☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై సమన్లు.. కోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి! • Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్‌ సంచలన వ్యాఖ్యలు! • ట్రెజర్ హంటర్‌గా నాగ చైతన్య.. ‘వృషకర్మ’ కొత్త పోస్టర్ విడుదల! • మీ నంబర్ Truecallerలో కనిపిస్తోందా? ఈ ట్రిక్స్‌ ద్వారా డైరెక్టరీ నుండి తొలగించండి..! • Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..! • భారత్‌తో క్రికెట్ ఆడినా మాకు పైసా రావడం లేదు.. వెస్టిండీస్ బోర్డు ఆవేదన • Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’ మూవీలో బాలయ్య రిజెక్ట్ చేసిన రోల్ ఎవరు చేశారో తెలుసా? • YS Jagan : ఎంపీ మిథున్ రెడ్డికి వైఎస్ జగన్ ఫోన్.. దాడి ఘటనపై ఆరా! చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు.. •

Calling Name Presentation: ఫోన్ స్క్రీన్‌పై ఇక‌ పేరు కూడా డిస్‌ప్లే అవుతుంది.. న‌వంబ‌ర్ ఒక‌టి నుంచి త‌ప్ప‌నిస‌రి

Calling Name Presentation: ఫోన్ ఎవ‌రు చేసినా.. ఇక మీ ఫోన్ స్క్రీన్‌పై ఆ నెంబ‌ర్‌తో పాటు వ్య‌క్తి పేరు కూడా త‌ప్ప‌నిస‌రిగా డిస్‌ప్లే అవుతుంది. నవంబ‌ర్ ఒక‌టో తేదీ నుంచి ఈ కొత్త ఆదేశాలు అములోకి రానున్నాయి. టెలికం శాఖ అన్ని కంపెనీల‌కు ఈ ఆదేశాలు ఇచ్చింది.
Calling Name Presentation: ఫోన్ స్క్రీన్‌పై ఇక‌ పేరు కూడా డిస్‌ప్లే అవుతుంది.. న‌వంబ‌ర్ ఒక‌టి నుంచి త‌ప్ప‌నిస‌రి

న్యూఢిల్లీ: మీకు ఫోన్ కాల్ వ‌స్తే, ఇక నుంచి ఆ నెంబ‌ర్ ఉన్న వ్య‌క్తి పేరు కూడా డిస్‌ప్లే కానున్న‌ది. టెలిక‌మ్యూనికేష‌న్స్ శాఖ కొత్త ఆదేశాలు జారీ చేసింది. న‌వంబ‌ర్ ఒక‌టో తేదీ నుంచి ఆ ఆదేశాల‌ను క‌చ్చితంగా టెలికాం ఆప‌రేట‌ర్లు అమ‌లు చేయాల్సి ఉంటుంది. 4జీ, 5జీ నెట్‌వ‌ర్క్ ఉన్న ఫోన్ల‌కు కూడా ఇక నుంచి కాల్స్ వ‌స్తే, ఆ ఫోన్ల‌పై వ్య‌క్తి పేరు కూడా ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్న‌ది. సీఎన్ఏపీ.. కాలింగ్ నేమ్ ప్ర‌జెంటేష‌న్(Calling Name Presentation) స‌ర్వీస్ ద్వారా కాల‌ర్ ఐడెంటిఫికేష‌న్ విధానాన్ని ప‌టిష్టం చేయ‌నున్న‌ట్లు టెలికాం శాఖ పేర్కొన్న‌ది. అక్టోబ‌ర్ 13వ తేదీన ఆ శాఖ కొత్త స‌ర్క్యూల‌ర్ జారీ చేసింది.

4జీతో పాటు హైయ్య‌ర్ జ‌న‌రేష‌న్ నెట్‌వ‌ర్క్స్‌లో టెలికాం ఆప‌రేట‌ర్లు సీఎన్ఏపీ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించిన‌ట్లు చెప్పింది. అయితే క‌చ్చితంగా 2026 న‌వంబ‌ర్ ఒక‌టో తేదీ నుంచి కాలింగ్ నేమ్ ప్ర‌జెంటేష‌న్ స‌ర్వీస్‌ను ప్ర‌వేశ‌పెట్టాల‌ని అన్ని టెలికం స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల‌కు స‌ర్క్యూల‌ర్ ద్వారా ఆదేశాలు ఇచ్చారు. 2జీ, 3జీ టెక్నాల‌జీతో పాటు ప‌బ్లిక్ స్విచ్ టెలిఫోన్ నెట్వ‌ర్క్‌ల‌కు సంబంధించిన సీఎన్ఏపీ గురించి భ‌విష్య‌త్తులో నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు టెలికం శాఖ తెలిపింది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Parliament: డీలిమిటేష‌న్‌, వుమెన్స్ కోటా బిల్లులు.. ఈనెల‌లోనే ప్ర‌త్యేక పార్ల‌మెంట్ స‌మావేశాలుTuni Chairperson | తునిలో జనసైనికులకు షాక్.. చైర్‌పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చిన నేత! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com