న్యూఢిల్లీ: నియోజకవర్గాల పునర్ విభజన బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లులను పాస్ చేసేందుకు తమ వద్ద సంఖ్యా బలం ఉన్నట్లు కేంద్రం విశ్వసిస్తున్నది. ఈ బిల్లుల ఆమోదం కోసం డీఎంకేతో పాటు చిన్న పార్టీలను కూడా ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు కీలక బిల్లులను పాస్ చేసేందుకు ఈనెలలోనే ప్రత్యేక పార్లమెంట్(Parliament session) సమావేశాలను కూడా ఏర్పాటు చేయాలని కేంద్రం యోచిస్తున్నట్లు ఓ మీడియా సంస్థ కథనం ద్వారా వెల్లడైంది. మరో వైపు విపక్షాలు మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. డీలిమిటేషన్, వుమెన్స్ కోటా బిల్లులను ఆమోదింపచేసేందుకు కావాల్సిన సంఖ్యా బలం తమ వద్ద ఉన్నట్లు కేంద్రం భావిస్తున్నట్లు తెలిసింది.
అయితే ఈ రెండు బిల్లులకు చెందిన రాజ్యాంగ సవరణ బిల్లుకు జట్కా తగిలిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 17వ తేదీన బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో డీలిమిటేషన్, వుమెన్స్ కోటా బిల్లుతో లింకున్న రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టగా, ఆ బిల్లు వీగిన విషయం తెలిసిందే. రాజ్యాంగ సవరణకు గ్రీన్సిగ్నల్ దక్కాలంటే పార్లమెంట్లో ప్రత్యేక మెజారిటీ అవసరం అవుతుంది. ప్రస్తుత లోక్సభలో ఎన్డీఏకు మెజారిటీ ఉన్నా.. మూడో వంతు మెజారిటీ లేకపోవడం సమస్యగా మారింది. సుమారు 360 మంది ఎన్డీఏకు అనుకూలంగా ఓటు వేయాల్సి ఉంటుంది. రెండు బిల్లులను పాస్ చేసేందుకు డీఎంకే సహాయాన్ని కేంద్రం కోరనున్నది.
తమిళనాడులో కాంగ్రెస్తో కలిసి పోటీ చేసి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన విషయం తెలిసిందే. ఇక ఇండియా కూటమి నుంచి కూడా ఎండీకే వైదొలిగింది. చిన్న చిన్న విపక్ష పార్టీలతోనూ గవర్నమెంట్ టచ్లో ఉన్నది. ఆగస్టు 13వ తేదీన ముగిసిన వర్షాకాల సమావేశాలను ఇంకా ప్రోరోగ్ చేయలేదు. దీంతో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.






