☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్‌ కీలక సమీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టి సారించారు. పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లతో తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ఆయన అత్యవసరంగా సమావేశమయ్యారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజా పోరాటాలపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్‌ తదితర ప్రముఖ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ నేతలకు స్పష్టమైన దిశానిర్దేశం […] The post స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్‌ కీలక సమీక్ష! appeared first on Adya News Telugu.
స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్‌ కీలక సమీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టి సారించారు. పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లతో తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ఆయన అత్యవసరంగా సమావేశమయ్యారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజా పోరాటాలపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్‌ తదితర ప్రముఖ నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ నేతలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసేందుకు బలమైన, మంచి అభ్యర్థులను వేగంగా గుర్తించాలని ఆదేశించారు. అభ్యర్థుల ఎంపికలో అందరితో చర్చించి సరైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. పార్టీ శ్రేణులన్నింటినీ ఒక్కతాటిపైకి తీసుకువచ్చి ఎన్నికల్లో ముందుకు నడపాలని చెప్పారు. స్థానిక నాయకత్వాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మరింత బలోపేతం చేయాలని స్పష్టం చేశారు.

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని జగన్ పిలుపునిచ్చారు. గత రెండున్నరేళ్ల చంద్రబాబు పాలనలో ప్రజలకు జరిగిన వెన్నుపోట్లను, మోసాలను వివరించాలని కోరారు. ప్రతి గడపకూ వెళ్లి తమ పాలనలో జరిగిన మంచిని గుర్తుచేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వ పాలనలోని వైఫల్యాలు, ప్రజలు పడుతున్న కష్టాలను సమగ్రంగా ఎత్తిచూపాలని చెప్పారు.

పోలీసు బలంతో, అడ్డదారుల్లో ఎన్నికల్లో గెలిచేందుకు సీఎం చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని జగన్ ఆరోపించారు. ఆ కుట్రలను తిప్పికొట్టేందుకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు అన్నిరకాలుగా సిద్ధం కావాలని హెచ్చరించారు. ఎక్కడికక్కడ బలమైన ప్రత్యామ్నాయాలను సిద్ధం చేసుకోవాలని పార్టీ నాయకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

The post స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్‌ కీలక సమీక్ష! appeared first on Adya News Telugu.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← క్రష్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు: రష్మికసీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com