☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

ఇరాన్ లో బోల్తాపడ్డ బస్సు.. 11 మందికి కాలం చెల్లింది..

ఇరాన్ లో బోల్తాపడ్డ బస్సు.. 11 మందికి కాలం చెల్లింది.. Caption of Image. మరో 24 మందికి తీవ్ర గాయాలు టెహ్రాన్: ఇరాన్‌‌‌‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. సెంట్రల్ మార్కాజీ ప్రొవిన్స్‌‌‌‌లోని సావే-హమేదాన్ ఫ్రీవేపై ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. శనివారం జరిగిన ఈ ప్రమాదానికి డ్రైవర్ తీవ్రమైన అలసట, నిద్రమత్తే ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలినట్లు ప్రొవిన్షియల్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. కానీ ఈ బస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందనే వివరాలను అధికారులు తక్షణమే వెల్లడించలేదు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇరాన్​లో ఏటా రోడ్డు ప్రమాదాల కారణంగా 17 వేలకు పైగా ప్రజలు ప
ఇరాన్ లో బోల్తాపడ్డ బస్సు.. 11 మందికి కాలం చెల్లింది..
ఇరాన్ లో బోల్తాపడ్డ బస్సు.. 11 మందికి కాలం చెల్లింది..
  • మరో 24 మందికి తీవ్ర గాయాలు

టెహ్రాన్: ఇరాన్‌‌‌‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. సెంట్రల్ మార్కాజీ ప్రొవిన్స్‌‌‌‌లోని సావే-హమేదాన్ ఫ్రీవేపై ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. శనివారం జరిగిన ఈ ప్రమాదానికి డ్రైవర్ తీవ్రమైన అలసట, నిద్రమత్తే ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలినట్లు ప్రొవిన్షియల్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.

కానీ ఈ బస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందనే వివరాలను అధికారులు తక్షణమే వెల్లడించలేదు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇరాన్​లో ఏటా రోడ్డు ప్రమాదాల కారణంగా 17 వేలకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.

నాణ్యత లేని వాహనాలు, ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోవడం, సరిపడా అత్యవసర సేవలు అందుబాటులో లేకపోవడమే ఈ భారీ మరణాలకు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాగా, ఈ నెల ప్రారంభంలో పశ్చిమ నగరమైన సనందాజ్ సమీపంలో ఓ ఇంధన ట్యాంకర్ ఇతర వాహనాలను ఢీకొట్టి పేలిపోవడంతో 11 మంది మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← కొత్త టాలెంట్‌‌ ను ఇండస్ట్రీ ఎప్పుడూ స్వాగతిస్తుంది10 శాతానికిపైగా జీడీపీ గ్రోత్ సాధ్యమే: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com