☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

2027 వరల్డ్‌‌ కప్‌‌ చివరిది: కోహ్లీ

2027 వరల్డ్‌‌ కప్‌‌ చివరిది: కోహ్లీ Caption of Image. తిరువనంతపురం: వచ్చే ఏడాది జరగనున్న వన్డే వరల్డ్‌‌ కప్‌‌ తన కెరీర్‌‌లో చివరి టోర్నీ అని టీమిండియా సూపర్‌‌ స్టార్‌‌ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. దేశం కోసం మరోసారి ప్రపంచకప్‌‌ను గెలవడమే తన ఏకైక లక్ష్యమన్నాడు. సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్త ఆతిథ్యంలో జరగనున్న ఈ టోర్నీ కోసం ఎంత కష్టపడటానికైనా సిద్ధంగా ఉన్నానని వెల్లడించాడు. ‘నా దేశం తరఫున నేను ఆడబోయే చివరి ప్రపంచకప్ ఇదే. అదే నాలో కసిని పెంచుతోంది. టోర్నీ సందర్భంగా మైదానంలో నా సర్వశక్తులను ధారబోస్తాను. ప్రపంచకప్‌‌ను కైవసం చేసుకోవడమే మా లక్ష్యం. అందుకోసం ఏ త్యాగానికైనా, ఎంత శ్రమకైనా నేను సిద్ధం’ అని కోహ్లీ పేర్కొన్నాడు. 50 ఓవర్ల ప్రపంచకప్ మ్యాచ్‌‌ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని, విదేశీ ప
2027 వరల్డ్‌‌ కప్‌‌ చివరిది: కోహ్లీ
2027 వరల్డ్‌‌ కప్‌‌ చివరిది: కోహ్లీ

తిరువనంతపురం: వచ్చే ఏడాది జరగనున్న వన్డే వరల్డ్‌‌ కప్‌‌ తన కెరీర్‌‌లో చివరి టోర్నీ అని టీమిండియా సూపర్‌‌ స్టార్‌‌ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. దేశం కోసం మరోసారి ప్రపంచకప్‌‌ను గెలవడమే తన ఏకైక లక్ష్యమన్నాడు. సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్త ఆతిథ్యంలో జరగనున్న ఈ టోర్నీ కోసం ఎంత కష్టపడటానికైనా సిద్ధంగా ఉన్నానని వెల్లడించాడు.

‘నా దేశం తరఫున నేను ఆడబోయే చివరి ప్రపంచకప్ ఇదే. అదే నాలో కసిని పెంచుతోంది. టోర్నీ సందర్భంగా మైదానంలో నా సర్వశక్తులను ధారబోస్తాను. ప్రపంచకప్‌‌ను కైవసం చేసుకోవడమే మా లక్ష్యం. అందుకోసం ఏ త్యాగానికైనా, ఎంత శ్రమకైనా నేను సిద్ధం’ అని కోహ్లీ పేర్కొన్నాడు.

50 ఓవర్ల ప్రపంచకప్ మ్యాచ్‌‌ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని, విదేశీ పరిస్థితుల్లో వరుసగా 10 మ్యాచ్‌‌లు ఆడి అదే జోరును కొనసాగించడం ఆటగాళ్లపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని వివరించాడు.

మరోవైపు తాను ఇంకా క్రికెట్ ఆడుతున్నంత కాలం ఏదో ఒక లక్ష్యంతోనే ముందుకు వెళ్తానని రోహిత్‌‌ శర్మ తెలిపాడు. ప్రపంచకప్ టోర్నీలు ఎప్పుడూ ప్రత్యేకమైన సవాళ్లను విసురుతాయని, వేర్వేరు వేదికలపై భిన్నమైన ప్రత్యర్థులతో తలపడేందుకు వ్యూహాత్మకంగా సిద్ధం కావాల్సి ఉంటుందని హిట్‌‌మ్యాన్‌‌ అభిప్రాయపడ్డాడు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← 10 శాతానికిపైగా జీడీపీ గ్రోత్ సాధ్యమే: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్టీమిండియా ఆల్‌‌రౌండర్‌ హార్దిక్‌‌కు గాయం →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com