☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Dorothy | ‘డొరోతి’ సినిమాపై కార్తిక్ సుబ్బరాజు ఎమోషనల్ పోస్ట్.. నా మొదటి సినిమా ‘పిజ్జా’ విడుదల నాటి టెన్షన్ అలాగే ఉంది!

Dorothy | ప్రముఖ త‌మిళ‌ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు తన 10వ సినిమా 'డొరోతి' (Dorothy) విడుదల సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగ లేఖను పంచుకున్నారు. ఈ సినిమా రిలీజ్ రోజున తనలో ఉండే ఉత్సాహం, టెన్షన్ తన మొదటి సినిమా 'పిజ్జా' విడుదల నాటిలాగే ఉందని ఆయన పేర్కొన్నారు.
Dorothy | ‘డొరోతి’ సినిమాపై కార్తిక్ సుబ్బరాజు ఎమోషనల్ పోస్ట్.. నా మొదటి సినిమా ‘పిజ్జా’ విడుదల నాటి టెన్షన్ అలాగే ఉంది!

Dorothy | ప్రముఖ త‌మిళ‌ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు తన 10వ సినిమా ‘డొరోతి’ (Dorothy) విడుదల సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగ లేఖను పంచుకున్నారు. ఈ సినిమా రిలీజ్ రోజున తనలో ఉండే ఉత్సాహం, టెన్షన్ తన మొదటి సినిమా ‘పిజ్జా’ విడుదల నాటిలాగే ఉందని ఆయన పేర్కొన్నారు.

ఈ సినిమాను తెరకెక్కించిన రోజులు వ్యక్తిగా, ఒక ఫిల్మ్‌మేకర్‌గా, కళాకారుడిగా తనను పూర్తిగా మార్చేశాయని కార్తిక్ సుబ్బరాజు తెలిపారు. తాను ఇప్పటివరకు తెరకెక్కించిన చిత్రాల్లో ఇదే అత్యంత రియాలిటీకి దగ్గరగా ఉండే, భావోద్వేగాలతో కూడిన కథ అని చెప్పారు. ఈ కథ 90వ దశకంలో జరిగిన అనేక నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంది. దీన్ని మెయిన్‌స్ట్రీమ్‌కు తీసుకురావాలని అనుకున్నప్పుడు ఏ నమ్మకంతో ఈ సినిమా తీస్తున్నారు? అని చాలా మంది తనను ప్రశ్నించినట్లు ఆయన గుర్తు చేసుకున్నారు.

ఆ ప్రశ్నకి అప్పడూ, ఇప్పుడూ తన సమాధానం ఒక్కటేనని.. అదే ప్రేక్షకులపై తనకు ఉన్న నమ్మకం అని ఆయన స్పష్టం చేశారు. చిన్నపిల్లవాడు తాను వేసిన మొదటి పెయింటింగ్‌ను తన తల్లిదండ్రులకు చూపించినట్లుగా, తమ టీమ్ ఈ సినిమాను ప్రేక్షకులకు చూపించేందుకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమాను థియేటర్లలోనే చూసి ఆస్వాదించాలని, ఇది కచ్చితంగా మీ డబ్బుకు, సమయానికి తగిన విలువ ఇస్తుందని ఆయన హామీ ఇచ్చారు. అలాగే, సినిమా చూసేముందు స్పాయిలర్స్ చదవవద్దని, చూశాక కూడా సోషల్ మీడియాలో క్లిప్స్ లేదా స్పాయిలర్స్ పోస్ట్ చేసి ఇతరుల అనుభూతిని పాడు చేయవద్దని కోరారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ టైటిల్ రోల్‌లో నటించగా, సనాంత్ సుబ్బు పాత్రలో, రిషికాంత్ కార్తి పాత్రలో, ముత్తుకుమార్ వీరయ్య పాత్రలో కనిపించారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Asian Games 2026: షూటింగ్‌లో గోల్డ్‌.. సురుచి, క‌మ‌ల్‌జీత్ జోడికి ప‌త‌కంThe Paradise | నెగెటివ్ టాక్‌ను దాటేసిన ‘ది ప్యారడైజ్’.. నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com