☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

10 శాతానికిపైగా జీడీపీ గ్రోత్ సాధ్యమే: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

10 శాతానికిపైగా జీడీపీ గ్రోత్ సాధ్యమే: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
10 శాతానికిపైగా జీడీపీ గ్రోత్ సాధ్యమే: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
10 శాతానికిపైగా జీడీపీ గ్రోత్ సాధ్యమే: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

బెంగళూరు: టెక్నాలజీ, ఇన్నోవేషన్ల సాయంతో ఇండియా జీడీపీ వృద్ధి రేటు 10 శాతం దాటగలుగుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బెంగళూరులో ఐఐటీ మద్రాస్ అలుమ్నీ అసోసియేషన్ శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. 10 శాతానికి పైగా వృద్ధిరేటు కేవలం ఉత్త మాట కాదని, 'ఆత్మనిర్భర్ భారత్', 'వికసిత్ భారత్' సాధించడంలో ఇది కీలకమని అన్నారు.

అయితే ఇందుకు అన్ని రంగాలు వృద్ధి చెందాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. 2015 నుంచి దేశంలో పుంజుకున్న స్టార్టప్‌‌‌‌లు భవిష్యత్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. రైతులను మార్కెట్లతో అనుసంధానించడంలో, ప్రొడక్షన్‌‌‌‌ పెంచడంలో టెక్నాలజీ చాలా మార్పు తీసుకొచ్చిందని , డ్రోన్లు, ఏరియల్ జియోస్పేషియల్ మ్యాపింగ్ ద్వారా భూముల సర్వే సులువైందని వివరించారు.

‘‘ఎరువుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు పైలట్ ప్రాజెక్ట్‌‌‌‌గా పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్‌‌‌‌) మెషీన్లను వాడుతున్నాం. నేల స్వభావం, పంట రకాన్ని బట్టి రైతుకు ఎంత ఎరువు అవసరమో నిర్ణయిస్తాం. రసాయనాల మితిమీరిన వాడకం తగ్గి భూగర్భ జలాలు, నేల కాలుష్యం అదుపులోకి వస్తుంది” అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← ఇరాన్ లో బోల్తాపడ్డ బస్సు.. 11 మందికి కాలం చెల్లింది..2027 వరల్డ్‌‌ కప్‌‌ చివరిది: కోహ్లీ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com