☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

టీమిండియా ఆల్‌‌రౌండర్‌ హార్దిక్‌‌కు గాయం

టీమిండియా ఆల్‌‌రౌండర్‌ హార్దిక్‌‌కు గాయం Caption of Image. న్యూఢిల్లీ: టీమిండియా ఆల్‌‌రౌండర్‌‌ హార్దిక్‌‌ పాండ్యా మరోసారి గాయపడ్డాడు. అతని కుడి కాలి పిక్కకు తీవ్ర గాయం కావడంతో కనీసం మూడు వారాల పాటు క్రికెట్‌‌కు దూరంగా ఉండనున్నాడు. దాంతో త్వరలో న్యూజిలాండ్‌‌తో జరిగే వైట్‌‌ బాల్‌‌ మ్యాచ్‌‌లకు పాండ్యా అందుబాటులో ఉండటం లేదు. ఈ నెల 20 వరకు ఫిట్‌‌నెస్‌‌ సాధిస్తాడని భావించిన సెలెక్టర్లు అక్టోబర్‌‌ 6 నుంచి ఆస్ట్రేలియా–ఎతో మొదలయ్యే వన్డే సిరీస్‌‌కు హార్దిక్‌‌ను ఎంపిక చేశారు. కానీ తాజాగా నిర్వహించిన స్కానింగ్‌‌ రిపోర్టుల్లో పిక్కకు గాయమైందని తేలింది. దాంతో బీసీసీఐ మెడికల్‌‌ ప్యానెల్‌‌ డాక్టర్‌‌ దిన్షా పరిడివాలా పాండ్యా నివేదికలను పరిశీలించి విశ్రాంతి సూచించారు. అంతకుముందు అఫ్గానిస్తాన్‌‌తో సిరీస్‌‌కు
టీమిండియా ఆల్‌‌రౌండర్‌ హార్దిక్‌‌కు గాయం
టీమిండియా ఆల్‌‌రౌండర్‌ హార్దిక్‌‌కు గాయం

న్యూఢిల్లీ: టీమిండియా ఆల్‌‌రౌండర్‌‌ హార్దిక్‌‌ పాండ్యా మరోసారి గాయపడ్డాడు. అతని కుడి కాలి పిక్కకు తీవ్ర గాయం కావడంతో కనీసం మూడు వారాల పాటు క్రికెట్‌‌కు దూరంగా ఉండనున్నాడు. దాంతో త్వరలో న్యూజిలాండ్‌‌తో జరిగే వైట్‌‌ బాల్‌‌ మ్యాచ్‌‌లకు పాండ్యా అందుబాటులో ఉండటం లేదు.

ఈ నెల 20 వరకు ఫిట్‌‌నెస్‌‌ సాధిస్తాడని భావించిన సెలెక్టర్లు అక్టోబర్‌‌ 6 నుంచి ఆస్ట్రేలియా–ఎతో మొదలయ్యే వన్డే సిరీస్‌‌కు హార్దిక్‌‌ను ఎంపిక చేశారు. కానీ తాజాగా నిర్వహించిన స్కానింగ్‌‌ రిపోర్టుల్లో పిక్కకు గాయమైందని తేలింది.

దాంతో బీసీసీఐ మెడికల్‌‌ ప్యానెల్‌‌ డాక్టర్‌‌ దిన్షా పరిడివాలా పాండ్యా నివేదికలను పరిశీలించి విశ్రాంతి సూచించారు. అంతకుముందు అఫ్గానిస్తాన్‌‌తో సిరీస్‌‌కు ముందు డ్రిల్స్‌‌ చేస్తుండగా హార్దిక్‌‌ మోకాలిలో నొప్పి తలెత్తింది. దాంతో ఆ సిరీస్‌‌కు దూరమయ్యాడు. ఓవరాల్‌‌గా గత నాలుగు నెలల వ్యవధిలో హార్దిక్‌‌ గాయాల బారిన పడటం ఇది మూడోసారి.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← 2027 వరల్డ్‌‌ కప్‌‌ చివరిది: కోహ్లీటెక్నాలజీలపై అవగాహనకు సదస్సు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com