☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై సమన్లు.. కోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి! • Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్‌ సంచలన వ్యాఖ్యలు! • ట్రెజర్ హంటర్‌గా నాగ చైతన్య.. ‘వృషకర్మ’ కొత్త పోస్టర్ విడుదల! • మీ నంబర్ Truecallerలో కనిపిస్తోందా? ఈ ట్రిక్స్‌ ద్వారా డైరెక్టరీ నుండి తొలగించండి..! • Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..! • భారత్‌తో క్రికెట్ ఆడినా మాకు పైసా రావడం లేదు.. వెస్టిండీస్ బోర్డు ఆవేదన • Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’ మూవీలో బాలయ్య రిజెక్ట్ చేసిన రోల్ ఎవరు చేశారో తెలుసా? • YS Jagan : ఎంపీ మిథున్ రెడ్డికి వైఎస్ జగన్ ఫోన్.. దాడి ఘటనపై ఆరా! చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు.. •

టీడీపీ కార్యకర్తల ఇగో హర్ట్ చేసిన వంశీ..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ చేసిన తాజా వ్యాఖ్యలు అధికార తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఇగోను హర్ట్ చేశాయా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. గత ఎన్నికల్లో కూటమి విజయం తర్వాత తీవ్రమైన రాజకీయ ఒడిదొడుకులు, కేసులను ఎదుర్కొని ఇటీవల జైలు పరిణామాల తర్వాత బయటకు వచ్చిన వంశీ.. ఏమాత్రం తగ్గేదే లేదన్నట్టుగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌ను ఒక్కసారిగా షేక్ చేస్తున్నాయి. అధికార పార్టీ క్యాడర్‌ను తీవ్రంగా […] The post టీడీపీ కార్యకర్తల ఇగో హర్ట్ చేసిన వంశీ..! appeared first on Telugu Rajyam.
టీడీపీ కార్యకర్తల ఇగో హర్ట్ చేసిన వంశీ..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ చేసిన తాజా వ్యాఖ్యలు అధికార తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఇగోను హర్ట్ చేశాయా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. గత ఎన్నికల్లో కూటమి విజయం తర్వాత తీవ్రమైన రాజకీయ ఒడిదొడుకులు, కేసులను ఎదుర్కొని ఇటీవల జైలు పరిణామాల తర్వాత బయటకు వచ్చిన వంశీ.. ఏమాత్రం తగ్గేదే లేదన్నట్టుగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌ను ఒక్కసారిగా షేక్ చేస్తున్నాయి. అధికార పార్టీ క్యాడర్‌ను తీవ్రంగా రెచ్చగొట్టేలా ఆయన సంధించిన వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

వల్లభనేని వంశీ తనను వ్యతిరేకిస్తున్న శ్రేణులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “నన్ను జైలుకు పంపి కొందరు సంతోషపడుతున్నారు. నన్ను లోపలేసినవాడిని లోపలేసింది ఎవరో తెలుసుగా.. గుర్తుపెట్టుకోండి. నా వెనుక ఆయన ఉన్నారు. ఈ లెక్కలన్నీ త్వరలోనే తేలుస్తాయి. 2029లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచి జగన్ మళ్లీ సీఎం అవుతారు” అంటూ వంశీ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలందరూ సైలెంట్ అయిపోతారని భావిస్తున్న తరుణంలో.. వంశీ నేరుగా టీడీపీ అత్యుత్సాహాన్ని మరియు వారి ఇగోను టార్గెట్ చేస్తూ ఈ కామెంట్స్ చేయడం విశేషం.

సాధారణంగా కేసులు, జైలు పరిణామాల తర్వాత ఏ నాయకుడైనా కాస్త వ్యూహాత్మక మౌనం పాటిస్తారు. కానీ వంశీ మాత్రం తాజా ఇంటర్వ్యూలు, సోషల్ మీడియా వేదికగా మైండ్ గేమ్ మొదలుపెట్టారు. “నా వెనుక జగన్ ఉన్నారు” అని స్పష్టం చేయడం ద్వారా తన క్యాడర్‌లో ధైర్యాన్ని నింపడమే కాకుండా.. ఐదేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో మళ్లీ తామే అధికారంలోకి వస్తామని, అప్పుడు ప్రతి ఒక్కరి లెక్కలు సరిచేస్తామని హెచ్చరించడం టీడీపీ శ్రేణులకు మింగుడుపడటం లేదు. ఈ వ్యాఖ్యలు క్షేత్రస్థాయిలో ఉన్న టీడీపీ, కూటమి కార్యకర్తల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తుండగా.. రాబోయే రోజుల్లో కృష్ణా జిల్లా రాజకీయాల్లో వంశీ వర్సెస్ కూటమి పోరు మరింత ముదరనుందని స్పష్టమవుతోంది.

The post టీడీపీ కార్యకర్తల ఇగో హర్ట్ చేసిన వంశీ..! appeared first on Telugu Rajyam.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← పెమ్మసాని డైరెక్షన్.. మేడం గారి డెసిషన్..?ఇంద్రకీలాద్రిపై ఎంపీ, ఎమ్మెల్యేలకు విలువ లేదా..? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com