకు అందించాలని భావిస్తోంది. రాష్ట్రంలో సుమారు కోటి 50లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటికి సబ్సిడీ ధరలకు కందిపప్పు అందించాలంటే భారీ మొత్తంలో నిల్వలు అవసరం. రాష్ట్రం కోరిన 1.20లక్షల మెట్రిక్ టన్నుల కందుల విలువ సుమారు రూ.1200 కోట్లు ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే సన్నబియ్యం, ఉల్లిపాయలను తక్కువ ధరలకు అందిస్తున్న ప్రభుత్వం కందిపప్పును రైతు బజార్లలో తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకొస్తే పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు భారీ ఉపశమనం కలిగినట్లవుతుంది. అయితే, కేంద్రం స్పందన, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించే ధర, పంపిణీ పరిమాణం ఇలా తదితర అంశాలపై ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది.

మరోవైపు వంట నూనెలను కూడా తక్కువ ధరలకు సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రభుత్వం దృష్టిసారించినట్లు ఇప్పటికే పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అయితే, పామాయిల్ లీటర్ ఎంతకు అమ్ముతారో ఇంకా ప్రకటించలేదు. వీటితోపాటు పెసర పప్పు, మినుములు, చక్కెర కూడా సబ్సిడీపై అందించాలని తెల్లరేషన్ కార్డుదారులు కోరుతున్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG
← Director Maruthi : భార్య‌తో క‌లిసి పూజ‌లు నిర్వ‌హించిన ద‌ర్శ‌కుడు మారుతి.. ఫోటోలు వైర‌ల్‌..Ranabaali Review : రణబాలి మూవీ రివ్యూ: బ్రిటిష్ దోపిడీపై విజయ్ దేవరకొండ తిరుగుబాటు.. రష్మికతో ఎమోషనల్ మ్యాజిక్! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com