☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

CM Revanth Reddy : నాని రిక్వెస్ట్ కి ఓకే చెప్పిన సీఎం.. తెలంగాణ దర్శకుడి సినిమా అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్..

CM Revanth Reddy : పుష్ప 2 సినిమా సమయంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి ఒకరు మృతి చెందడంతో అప్పట్నుంచి స్టార్ హీరోల సినిమాలకు ప్రీమియర్స్ కి, హీరోలు వచ్చి సినిమా చూడటానికి పర్మిషన్స్ ఇవ్వట్లేదు. అయితే నాని ది ప్యారడైజ్ సినిమా రిలీజ్ ఉండగా నేడు రాత్రి ప్రీమియర్స్ పడుతుండటంతో నిన్న సీఎం రేవంత్ కి రిక్వెస్ట్ చేసాడు నాని. తన సోషల్ మీడియాలో నాని.. సీఎం, సినిమాటోగ్రఫీ మినిస్టర్, పోలీసులకు రిక్వెస్ట్ అంటూ సినిమాను ప్రేమించే ఒక అభిమానిగా, చిన్నప్పటి నుంచే సినిమాను ఆస్వాదించిన వ్యక్తిగా అడుగుతున్నాను. నాకు సినిమా అంటే సినిమాను ప్రేమించే ప్రేక్షకులతో కలిసి చూడటమే. హైదరాబాద్‌లో ఆ అనుభూతికి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ప్రత్యేకమైన స్థానం ఉంది. సెప్టెంబర్ 23న ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ల
CM Revanth Reddy : నాని రిక్వెస్ట్ కి ఓకే చెప్పిన సీఎం.. తెలంగాణ దర్శకుడి సినిమా అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్..

CM Revanth Reddy : పుష్ప 2 సినిమా సమయంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి ఒకరు మృతి చెందడంతో అప్పట్నుంచి స్టార్ హీరోల సినిమాలకు ప్రీమియర్స్ కి, హీరోలు వచ్చి సినిమా చూడటానికి పర్మిషన్స్ ఇవ్వట్లేదు. అయితే నాని ది ప్యారడైజ్ సినిమా రిలీజ్ ఉండగా నేడు రాత్రి ప్రీమియర్స్ పడుతుండటంతో నిన్న సీఎం రేవంత్ కి రిక్వెస్ట్ చేసాడు నాని.

తన సోషల్ మీడియాలో నాని.. సీఎం, సినిమాటోగ్రఫీ మినిస్టర్, పోలీసులకు రిక్వెస్ట్ అంటూ సినిమాను ప్రేమించే ఒక అభిమానిగా, చిన్నప్పటి నుంచే సినిమాను ఆస్వాదించిన వ్యక్తిగా అడుగుతున్నాను. నాకు సినిమా అంటే సినిమాను ప్రేమించే ప్రేక్షకులతో కలిసి చూడటమే. హైదరాబాద్‌లో ఆ అనుభూతికి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ప్రత్యేకమైన స్థానం ఉంది. సెప్టెంబర్ 23న ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఒక థియేటర్‌కు వెళ్లి ది ప్యారడైజ్ ప్రీమియర్ చూడాలని అనుకుంటున్నాను. అక్కడ అమల్లో ఉన్న అన్ని అవసరమైన ప్రోటోకాల్స్, భద్రతా మార్గదర్శకాలను పాటిస్తాను అని పోస్ట్ చేసారు.

Bigg Boss Today Promo : ముకేశ్ కి గిఫ్ట్ పంపిన బిగ్ బాస్.. ఏడ్చేసిన దేబ్జానీ.. త్రిగున్ నోటికి ప్లాస్టర్.. బిగ్ బాస్ ప్రోమో వైరల్..

అయితే నాని పోస్ట్ కి సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. భద్రతా మార్గదర్శకాలను గౌరవిస్తున్నందుకు, సినిమాపై మీకున్న అంకితభావానికి, తెలంగాణ దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల తెరకెక్కించిన ‘ది ప్యారడైజ్‌’ సినిమాపై మీకున్న తపనకు అభినందనలు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, జన సమూహాన్ని నియంత్రించేందుకు దయచేసి నిర్దేశిత స్థానిక పోలీస్ స్టేషన్‌లో అధికారిక దరఖాస్తు చేసుకోండి. సంబంధిత పోలీసు బృందం మీ దరఖాస్తును పరిశీలించి, దానికి అనుగుణంగా తగిన నిర్ణయం తీసుకుంటుంది అని తెలుపుతూ DGP ని ట్యాగ్ చేయడంతో డిజిపి సివి ఆనంద్ కూడా స్పందించారు.

సివి ఆనంద్ రేవంత్ రెడ్డి ట్వీట్ పై స్పందిస్తూ.. గణేశ విగ్రహ నిమజ్జనాలు జోరుగా సాగుతున్నాయి. ఈ రోజుతో పదవ రోజుకు చేరుకున్నాము. రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా హుస్సేన్ సాగర్ సరస్సులో వేలాది విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. దగ్గరలోనే ఉన్న ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఈ వాహనాలతో, జనసందోహంతో కిక్కిరిసిపోతుంది. మీ ఆకాంక్షను అభినందిస్తూనే, ఈ కార్యక్రమాన్ని నిర్వహించగలరా, అవసరమైన బలగాలను మోహరించగలరా అనే విషయంపై నేను హైదరాబాద్ నగర పోలీసులను సంప్రదించవలసి ఉంటుంది. రెండేళ్ల క్రితం జరిగిన తొక్కిసలాట ఘటనని దృష్టిలో పెట్టుకోవాలి అని పోస్ట్ చేసారు. ఇవాళ రాత్రి నాని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఫ్యాన్స్ తో కలిసి ది ప్యారడైజ్ సినిమా చూస్తారని తెలుస్తుంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← SSEL EHV Power Transformer Export : అమెరికా మార్కెట్‌లోకి ఎస్ఎస్‌ఈఎల్ ఎంట్రీ.. తొలి 175 ఎంవీఏ ఈహెచ్‌వీ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ఎగుమతిAlekhya Harika : పొలాల్లో చీరకట్టుతో పోజులిస్తున్న అలేఖ్య హారిక.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com