☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

అనలాగ్ పనీర్పై దేశమంతటా బ్యాన్.. FSSAI ప్రతిపాదన

అనలాగ్ పనీర్పై దేశమంతటా బ్యాన్.. FSSAI ప్రతిపాదన Caption of Image. అనలాగ్ పనీర్ అమ్మకాలపై దేశమంతటా నిషేధించాలని ఫుడ్ సేఫ్టీ అండ్ (FSSAI ) ప్రతిపాదించింది. అనలాగ్ ఉత్పత్తులను పనీర్ పేరుతో విక్రయించడంపై బ్యాన్ విధించాలని ప్రతిపాదన చేసింది. పనీర్, చీజ్ ఉత్పత్తులపై పనీర్ అనే పదం వాడకాన్ని పరిమితం చేయాలని సూచించింది. వినియోగదారులను మోసపూరితంగా తప్పుదోవ పట్టించకుండా స్పష్టమైన వివరాలతో తెలియజేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. సాంప్రదాయ పాల ఉత్పత్తులకు బదులుగా తయారైన అనలాగ్ పనీర్ లేదా చీజ్ ఉత్పత్తులను పనీర్ గా లేబుల్ చేయడం లేదా మార్కెటింగ్ చేయడం నిషేధించాలని ప్రతిపాదించారు. ఇప్పటికే అనలాగ్ ఇన్ డైరీ కాంటెక్స్ట్ వర్గం కింద లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ పొందిన ఉత్పత్తులు కూడా తమ పేరు, లేబుల్, మార్కెటి
అనలాగ్ పనీర్పై దేశమంతటా బ్యాన్.. FSSAI ప్రతిపాదన
అనలాగ్ పనీర్పై దేశమంతటా బ్యాన్.. FSSAI ప్రతిపాదన

అనలాగ్ పనీర్ అమ్మకాలపై దేశమంతటా నిషేధించాలని ఫుడ్ సేఫ్టీ అండ్ (FSSAI ) ప్రతిపాదించింది. అనలాగ్ ఉత్పత్తులను పనీర్ పేరుతో విక్రయించడంపై బ్యాన్ విధించాలని ప్రతిపాదన చేసింది. పనీర్, చీజ్ ఉత్పత్తులపై పనీర్ అనే పదం వాడకాన్ని పరిమితం చేయాలని సూచించింది. వినియోగదారులను మోసపూరితంగా తప్పుదోవ పట్టించకుండా స్పష్టమైన వివరాలతో తెలియజేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది.

సాంప్రదాయ పాల ఉత్పత్తులకు బదులుగా తయారైన అనలాగ్ పనీర్ లేదా చీజ్ ఉత్పత్తులను పనీర్ గా లేబుల్ చేయడం లేదా మార్కెటింగ్ చేయడం నిషేధించాలని ప్రతిపాదించారు. ఇప్పటికే అనలాగ్ ఇన్ డైరీ కాంటెక్స్ట్ వర్గం కింద లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ పొందిన ఉత్పత్తులు కూడా తమ పేరు, లేబుల్, మార్కెటింగ్‌లో పనీర్ పదం వాడకం ఆపాలని సూచించింది.

హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సర్వీసులు వంటి ఆహార వ్యాపారులు అటువంటి ఉత్పత్తులు వాడితే, మెనూ కార్డులు, ప్యాకేజింగ్ లేబుల్స్‌లో స్పష్టంగా డిస్‌క్లోజర్ ఇవ్వాలని నిబంధనలు ఉన్నాయి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (లేబులింగ్ అండ్ డిస్‌ప్లే) రెగ్యులేషన్స్ ప్రకారం ఈ సమాచారం వినియోగదారులకు సులభంగా కనిపించేలా ఉండాలి.

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్లు, వినియోగదారులను ఉత్పత్తి స్వభావం, కూర్పు గురించి మోసపూరితంగా మార్చకుండా అనలాగ్ ఉత్పత్తులను పనీర్‌గా తయారు చేయడం, అమ్మడం పరిమితం చేయడానికి ఈ ప్రతిపాదించింది.

ఇటీవల ఆహార భద్రతా తనిఖీలు, లేబులింగ్, ఉత్పత్తి కూర్పుపై నియంత్రణ పెరగడంతో ఈ ప్రతిపాదన వచ్చింది. సాంప్రదాయ పాల ఆధారిత పనీర్, చీజ్ కాని ఉత్పత్తులను వినియోగదారులు సులభంగా గుర్తించేలా చేయడమే దీని ఉద్దేశం అని పేర్కొంది.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← ఆదిలాబాద్ జిల్లా యువతి అరుదైన ఘనత: మిస్ ఎర్త్ వాటర్ ఇండియా 2026 గా ప్రీతి ముండేఇండియాలో టాప్ 10 రిచెస్ట్ యాక్టర్స్.. బాలీవుడ్‌లో నంబర్ 1గా 'బాద్‌షా'.. టాలీవుడ్ నుంచి నలుగురికి చోటు! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com