☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

ఇండియాలో టాప్ 10 రిచెస్ట్ యాక్టర్స్.. బాలీవుడ్‌లో నంబర్ 1గా 'బాద్‌షా'.. టాలీవుడ్ నుంచి నలుగురికి చోటు!

ఇండియాలో టాప్ 10 రిచెస్ట్ యాక్టర్స్.. బాలీవుడ్‌లో నంబర్ 1గా 'బాద్‌షా'.. టాలీవుడ్ నుంచి నలుగురికి చోటు!
ఇండియాలో టాప్ 10 రిచెస్ట్ యాక్టర్స్.. బాలీవుడ్‌లో నంబర్ 1గా 'బాద్‌షా'.. టాలీవుడ్ నుంచి నలుగురికి చోటు!
ఇండియాలో టాప్ 10 రిచెస్ట్ యాక్టర్స్.. బాలీవుడ్‌లో నంబర్ 1గా 'బాద్‌షా'.. టాలీవుడ్ నుంచి నలుగురికి చోటు!

వెండితెరపై డైలాగ్‌లతో థియేటర్లను హోరెత్తిస్తున్న ఇండియన్ స్టార్‌ హీరోలు సంపద సృష్టిలోనూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. లేటెస్ట్ గా విడుదలైన 'హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2026' (Hurun India Rich List 2026) నివేదిక ప్రకారం.. భారతీయ నటుల్లో అత్యంత ధనవంతుడిగా బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ అగ్రస్థానాన్ని మరో సారి నిలబెట్టుకున్నారు. 2023లో వచ్చిన 'పఠాన్', 'జవాన్', 'దుంకీ' తర్వాత సరైన థియేట్రికల్ రిలీజ్ లేకపోయినా.. వ్యాపార సామ్రాజ్యంతో తన నంబర్‌వన్ పీఠాన్ని చెక్కుచెదరకుండా కాపాడుకున్నారు..

అగ్రస్థానంలో షారూఖ్.

గతేడాది రూ. 12,490 కోట్లుగా ఉన్న షారూఖ్ ఆస్తి విలువ ఈసారి సుమారు 20 శాతం (రూ. 2,490 కోట్లు) తగ్గి రూ. 10,000 కోట్లకు చేరింది. అయినప్పటికీ, కాంపిటీషన్‌కు అందనంత ఎత్తులోనే నిలిచారు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) వంటి ప్రముఖ వ్యాపారాలే ఆయనకు ఈ అపార సంపదను సమకూర్చాయి.

ఆ తర్వాతి స్థానంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని రూ. 5,000 కోట్లుతో రెండో స్థానాన్ని సాధించారు. మూడో స్థానంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ రూ. 4,000 కోట్లతో నిలిచారు. గతేడాది రూ. 1,630 కోట్ల నుంచి భారీ జంప్ అయింది అమితాబ్ ఆస్తి. ఇక. సల్మాన్ ఖాన్ రూ. 3,000 కోట్లతో, HRX బ్రాండ్‌తో సత్తా చాటుతున్న హృతిక్ రోషన్ రూ. 2,500 కోట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచారు.

టాప్ 10 అత్యంత ధనిక నటులు (2026)

1).షారూఖ్ ఖాన్ రూ.10,000 కోట్లు
2) .నాగార్జున అక్కినేని రూ. 5,000 కోట్లు
3) అమితాబ్ బచ్చన్ రూ. 4,000 కోట్లు
4). సల్మాన్ ఖాన్ రూ. 3,000 కోట్లు
5). హృతిక్ రోషన్ రూ. 2,500 కోట్లు
6). అక్షయ్ కుమార్ రూ.2,300 కోట్లు
7).ఆమిర్ ఖాన్ రూ.1,800 కోట్లు
8). చిరంజీవి రూ.1,700 కోట్లు
9). వెంకటేష్ దగ్గుబాటి రూ.1,650 కోట్లు
10) రామ్ చరణ్ రూ. 1,400 కోట్లు

సంపద వెనుక వ్యూహాలు

కేవలం సినిమాల పారితోషికంపైనే ఆధారపడకుండా లాభాల్లో వాటాలు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్లు, స్పోర్ట్స్ ఫ్రాంచైజీలు, బ్రాండ్ భాగస్వామ్యాలు, ప్రొడక్షన్ హౌస్‌ల ద్వారానే వీరు వేల కోట్లు గడిస్తున్నారు. ప్రస్తుతం షారూఖ్ ఖాన్ తన తదుపరి భారీ యాక్షన్ మూవీ ‘కింగ్’ Shootingలో బిజీగా ఉన్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో సుహానా ఖాన్ కూడా నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. మొత్లంగా ఇండియన్ సినీ స్టార్ లలో బాలీవుడ్ నుంచి ఆరుగురు, టాలీవుడ్ నుంచి నలుగురు సంపద సృష్టిలో ఆగ్రస్థానంలో ఉన్నారు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← అనలాగ్ పనీర్పై దేశమంతటా బ్యాన్.. FSSAI ప్రతిపాదన22A భూములపై ప్రభుత్వం కీలక ప్రకటన →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com