Child | మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జువెలరీ షాపులో సైనైడ్‌ను తిన్న రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఓ మహిళ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి చింతల్ కాస్తాబజార్‌లోని విష్ణు జువెలరీ షాపులో బంగారం కొనేందుకు తన రెండేళ్ల చిన్నారిని తీసుకొని వెళ్లింది. సదరు మహిళ షాపు యజమానితో బంగారం గురించి మాట్లాడే క్రమంలో చిన్నారి పక్కకు వెళ్లి అక్కడే ఉన్న మెరుగుపెట్టే కెమికల్ సైనైడ్‌ను నోట్లో పెట్టుకుంది. దీంతో అస్వస్థతకు గురైన ఆ చిన్నారిని కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.
అయితే ఆ చిన్నారి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. కండ్ల ముందే విగతజీవిగా మారిపోయిన చిన్నారిని చూసి తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. చిన్నారి తల్లిదండ్రులు తమకు న్యాయం చేయాలని జువెలరీ షాపు ముందు ఆందోళనకు దిగారు. చిన్నారికి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
సీసీటీవీ ఫుటేజ్..!
మేడ్చల్ జిల్లాలో విషాదం
జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి చింతల్ కాస్తాబజార్‌లోని విష్ణు జువెలరీ షాపులో బంగారం మెరుగుపెట్టే కెమికల్‌ను నోట్లో పెట్టుకుని మృతిచెందిన రెండేళ్ల చిన్నారి మిషా
బంగారం కొనేందుకు చిన్నారిని తీసుకొని తల్లి వెళ్లగా.. ఈ క్రమంలో షాపులో ఉన్న సైనైడ్‌ను తిన్న చిన్నారి
అస్వస్థతకు గురైన చిన్నారిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి
జువెలరీ ముందు ఆందోళనకు దిగి న్యాయం చేయాలని కోరుతున్న బంధువులు
— Telugu Scribe (@TeluguScribe) October 10, 2026
Read Also :
Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!






