☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
నరసాపురం మున్సిపాలిటీపై కూటమి జెండా ఎగరేస్తాం! • Gold-Silver Prices Today : పండుగ వేళ బంగారం ధరల్లో కీలక మార్పులు.. తులం రేటు ఎంతంటే? • దసరా తర్వాతే పట్టాలెక్కే ఛాన్స్ • ఘోర ప్రమాదం: కాలువలో పడిన మినీ బస్సు.. 8 మంది మృతి • అబ్బా వీటిని అనవసరంగా లైట్‌ తీసుకున్నామే.. జుట్టురాలడానికి అసలు కారణం ఈ అలవాట్లేనా? • Vaibhav Sooryavanshi: గంభీర్ ఛాన్స్ ఎప్పుడు ఇస్తారు? వైభవ్ సూర్యవంశీ రెండు పదాలతో చెప్పిన సమాధానం ఇదే • Tesla: ఫ్లయింగ్ కారు కేవలం శాంపిల్ మాత్రమే.. మస్క్ నెక్ట్స్ ఈ మూడు ప్రాజెక్టుల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..! • ట్రంప్ కీలక నిర్ణయం.. రష్యాపై చమురు ఆంక్షల్లో మినహాయింపులు? •

మొబైల్ యూజర్స్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్.. జస్ట్ రూ.1కే 24GB డేటా.. ఆఫర్ ఎప్పటివరకంటే?

తమ కస్టమర్లకు బీఎస్‌ఎన్‌ఎల్ మరో అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. ఇటీవల తీసుకొచ్చిన ఫ్రీడమ్ 2.0 ఆఫర్‌ను మళ్లీ పొడిగించింది. ఒకవేళ మీరు ఇంకా ఈ ఆఫర్ ప్రయోజనాన్ని పొందలేకపోయినా ఏం పర్వాలేదు.. ఎందుకంటే ఇందుకు ఇంకా చాలా టైమ్ ఉంది.. అప్పటిలోపు మీరు ఈ ఆఫర్‌ను గ్రాబ్ చేసుకోవచ్చు. మరి ఈ ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుందనేగా మీ డౌట్.. తెలుసుకుందాం పదండి.
మొబైల్ యూజర్స్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్.. జస్ట్ రూ.1కే 24GB డేటా.. ఆఫర్ ఎప్పటివరకంటే?
Bsnl Freedom 2.0 Offer Extended

ప్రముఖ టెలికాం సంస్థ BSNL తమ కస్టమర్లకు మరో ఆఫర్ ఇచ్చింది. BSNL రీసెంట్‌గా తీసుకొచ్చిన ఫ్రీడమ్ 2.0 ఆఫర్ డేట్‌ను మళ్లీ పొడిగించింది. ఈ ఆఫర్ కింద కేవలం రూ. 1కే వన్ మంత్ ప్లాన్‌ను అందించనుంది. ప్రస్తుతం భారత టెలికాం ఇండస్ట్రీలో ఇలాంటి ఆఫర్ ఏ కంపెనీ ఇవ్వట్లేదు. అయితే ఈ ప్లాన్ కేవలం కొత్త కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుందని BSNL స్పష్టం చేసింది.

Bsnl Freedom 2.0 Offer Extended (3)

ఆఫర్ ప్రత్యేకత ఏమిటి: ఈ ఫ్రీడమ్ 2.0 ఆఫర్ ప్రత్యేకత ఏంటంటే.. కొత్తగా బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్ తీసుకునే వారికి కేవలం రూ.1కే ఒక 24 రోజుల పాటు అన్‌లిమిటెడ్ ఫోన్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. అంటే ఒక్క రూపాయి పెట్టి రీఛార్జ్ చేసుకుంటే.. మీరు 24 రోజుల పాటు అపరిమిత కాల్స్‌తో పాటు 2,400 ఎస్ఎంఎస్‌లను ఉచితంగా పంపవచ్చు.

Bsnl Freedom 2.0 Offer Extended (1)

ఆ ప్లాన్‌తో ఉన్న మరో బెనిఫిట్ ఏమిటంటే.. కేవలం 1 రూపాయికే రోజూ 1GB డేటా అందుతుంది. అంటే ఒక్క రూపాయి పెట్టి రీఛార్జ్ చేసుకుంటే.. 24 రోజుల పాటు 4G స్పీడ్‌తో 24GB డేటా వస్తుంది. 1GB డేటాకే ఇతర కంపెనీలు రూ.20 నుంచి 30 వసూలు చేస్తున్న ఈ రోజుల్లో రూ.1కే 24 GB డేటా ఇవ్వడం కస్టమర్లకు బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి.

Bsnl Freedom 2.0 Offer Extended

అంతేకాదు ఈ ప్లాన్ తీసుకునే కస్టమర్లకు కంపెనీ ఫ్రీగా సిమ్ కార్డు కూడా ఇస్తోంది. ఇతర కంపెనీల్లా దీనికి మీరు ప్రత్యేకంగా డబ్బులు చెల్లించాల్సిన పనిలేదు. అయితే ఈ ఆఫర్ అందరికీ వర్తించదు.. కేవలం కొత్తగా BSNL వాడే కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి ఇప్పటికే బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్‌కార్డు వాడుతున్న పాత కస్టమర్లు ఈ ప్లాన్ ప్రయోజనాన్ని పొందలేరు.

Bsnl Freedom 2.0 Offer Extended (2)

చివరి తేదీ ఎప్పుడంటే?: ఇక ఈ ఆఫర్ డేట్‌ను నవంబర్ 9, 2026 వరకు పొడిగిస్తున్నట్టు తాజాగా BSNL తన అధికారిక ఎక్స్ అకౌంట్ వేదికగా వెల్లడించింది. ఈ ఆఫర్ ప్రయోజనాన్ని పొందాలనుకునేవారు మీ దగ్గర్లోని BSNL స్టోర్ లేదా బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ఫ్‌కేర్ యాప్ ద్వారా ఈ ప్లాన్‌ను పొందవచ్చు. మరి ఇంకెందుకు లేటు కొత్తగా BSNLకు స్విచ్ అవుదామనుకునే మీ ఫ్రెండ్‌కు ఈ ఆర్టికల్ లింక్ షేర్ చేయండి.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← రూ.5,55,55,555.55లతో అమ్మవారి అలంకరణ.. ఎక్కడో తెలుసా..భార్యాభర్తల గొడవలో జోక్యం.. సర్దిచెప్పబోయిన వ్యక్తి దారుణ హత్య! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com