☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై సమన్లు.. కోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి! • Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్‌ సంచలన వ్యాఖ్యలు! • ట్రెజర్ హంటర్‌గా నాగ చైతన్య.. ‘వృషకర్మ’ కొత్త పోస్టర్ విడుదల! • మీ నంబర్ Truecallerలో కనిపిస్తోందా? ఈ ట్రిక్స్‌ ద్వారా డైరెక్టరీ నుండి తొలగించండి..! • Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..! • భారత్‌తో క్రికెట్ ఆడినా మాకు పైసా రావడం లేదు.. వెస్టిండీస్ బోర్డు ఆవేదన • Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’ మూవీలో బాలయ్య రిజెక్ట్ చేసిన రోల్ ఎవరు చేశారో తెలుసా? • YS Jagan : ఎంపీ మిథున్ రెడ్డికి వైఎస్ జగన్ ఫోన్.. దాడి ఘటనపై ఆరా! చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు.. •

పెమ్మసాని డైరెక్షన్.. మేడం గారి డెసిషన్..?

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల కౌంట్‌డౌన్ మొదలైన వేళ, గుంటూరు జిల్లా రాజకీయం అత్యంత ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి తరఫున గెలుపు గుర్రాలను బరిలోకి దించేందుకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే గుంటూరు లోక్‌సభ స్థానం పరిధిలోని మున్సిపాలిటీలు, జడ్పీ చైర్మన్ పదవితో పాటు ప్రతిష్టాత్మకమైన గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిని ఎంపిక చేసే పూర్తి బాధ్యతలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి […] The post పెమ్మసాని డైరెక్షన్.. మేడం గారి డెసిషన్..? appeared first on Telugu Rajyam.
పెమ్మసాని డైరెక్షన్.. మేడం గారి డెసిషన్..?

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల కౌంట్‌డౌన్ మొదలైన వేళ, గుంటూరు జిల్లా రాజకీయం అత్యంత ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి తరఫున గెలుపు గుర్రాలను బరిలోకి దించేందుకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే గుంటూరు లోక్‌సభ స్థానం పరిధిలోని మున్సిపాలిటీలు, జడ్పీ చైర్మన్ పదవితో పాటు ప్రతిష్టాత్మకమైన గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిని ఎంపిక చేసే పూర్తి బాధ్యతలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు పార్టీ హైకమాండ్ అప్పగించింది.

అయితే, ప్రస్తుతం క్షేత్రస్థాయిలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సాగుతున్న తీరును గమనిస్తున్న రాజకీయ వర్గాల్లో ఒక ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తోంది. కేంద్ర మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్ ఢిల్లీ వ్యవహారాలు, జాతీయ స్థాయి పరిపాలనలో బిజీగా ఉంటుండటంతో.. స్థానిక రాజకీయాల్లో ఆయన సతీమణి పెమ్మసాని శ్రీరత్న అత్యంత క్రియాశీలకమైన పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్‌కు అందుబాటులో ఉండటం, స్థానిక సమీకరణాలను బేరీజు వేయడంలో ఆమె చూపిస్తున్న చొరవ ఇప్పుడు గుంటూరు కూటమి నేతలను విశేషంగా ఆకర్షిస్తోంది.

దీంతో గుంటూరు మేయర్ పీఠాన్ని ఆశిస్తున్న నేతలు, జిల్లా పరిషత్ చైర్మన్ రేసులో ఉన్న ఆశావహులు, అలాగే పార్లమెంట్ పరిధిలోని వివిధ మున్సిపల్ చైర్మన్ పదవుల కోసం పోటీ పడుతున్న లీడర్లు అందరూ ఇప్పుడు శ్రీరత్నను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారని టాక్ వినిపిస్తోంది. కేంద్ర మంత్రి కంటే కూడా క్షేత్రస్థాయిలో సమయాన్ని కేటాయిస్తూ, నేతల అర్హతలను, వారి సామాజిక సమీకరణాలను పరిశీలిస్తుండటంతో.. టికెట్ ఆశిస్తున్న వారంతా ఆమె చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

సాధారణంగా రాజకీయాల్లో మహిళా ప్రాతినిధ్యం లేదా నేతల సతీమణుల జోక్యంపై విమర్శలు రావడం సహజం. కానీ ఇక్కడ పెమ్మసాని శ్రీరత్న వ్యవహరిస్తున్న తీరు వివాదాలకు తావులేకుండా, పార్టీ లైన్‌కు అనుగుణంగానే జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నట్లు సమాచారం. ఒకవైపు కేంద్ర మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్ అధికారిక నిర్ణయాలకు బాధ్యత వహిస్తుంటే.. మరోవైపు క్షేత్రస్థాయిలో శ్రీరత్న అందిస్తున్న సపోర్ట్, అభ్యర్థుల ఫిల్టరేషన్ ప్రక్రియ కూటమికి ఒక రకమైన పవర్‌ఫుల్ బ్యాక్‌బోన్‌లా మారిందని చెబుతున్నారు. ఏది ఏమైనా, గుంటూరు స్థానిక సమరంలో అభ్యర్థుల ఎంపిక వెనుక ఈ సరికొత్త ఇంటరాక్షన్ ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి.

The post పెమ్మసాని డైరెక్షన్.. మేడం గారి డెసిషన్..? appeared first on Telugu Rajyam.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← అభ్యర్థులు లేక అద్దె నేతలతోనే మేయర్ పీఠాలపై పవన్ కన్ను..?టీడీపీ కార్యకర్తల ఇగో హర్ట్ చేసిన వంశీ..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com