☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Asian Games 2026: షూటింగ్‌లో గోల్డ్‌.. సురుచి, క‌మ‌ల్‌జీత్ జోడికి ప‌త‌కం

Asian Games 2026: ఆసియా క్రీడ‌ల్లో.. భార‌త షూట‌ర్లు అద్భుతంగా ప‌ర్ఫార్మ్ చేస్తున్నారు. 10 మీట‌ర్ల ఎయిర్ పిస్తోల్ ఈవెంట్‌లో సురుచి, క‌మ‌ల్‌జీత్ జోడికి స్వ‌ర్ణ ప‌త‌కం ద‌క్కింది. ఆ జోడి 484.6 పాయింట్ల‌తో ఆ ఈవెంట్‌లో ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. ఇక మెన్స్ 50 మీట‌ర్ల రైఫిల్ 3 పొజిష‌న్స్ టీమ్ ఈవెంట్‌లో ఆ ప‌త‌కం ద‌క్కింది.
Asian Games 2026: షూటింగ్‌లో గోల్డ్‌.. సురుచి, క‌మ‌ల్‌జీత్ జోడికి ప‌త‌కం

న‌గోయా: జ‌పాన్‌లో జ‌రుగుతున్న ఆసియా క్రీడ‌ల్లో(Asian Games 2026).. భార‌త షూట‌ర్లు సూప‌ర్ షో క‌న‌బ‌రుస్తున్నారు. భార‌త షూట‌ర్లు ఇవాళ గోల్డ్ మెడ‌ల్ గెలుచుకున్నారు. 10 మీట‌ర్ల ఎయిర్ పిస్తోల్ ఈవెంట్‌లో సురుచి, క‌మ‌ల్‌జీత్ జోడికి స్వ‌ర్ణ ప‌త‌కం ద‌క్కింది. ఆ జోడి 484.6 పాయింట్ల‌తో ఆ ఈవెంట్‌లో ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. వ‌ర‌ల్డ్ రికార్డుకు నాలుగు పాయింట్ల దూరంలో నిలిచిపోయారు. భార‌తీయ జోడి ఆరంభం నుంచి దూకుడును చూపింది. అయితే ఈవెంట్ మొత్తం త‌మ ఆధిప‌త్యాన్ని నిల‌క‌డ‌గా ప్ర‌ద‌ర్శించారు.

ద‌క్షిణ కొరియా తీవ్ర వ‌త్తిడి పెంచుతున్నా.. భార‌త ఎయిర్ పిస్తోల్ షూట‌ర్లు మాత్రం మెరుగ్గా రాణించారు. 6.6 పాయింట్ల తేడాతో ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శించి.. చివ‌ర‌కు స్వ‌ర్ణ ప‌త‌కాన్ని సొంతం చేసుకున్నారు. ద‌క్షిణ కొరియా 478.0, ఇరాన్ 415.8 పాయింట్ల‌తో రెండు, మూడో స్థానాల్లో నిలిచాయి.

ఇక షూటింగ్‌లో సిల్వ‌ర్ మెడ‌ల్ కూడా ద‌క్కింది. మెన్స్ 50 మీట‌ర్ల రైఫిల్ 3 పొజిష‌న్స్ టీమ్ ఈవెంట్‌లో ఆ ప‌త‌కం ద‌క్కింది. ఐశ్వ‌రీ ప్ర‌తాప్ సింగ్ తోమార్‌, నిరాజ్ కుమార్‌, రుద్రాంన్‌క్ష్ పాటిల్ ఆ టీమ్‌లో ఉన్నారు. ఇక స్క్వాష్ ఈవెంట్‌లో జోషానా చిన్న‌ప్ప‌, వెలావ‌న్ సెంథిల్‌కుమార్ జోడికి క‌నీసం బ్రాంజ్ మెడ‌ల్ ద‌క్కే అవ‌కాశాలు ఉన్నాయి.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Sampoornesh Babu | నటుడు సంపూర్ణేష్ బాబుకు క్షమాపణలు చెప్పిన జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్!Dorothy | ‘డొరోతి’ సినిమాపై కార్తిక్ సుబ్బరాజు ఎమోషనల్ పోస్ట్.. నా మొదటి సినిమా ‘పిజ్జా’ విడుదల నాటి టెన్షన్ అలాగే ఉంది! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com