☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

కొత్త టాలెంట్‌‌ ను ఇండస్ట్రీ ఎప్పుడూ స్వాగతిస్తుంది

కొత్త టాలెంట్‌‌ ను ఇండస్ట్రీ ఎప్పుడూ స్వాగతిస్తుంది Caption of Image. సందీప్ కిషన్ హీరోగా, జేసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్- అడ్వెంచర్ హీస్ట్ కామెడీ ఎంటర్‌‌టైనర్ ‘సిగ్మా’. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌‌. లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. అక్టోబర్ 2న విడుదల కానుంది. తెలుగులో మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్‌‌ ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తోంది. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ ‘ట్రైలర్ చాలా ఎంటర్‌‌‌‌టైనింగ్‌‌గా ఉంది. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. జేసన్ సంజయ్‌‌ను చూస్తుంటే విజయ్‌‌ను చూసినట్టుగా అనిపిస్తుంది. తన తాత, తండ్రి నుంచి వచ్చిన ప్యాషన్‌‌తో దర్శకత్వంలో ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నా. కొత్త టాలెంట్‌‌ను ఇండస్ట్రీ ఎప్పుడూ స్వాగతిస్త
కొత్త టాలెంట్‌‌ ను ఇండస్ట్రీ ఎప్పుడూ స్వాగతిస్తుంది
కొత్త టాలెంట్‌‌ ను ఇండస్ట్రీ ఎప్పుడూ స్వాగతిస్తుంది

సందీప్ కిషన్ హీరోగా, జేసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్- అడ్వెంచర్ హీస్ట్ కామెడీ ఎంటర్‌‌టైనర్ ‘సిగ్మా’. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌‌. లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. అక్టోబర్ 2న విడుదల కానుంది. తెలుగులో మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్‌‌ ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తోంది. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ ‘ట్రైలర్ చాలా ఎంటర్‌‌‌‌టైనింగ్‌‌గా ఉంది. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా.

జేసన్ సంజయ్‌‌ను చూస్తుంటే విజయ్‌‌ను చూసినట్టుగా అనిపిస్తుంది. తన తాత, తండ్రి నుంచి వచ్చిన ప్యాషన్‌‌తో దర్శకత్వంలో ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నా. కొత్త టాలెంట్‌‌ను ఇండస్ట్రీ ఎప్పుడూ స్వాగతిస్తుంది’ అని చెప్పారు. తన జనరేషన్‌‌కు మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తి అని, తన సినిమా ఈవెంట్‌‌కు ఆయన రావడం ఎంతో ఆనందంగా ఉందని సందీప్ కిషన్ అన్నాడు.

ఈ మూవీ తనకు చాలా స్పెషల్ అని ఫరియా చెప్పింది. ఈ చిత్రంలో హీస్ట్, ట్రెజర్ హంట్ వంటి అంశాలు కొత్తగా ఉంటాయని డైరెక్టర్ జేసన్ సంజయ్ అన్నాడు. కార్యక్రమంలో పాల్గొన్న మైత్రీ నిర్మాత నవీన్ యెర్నేని, ఎస్‌‌కేఎన్, సాయి రాజేష్​ సినిమా మంచి సక్సెస్ సాధించాలని కోరారు. టీమ్ అంతా పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← కష్టంగా అనిపించినా ఎంతో నచ్చింది: ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమాపై ఫహాద్ ఫాజిల్ఇరాన్ లో బోల్తాపడ్డ బస్సు.. 11 మందికి కాలం చెల్లింది.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com