☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్!

ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) అంశంపై కాక్రోచ్‌ జనతా పార్టీ (CJP) తీవ్ర స్థాయిలో స్పందించింది. ప్రధాన ఎన్నికల కమిషనరు (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. కేవలం 48 గంటల్లోగా రాజీనామా చేయకపోతే దేశవ్యాప్తంగా నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించింది. దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద మరోసారి భారీ నిరసన కార్యక్రమాన్ని (Jantar Mantar 2.0) చేపడతామని స్పష్టం చేసింది. సర్‌ ప్రక్రియపై జాతీయ […] The post సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్! appeared first on Adya News Telugu.
సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్!

ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) అంశంపై కాక్రోచ్‌ జనతా పార్టీ (CJP) తీవ్ర స్థాయిలో స్పందించింది. ప్రధాన ఎన్నికల కమిషనరు (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. కేవలం 48 గంటల్లోగా రాజీనామా చేయకపోతే దేశవ్యాప్తంగా నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించింది. దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద మరోసారి భారీ నిరసన కార్యక్రమాన్ని (Jantar Mantar 2.0) చేపడతామని స్పష్టం చేసింది.

సర్‌ ప్రక్రియపై జాతీయ మీడియాలో వచ్చిన సంచలన కథనాలతో రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం చెలరేగింది. ఈ నేపథ్యంలో దిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీజేపీ ప్రతినిధులు మాట్లాడారు. త్వరలో జరగబోయే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ ఓ పెద్ద ముప్పులా తయారయ్యారని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే తీవ్రంగా విమర్శించారు. ప్రజల ఓటు హక్కును రద్దు చేయడానికి ఆయన ఎవరు అని సూటిగా ప్రశ్నించారు. ఎన్నికల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని భావిస్తే విపక్షాలన్నీ ఈ ఎన్నికల ప్రక్రియలో అస్సలు పాల్గొనవద్దని ఆయన పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా సీజేపీ కో-కన్వీనర్‌ సౌరవ్‌ దాస్‌ మాట్లాడుతూ.. తాము ప్రధానంగా మూడు డిమాండ్లను ఎన్నికల సంఘం ముందుంచుతున్నట్లు చెప్పారు. మొదటిది, సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ తక్షణమే రాజీనామా చేయడంతో పాటు ఆయనపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెండవది, వివాదాస్పదమైన ‘సర్‌’ ప్రక్రియను పూర్తిగా నిలిపివేసి, పాత 2025 ఓటర్ల జాబితానే పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. మూడవది, ఈ ‘సర్‌’ ప్రక్రియకు సంబంధించిన అన్ని కీలక ఫైళ్లను సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక కమిటీ ఆధీనంలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా సవరణ వివాదం దేశవ్యాప్తంగా రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది.

The post సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్! appeared first on Adya News Telugu.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్‌ కీలక సమీక్ష!Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయాత్ర..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com