☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

రైస్ మిల్లింగ్ సంక్షోభానికి.. సమగ్ర సంస్కరణే పరిష్కారం !

రైస్ మిల్లింగ్ సంక్షోభానికి.. సమగ్ర సంస్కరణే పరిష్కారం ! Caption of Image. తెలంగాణ పౌర సరఫరాల వ్యవస్థలో ప్రస్తుతం కనిపిస్తున్న సమస్యలను కేవలం ప్రభుత్వం, రైస్ మిల్లర్ల మధ్య వివాదంగా చూడటం సరైంది కాదు. ఇది రైతు ప్రయోజనాలు, ప్రభుత్వ ఆర్థిక బాధ్యత, ప్రజాధనం, ఆహార భద్రత, గ్రామీణ ఆర్థికవ్యవస్థ, మిల్లింగ్ పరిశ్రమ వంటి అనేక అంశాలతో ముడిపడి ఉన్న విస్తృతమైన విధానపరమైన సమస్య. ఒకవైపు ప్రజల డబ్బుతో కొనుగోలు చేసిన ధాన్యాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మరోవైపు ప్రభుత్వ విధానాల అమలులో ఏర్పడే ఆలస్యాలు, సమన్వయ లోపాలు, నాణ్యత వివాదాలు, మిల్లింగ్ సామర్థ్యానికి మించిన కేటాయింపులు వంటి అంశాలు మిల్లింగ్ రంగంపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో కూడా ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించాలి. అసలు ప్రశ్న ‘ప్రభుత్వం తప్ప
రైస్ మిల్లింగ్ సంక్షోభానికి.. సమగ్ర సంస్కరణే పరిష్కారం !
రైస్ మిల్లింగ్ సంక్షోభానికి.. సమగ్ర సంస్కరణే పరిష్కారం !

తెలంగాణ పౌర సరఫరాల వ్యవస్థలో ప్రస్తుతం కనిపిస్తున్న సమస్యలను కేవలం ప్రభుత్వం, రైస్ మిల్లర్ల మధ్య వివాదంగా చూడటం సరైంది కాదు. ఇది రైతు ప్రయోజనాలు, ప్రభుత్వ ఆర్థిక బాధ్యత, ప్రజాధనం, ఆహార భద్రత, గ్రామీణ ఆర్థికవ్యవస్థ, మిల్లింగ్ పరిశ్రమ వంటి అనేక అంశాలతో ముడిపడి ఉన్న విస్తృతమైన విధానపరమైన సమస్య. ఒకవైపు ప్రజల డబ్బుతో కొనుగోలు చేసిన ధాన్యాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

మరోవైపు ప్రభుత్వ విధానాల అమలులో ఏర్పడే ఆలస్యాలు, సమన్వయ లోపాలు, నాణ్యత వివాదాలు, మిల్లింగ్ సామర్థ్యానికి మించిన కేటాయింపులు వంటి అంశాలు మిల్లింగ్ రంగంపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో కూడా ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించాలి. అసలు ప్రశ్న ‘ప్రభుత్వం తప్పా? మిల్లర్ తప్పా?’ అనే స్థాయిలో ఆగిపోకూడదు.

వ్యవస్థలో ఎక్కడ లోపం ఏర్పడింది ?
ఇకపై అదే సమస్య పునరావృతం కాకుండా ఏ నియంత్రణలు అవసరం? అనేదే ముఖ్యం. తెలంగాణ ఆహార భద్రతా వ్యవస్థలో ధాన్యం కొనుగోలు, మిల్లింగ్, నిల్వ, పంపిణీ పరస్పరాధారితమైన దశలు. రైతు పండించిన ధాన్యం మిల్లుల్లో బియ్యంగా మారి, ప్రభుత్వ గోదాంల ద్వారా ప్రజలకు చేరుతుంది.

ఈ గొలుసులో ఏ ఒక్క దశలో సమస్య ఏర్పడినా దాని ప్రభావం రైతు నుంచి వినియోగదారుడి వరకు పడుతుంది. ఈ ప్రక్రియలో రైస్ మిల్లర్ కేవలం ధాన్యాన్ని బియ్యంగా మార్చే వ్యక్తి కాదు. నిల్వ, మిల్లింగ్, నాణ్యత, రికార్డుల నిర్వహణ బాధ్యతలను నిర్వహించే కీలక పారిశ్రామిక భాగస్వామి. ప్రభుత్వం అప్పగించే ధాన్యం ప్రజా ఆస్తి కాబట్టి ప్రతి కిలోకు లెక్క ఉండాలి.

విధాన రూపకల్పనలోనే అసలు సమస్య ఉందా ?
ధాన్యం నాణ్యత, తేమ శాతం, నిల్వ సామర్థ్యం, విద్యుత్ సరఫరా, కార్మికుల లభ్యత, రవాణా, గోదాంల అందుబాటు, బియ్యం స్వీకరణ ప్రక్రియ వంటి అనేక అంశాలు మిల్లింగ్ ప్రక్రియను ప్రభావితం చేస్తాయి. ‘ధాన్యం తీసుకున్నావు– బియ్యం ఇవ్వాలి’ అనే సరళమైన లెక్కలో వాస్తవ పరిస్థితులు కనిపించవు.

ధాన్యం నాణ్యతపై వివాదం ఏర్పడినా, గోదాంలో స్థలం లేకపోయినా, రవాణా ఆలస్యమైనా, మిల్లర్ సామర్థ్యానికి మించి ధాన్యం కేటాయించినా వివాదాలు తప్పవు. కాబట్టి బాధ్యతను నిర్ణయించే ముందు ఆలస్యానికి కారణాన్ని నిర్ధారించే విధానం అవసరం.

షార్ట్‌ ‌ఫాలింగ్‌‌ లెక్కింపుపై మిల్లర్ల అభ్యంతరం !
రైస్ మిల్లర్లు షార్ట్‌‌ఫాలింగ్‌‌ను వాస్తవ భౌతిక దిగుబడి ఆధారంగా లెక్కించాలని కోరుతున్నారు. ఒక క్వింటాల్ ధాన్యాన్ని మిల్లింగ్‌‌ చేసినప్పుడు ధాన్యం రకం, తేమ శాతం, నాణ్యత, మిల్లింగ్‌‌ సామర్థ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వాస్తవంగా వచ్చే బియ్యం పరిమాణాన్ని నిర్ధారించాలని వారి వాదన.

కేవలం నిర్ణయించిన రికవరీ శాతాన్ని ప్రాతిపదికగా తీసుకుని కొరతగా చూపడం వల్ల మిల్లర్లపై అదనపు ఆర్థిక భారం పడుతోందని వారు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల్లోనూ రికవరీ ప్రమాణాలు ఒకే విధంగా లేవు.

పశ్చిమ బెంగాల్‌‌లో ముడి బియ్యానికి 67 శాతం, బాయిల్డ్ రైస్‌‌కు 68 శాతం రికవరీ ప్రమాణాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌‌లో నాన్‌‌-హైబ్రిడ్ ధాన్యానికి రికవరీ ప్రమాణాన్ని 67 నుంచి 66 శాతానికి తగ్గించారు. దీంతో తెలంగాణలోనూ ధాన్యం రకం, తేమ, నాణ్యత, సహజ మిల్లింగ్‌‌ నష్టాలను పరిగణనలోకి తీసుకుని శాస్త్రీయ, పారదర్శక విధానంతో షార్ట్‌‌ఫాలింగ్‌‌ను లెక్కించాలన్నది మిల్లర్ల ప్రధాన డిమాండ్‌‌గా ఉంది.

వాస్తవ వ్యయాలపై సమీక్ష
విద్యుత్, డీజిల్, కార్మికులు, యంత్రాల నిర్వహణ, రవాణా, నిల్వ, వడ్డీ వంటి వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత మిల్లింగ్ చార్జీలు వాస్తవ నిర్వహణ వ్యయాలకు ఎంతవరకు సరిపోతున్నాయనేది పరిశీలించాలి. 2024–25 ఖరీఫ్ సీజన్ నుంచి అదనపు మిల్లింగ్ చార్జీలకు సంబంధించిన విధానాన్ని ప్రభుత్వం తీసుకురావడం వ్యయ ఒత్తిడిపై జరిగిన చర్చలకు ఒక ప్రతిస్పందన.

దొడ్డు రకం బియ్యానికి క్వింటాల్‌‌కు రూ.30, సన్నరకానికి రూ.40 అదనంగా చెల్లించే విధానం ఇందులో ఉంది. సమయ పాలనను ప్రోత్సహించడానికి షరతులు అవసరమే అయినప్పటికీ, ఆలస్యానికి కారణం ఎవరివైపు ఉందనేది ప్రతి సందర్భంలో పరిశీలించాలి.

ప్రజాధాన్యం.. ప్రభుత్వ జవాబుదారీతనం
ప్రభుత్వ వాదనను కూడా విస్మరించలేం. ప్రజల డబ్బుతో కొనుగోలు చేసిన ధాన్యం ప్రభుత్వ ఆస్తి. అది మిల్లర్ వద్దకు వెళ్లిన తర్వాత లెక్కల్లో పారదర్శకత ఉండాలి. ధాన్యాన్ని ఉద్దేశపూర్వకంగా మళ్లించడం, తప్పుడు రికార్డులు సృష్టించడం, బియ్యాన్ని అక్రమంగా నిలిపివేయడం వంటి చర్యలకు ఆధారాలు లభిస్తే చట్టపరమైన చర్యలు తప్పనిసరి. ఉదాహరణకు ఇటీవల సీఎంఆర్‌‌‌‌ బియ్యం కొరత, మళ్లింపు ఆరోపణలపై కేసులు నమోదైన విషయం తెలిసిందే.

రెండు మిల్లుల్లో సుమారు 29,187 మెట్రిక్‌‌ టన్నుల బియ్యం కొరత ఉన్న విషయాన్ని గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించి రాజకీయ కక్ష సాధింపులో భాగమేనన్న వాదనలు వస్తున్న నేపథ్యంలో.. స్పష్టత ఇక్కడ అవసరం. చట్టపరమైన చర్యలు కేవలం స్పష్టమైన ఆధారాలు, వ్యక్తిగత ప్రమేయం ప్రాతిపదికనే ఉండాలి.

డిజిటల్ ట్రాకింగ్‌‌తో ముందస్తు నియంత్రణ
ఈ సమస్యకు సాంకేతికత ఒక కీలక పరిష్కారంగా ఉపయోగపడవచ్చు. ప్రతి మిల్లుకు కేటాయించిన ధాన్యం పరిమాణం, అందుకున్న తేదీ, తేమ శాతం, మిల్లింగ్ సామర్థ్యం, రోజువారీ మిల్లింగ్, సీఎంఆర్‌‌‌‌ డెలివరీ, ప్రభుత్వ గోదాం స్వీకరణ వివరాలు ఒకే డిజిటల్ వ్యవస్థలో కనిపించాలి. సామర్థ్యానికి అనుగుణంగా మిల్లింగ్ జరగకపోతే లేదా కేటాయింపులు మించితే వ్యవస్థ ముందుగానే అలర్ట్ జారీ చేయాలి.

ప్రభుత్వం, మిల్లర్లు పరస్పరం ప్రత్యర్థులుగా కాకుండా రైతు ప్రయోజనం, ప్రజా ఆహార భద్రత కోసం బాధ్యత వహించే భాగస్వాములుగా పనిచేసినప్పుడే వ్యవస్థకు దీర్ఘకాలిక స్థిరత్వం వస్తుంది. రైతు పండించిన ప్రతి గింజకు విలువ రావాలి. ప్రభుత్వ ధాన్యానికి ప్రతి కిలోకు లెక్క ఉండాలి.

నిబంధనలు పాటించే మిల్లర్‌‌కు న్యాయమైన వ్యవస్థ ఉండాలి. అక్రమానికి పాల్పడిన వ్యక్తిపై ఆధారాలతో చట్టం తన పని చేయాలి. ఈ నాలుగు లక్ష్యాలను సాధించే విధానమే తెలంగాణ పౌరసరఫరాల వ్యవస్థకు అవసరమైన నిజమైన సంస్కరణ.

మేకల క్రిష్ణ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం

  • ఓపెన్​పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ​ఐడీ openpage@v6velugu.com
  • రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
  • రచన 700 పదాలకు మించరాదు.
©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← పొద్దంతా ఫీల్డ్లోనే ఆఫీసర్లు.. ట్రై కమిషనరేట్లలో అందరూ రోడ్లపైనే..జిలుగుల తార.. ప్రేమ జ్వాల.. రణబీర్, అలియా భట్ లవ్ అండ్ వార్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com