☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
నరసాపురం మున్సిపాలిటీపై కూటమి జెండా ఎగరేస్తాం! • Gold-Silver Prices Today : పండుగ వేళ బంగారం ధరల్లో కీలక మార్పులు.. తులం రేటు ఎంతంటే? • దసరా తర్వాతే పట్టాలెక్కే ఛాన్స్ • ఘోర ప్రమాదం: కాలువలో పడిన మినీ బస్సు.. 8 మంది మృతి • అబ్బా వీటిని అనవసరంగా లైట్‌ తీసుకున్నామే.. జుట్టురాలడానికి అసలు కారణం ఈ అలవాట్లేనా? • Vaibhav Sooryavanshi: గంభీర్ ఛాన్స్ ఎప్పుడు ఇస్తారు? వైభవ్ సూర్యవంశీ రెండు పదాలతో చెప్పిన సమాధానం ఇదే • Tesla: ఫ్లయింగ్ కారు కేవలం శాంపిల్ మాత్రమే.. మస్క్ నెక్ట్స్ ఈ మూడు ప్రాజెక్టుల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..! • ట్రంప్ కీలక నిర్ణయం.. రష్యాపై చమురు ఆంక్షల్లో మినహాయింపులు? •

రూ.5,55,55,555.55లతో అమ్మవారి అలంకరణ.. ఎక్కడో తెలుసా..

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎక్కడ విన్నా..చూసినా అక్కడి అమ్మవారి నవరాత్రుల గురించే చర్చ. భారీ మొత్తంలో కరెన్సీ నోట్ల డెకరేషన్ లో అమ్మవారి రూపం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. వేలు కాదు లక్షలు కాదు.. కోట్ల రూపాయలతో అమ్మవారి అలంకరణ అంటే మామూలుగా ఉండదు. ఇంకేముంది పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు భక్తులు.
రూ.5,55,55,555.55లతో అమ్మవారి అలంకరణ.. ఎక్కడో తెలుసా..
Ammavaru 1

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎక్కడ విన్నా...చూసినా అక్కడి అమ్మవారి నవరాత్రుల గురించే చర్చ. భారీ మొత్తంలో కరెన్సీ నోట్ల డెకరేషన్ లో అమ్మవారి రూపం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. వేలు కాదు లక్షలు కాదు.. కోట్ల రూపాయలతో అమ్మవారి అలంకరణ అంటే మామూలుగా ఉండదు. ఇంకేముంది పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు భక్తులు.

Ammavaru 2

దేవి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఎక్కడా.. ఏ వీధిలో చూసిన అమ్మవారి విగ్రహాలు కొలువుదీరాయి. ఇక ఆలయాల్లో నవరాత్రులు అమ్మవారిని కొలిచేందుకు ప్రతి రోజూ ప్రత్యేకంగా అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. అయితే పాలమూరు పట్టణ ఆర్యవైశ్య సంఘం మాత్రం ఇంకాస్త ఎక్కువ ఆధ్యాత్మిక చింతతో ఓ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహాలక్ష్మి రూపంలో భక్తులను ఆశీర్వదించేలా ఏర్పాట్లు చేశారు.

Ammavaru 3

దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పాలమూరు బ్రాహ్మణ వాడి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రతిరోజూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రోజుకో రూపంలో అమ్మవారిని అలంకరిస్తూ భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. అయితే శుక్రవారం అమ్మవారిని మహాలక్ష్మి రూపంలో అలంకరించాలని నిర్వాహకులు నిర్ణయించారు. ఇందుకోసం భారీ మొత్తంలో కరెన్సీ నోట్లతో అలంకరించాలని భావించారు.

Ammavaru 4

ఇంకేముంది ఈ సారి అమ్మవారిని రూ. 5,55,55,555.55లతో అలంకరించాలని డిసైడ్ అయ్యారు. అందుకు తగ్గట్టు నగదును సేకరించేందుకు దాతలను ఆశ్రయించారు. దాతల సహకారంతో వచ్చిన విరాళాలను సిద్ధం చేసుకున్నారు. ఇక కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించేందుకు ప్రత్యేకంగా కళాకారులను రప్పించారు. కాయిన్స్ నుంచి చిన్నా, పెద్దా నోటు తేడా లేకుండా అన్నింటినీ అందంగా సిద్ధం చేసి.. అమ్మవారి ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఒక్క పైసా, 5పైసల నాణేలు కూడా సేకరించి ఔరా అనిపించారు.

Ammavaru 5

ఇక విషయం తెలుసుకున్న అమ్మవారి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మహాలక్ష్మి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకొని కరెన్సీ నోట్ల డెకరేషన్ ను ప్రత్యేకంగా తిలకించారు. ఇక పెద్ద ఎత్తున కరెన్సీ నోట్లు ఏర్పాటు చేయడంతో నిర్వాహకులు ఆలయం మొత్తం సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. భక్తుల దర్శనం అనంతరం కరెన్సీ నోట్లను తిరిగి దాతలకు ఇవ్వాలని నిర్ణయించినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతిఒక్కరకీ అష్టైశ్వార్యాలు సిద్దించాలన్న లక్ష్యంతో అమ్మవారిని ఈ రకంగా అలంకరించినట్లు తెలిపారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Bank Holidays: మూడ్రోజుల పాటు బ్యాంకులు బంద్.. వచ్చే వారంలో బ్యాంక్ హాలీడేస్ ఇవే..మొబైల్ యూజర్స్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్.. జస్ట్ రూ.1కే 24GB డేటా.. ఆఫర్ ఎప్పటివరకంటే? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com