☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
వేగంగా దూసుకొస్తున్న కారు.. ఆపి చెక్ చేసిన పోలీసుల మైండ్‌బ్లాక్..! • అబీయేలోని మార్కెట్‌పై డ్రోన్ దాడి: 153 మంది మృతి • పేద విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్లలో సీట్లు • Son of Kanaka Durgamma : అమ్మవారి అవతారంలో లయ.. ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ పోస్టర్ అదిరిందిగా! • Ration Card : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రేషన్ కార్డు ఉన్నవారికి భారీ శుభవార్త.. • సౌరవ్ దాస్,అశుతోష్ రాంకాలపై నమోదైన రెండో కేసు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ • పోలీసు శాఖలో 7,437 పోస్టుల భర్తీకి అనుమతి.. సీఎం రేవంత్ కీలక ప్రకటన • ఏపీ మున్సిపల్ ఎన్నికలపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. ఎన్నికల సంఘానికి స్పష్టమైన ఆదేశాలు! •

ఎలా ఉన్న అమ్మాయిని ఎలా మార్చేశారు గురూ..! భోగిలో నటిస్తున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.?

టాలీవుడ్ ప్రామిసింగ్ హీరో శర్వానంద్ సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’ సినిమా టీజర్ విడుదలైంది. టీజర్‌లోని విజువల్స్ నెక్ట్స్ లెవల్‌లో ఉన్నాయి. 1960ల నాటి తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దు నేపథ్యంలో సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఎలా ఉన్న అమ్మాయిని ఎలా మార్చేశారు గురూ..! భోగిలో నటిస్తున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.?

సినిమా ఇండస్ట్రీలో కొంతమంది నటీనటులు చిన్న వయసులోనే కెమెరా ముందుకొచ్చి ప్రేక్షకులకు పరిచయమవుతారు. బాలనటులుగా గుర్తింపు తెచ్చుకుని, ఆ తర్వాత హీరోయిన్లుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటారు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న నటి ఒకరు. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? పై ఫోటోలో శర్వానంద్ సిస్టర్స్ లో కనిపిస్తున్న ఆమెను గుర్తుపట్టారా.? సినిమా కోసం అలా మార్చేశారు కానీ బయట ఆమె చాలా అందంగా ఉంటుంది. హీరోయిన్ గా సినిమాలు కూడా చేసింది. ఆమె మరెవరో కాదు ప్రణవి మానుకొండ. చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తితో అడుగులు వేసిన ఈ బ్యూటీ.. సినిమాలు, టెలివిజన్ సీరియల్స్, సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యింది.

చిన్న వయసులోనే నటనపై ఆసక్తి పెంచుకున్న ఆమె.. బాలనటిగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ‘రొటీన్ లవ్ స్టోరీ’, ‘ఉయ్యాల జంపాల’ వంటి సినిమాల్లో చిన్నప్పటి పాత్రల్లో కనిపించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత మరికొన్ని చిత్రాల్లో నటిస్తూ తన ప్రతిభను నిరూపించుకునే ప్రయత్నం చేసింది. సినిమాలతో పాటు బుల్లితెరపై కూడా ప్రణవి తనదైన ముద్ర వేసింది. ‘పసుపు కుంకుమ’, ‘సూర్యవంశం’, ‘ఎవరే నువ్వు మోహినీ’, ‘గంగ మంగ’ వంటి సీరియల్స్‌లో నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. ఒకవైపు టెలివిజన్‌లో నటిస్తూనే మరోవైపు సినిమాల్లో అవకాశాలను అందిపుచ్చుకుంది.

బాలనటిగా, సీరియల్ నటిగా ప్రయాణం సాగించిన ప్రణవి.. 2023లో విడుదలైన ‘స్లమ్ డాగ్ హస్బెండ్’ సినిమాతో హీరోయిన్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ప్రస్తుతం ప్రణవి మానుకొండకు మరో ఆసక్తికరమైన అవకాశం దక్కింది. చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా, దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’లో ఆమె నటిస్తుంది. ఈ సినిమాలో శర్వానంద్ సిస్టర్స్ లో ఒకరిగా ప్రణవి కనిపించనుంది. ఇప్పటికే రక్షాబంధన్ సందర్భంగా విడుదలైన పోస్టర్‌లో శర్వానంద్ తన సోదరీమణులతో కనిపించడం సినిమాపై ఆసక్తిని పెంచింది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన పాట వైరల్ అవుతుంది. కాగా ప్రణవికి సోషల్ మీడియాలో విరూపరీతమైన ఫాలోయింగ్ ఉంది.

View this post on Instagram

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Asian Para Games 2026: చిన్నప్పుడే చేయి కోల్పోయాడు.. ఇప్పుడు రెండు గోల్డ్ మెడల్స్‌తో చరిత్ర సృష్టించాడు!Dream Meaning: కలలో ఇవి కనిపిస్తున్నాయా? మీ జీవితంలో రాబోయే శుభసూచనలు ఇవేనట! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com