☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

కష్టంగా అనిపించినా ఎంతో నచ్చింది: ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమాపై ఫహాద్ ఫాజిల్

కష్టంగా అనిపించినా ఎంతో నచ్చింది: ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమాపై ఫహాద్ ఫాజిల్
కష్టంగా అనిపించినా ఎంతో నచ్చింది: ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమాపై ఫహాద్ ఫాజిల్
కష్టంగా అనిపించినా ఎంతో నచ్చింది: ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమాపై ఫహాద్ ఫాజిల్

విభిన్నమైన కథలు, విలక్షణమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌‌గా నిలిచిన మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్.. ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ చిత్రంతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. రాజ‌‌మౌళి సమ‌‌ర్పణ‌‌లో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్.కార్తికేయ నిర్మించారు. శశాంక్ యేలేటి దర్శకుడు. అక్టోబర్ 2న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఫహాద్ ఫాజిల్ చెప్పిన విశేషాలు.

‘‘ఈ చిత్రంలో మ్యాజిక్ అనేది ఓ అంశం మాత్రమే. ప్రేమ, ఆప్యాయత, అనుబంధం వంటి చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ విషయాలను చాలామందికి అర్థమయ్యేలా చెప్పే చిత్రం అవుతుంది. తెలుగు కథను మలయాళంలో అర్థం చేసుకుని, ఇంగ్లీష్‌‌లోకి మార్చుకుని.. తిరిగి తెలుగు డైలాగ్స్‌‌తో నటించడం ఛాలెంజింగ్‌‌గా అనిపించింది. కాస్త కష్టంగానే అనిపించినా ఈ జర్నీ నాకు ఎంతో నచ్చింది. చెడు నుంచి మంచిగా మారే సూరి క్యారెక్టర్‌‌‌‌ను ఆడియెన్స్ ఇష్టపడతారు. ఈ సినిమాని చాలావరకు రియల్ లొకేషన్స్‌‌లోనే షూట్ చేశాం.

చైల్డ్ ఆర్టిస్ట్ సారా ఎంతో యాక్టివ్‌‌గా, ఎనర్జిటిక్‌‌గా యాక్ట్ చేసింది. బాల‌‌కృష్ణ గారి డైలాగ్‌‌ను టైటిల్‌‌గా పెట్టే క్రమంలో ఆయన్ను కలిశాం. మా ట్రైలర్‌‌‌‌కు వాయిస్ ఓవర్ ఇచ్చి చాలా సపోర్ట్ చేశారు. ఆర్కా బ్యానర్‌‌లో నటించడం హ్యాపీ. ఈ సంస్థలో మరో ప్రాజెక్ట్ చేయబోతున్నా. రాజమౌళి గారు మా సినిమాలోని కొన్ని సీన్స్ చూసి సలహాలు ఇచ్చారు. ఫైనల్ ప్రొడక్ట్ చూసి ఆయన హ్యాపీగా ఫీలయ్యారు. ఓ నటుడిగా 24 ఏళ్ల క్రితం స్టార్ట్ అయిన నా జర్నీ.. ఇప్పుడు 66 సినిమాలకు చేరుకోవడం సంతోషంగా ఉంది’’.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← మరో తమిళ చిత్రంలో కయాదు లోహర్కొత్త టాలెంట్‌‌ ను ఇండస్ట్రీ ఎప్పుడూ స్వాగతిస్తుంది →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com