☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

DoT SIM Card Warning: మీ పేరు మీద సిమ్‌ను వేరొకరు వాడుతున్నారా? మీకు రూ.50 లక్షల వరకు జరిమానా!, పైగా శిక్ష..

DoT SIM Card Warning: కొందరు తమ పేరు మీద సిమ్‌ తీసి.. బంధువులు, స్నేహితులకు ఇచ్చినవారు ఉన్నారు.. ఇంకా కొందరు తెలివిగా.. ముందస్తు ప్లాన్‌లో భాగంగా కూడా ఇతరుల పేర్లతో సిమ్‌కార్డులు తీసుకొని వాడేవారూ ఉన్నారు.. అయితే, మీ పేరు మీద ఉన్న సిమ్ కార్డును వేరొకరు ఉపయోగిస్తున్నారా? అయితే ఇకపై ఈ విషయాన్ని తేలికగా తీసుకోవద్దని టెలికమ్యూనికేషన్స్ శాఖ (DoT) హెచ్చరించింది. మోసపూరితంగా సిమ్ జారీ చేయడం, టెలికాం ఐడెంటిఫయర్లను దుర్వినియోగం చేయడం, మొబైల్ […]
DoT SIM Card Warning: మీ పేరు మీద సిమ్‌ను వేరొకరు వాడుతున్నారా? మీకు రూ.50 లక్షల వరకు జరిమానా!, పైగా శిక్ష..

DoT SIM Card Warning: కొందరు తమ పేరు మీద సిమ్‌ తీసి.. బంధువులు, స్నేహితులకు ఇచ్చినవారు ఉన్నారు.. ఇంకా కొందరు తెలివిగా.. ముందస్తు ప్లాన్‌లో భాగంగా కూడా ఇతరుల పేర్లతో సిమ్‌కార్డులు తీసుకొని వాడేవారూ ఉన్నారు.. అయితే, మీ పేరు మీద ఉన్న సిమ్ కార్డును వేరొకరు ఉపయోగిస్తున్నారా? అయితే ఇకపై ఈ విషయాన్ని తేలికగా తీసుకోవద్దని టెలికమ్యూనికేషన్స్ శాఖ (DoT) హెచ్చరించింది. మోసపూరితంగా సిమ్ జారీ చేయడం, టెలికాం ఐడెంటిఫయర్లను దుర్వినియోగం చేయడం, మొబైల్ ఫోన్ IMEI నంబర్లను ట్యాంపరింగ్ చేయడం వంటి ఉల్లంఘనలకు టెలికమ్యూనికేషన్స్ చట్టం, 2023 ప్రకారం గరిష్ఠంగా మూడేళ్ల జైలు, రూ.50 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపింది.

ముఖ్యంగా తమ పేరు మీద ఎన్ని మొబైల్ కనెక్షన్లు ఉన్నాయో వినియోగదారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలని DoT సూచించింది. ఇందుకోసం ప్రభుత్వ సంచార్ సాథీ పోర్టల్ లేదా మొబైల్ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. తమకు తెలియని లేదా అవసరం లేని నంబర్లను గుర్తిస్తే వాటిని రిపోర్ట్ చేసి బ్లాక్ చేయవచ్చు.

గుర్తింపు పత్రాలతో 25 సిమ్‌లు యాక్టివేట్
తాజాగా DoT హెచ్చరికకు ఓ సైబర్ క్రైమ్ దర్యాప్తులో వెలుగుచూసిన ఘటన కారణంగా మారింది.. ఛత్తీస్‌గఢ్‌లో ఓ పాయింట్ ఆఫ్ సేల్ (PoS) ఏజెంట్ ప్రజల గుర్తింపు పత్రాలను వారి అనుమతి లేకుండా ఉపయోగించి 25 మొబైల్ కనెక్షన్లను యాక్టివేట్ చేసినట్లు అధికారులు గుర్తించారు. అనంతరం ఆ ఏజెంట్‌ను బ్లాక్‌లిస్ట్ చేశారు. ఆ 25 నంబర్లను డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా పరిశీలించి, అనుమానాస్పద నంబర్లను రీ-వెరిఫికేషన్‌కు పంపారు. ధృవీకరణలో విఫలమైన కనెక్షన్లను డీయాక్టివేట్ చేశారు.

మీ పేరు మీద ఉన్న సిమ్‌ను ఇతరులకు ఇవ్వొద్దు
అంటే, మీ పేరు మీద తీసుకున్న సిమ్ కార్డును స్నేహితులు, బంధువులు లేదా ఇతర వ్యక్తులకు అప్పగించడం, అమ్మడం, బదిలీ చేయడం, అద్దెకు ఇవ్వడం వంటి వాటికి దూరంగా ఉండాలని DoT స్పష్టం చేసింది. ముఖ్యంగా సైబర్ మోసాలు లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఉపయోగించే ‘మ్యూల్ సిమ్’గా మీ పేరుతో ఉన్న నంబర్ మారితే, అసలు చందాదారుడికి కూడా చట్టపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

IMEI ట్యాంపరింగ్‌పైనా నిఘా
హెచ్చరిక సిమ్ కార్డులకే పరిమితం కాలేదు. మొబైల్ ఫోన్ల ప్రత్యేక గుర్తింపు సంఖ్య అయిన IMEIని మార్చడం లేదా ట్యాంపర్ చేసిన IMEI ఉన్న పరికరాలను ఉపయోగించడాన్ని కూడా DoT హెచ్చరించింది. కాన్ఫిగర్ చేయగల లేదా మార్చిన IMEIలతో ఉన్న మోడెమ్స్, SIM బాక్స్‌లు వంటి పరికరాలను ఉపయోగించవద్దని సూచించింది. అలాగే Calling Line Identity (CLI) లేదా ఇతర టెలికాం ఐడెంటిఫయర్లను మార్చే యాప్స్, వెబ్‌సైట్లు, సాధనాలను ఉపయోగించకూడదని తెలిపింది.

మీ పేరు మీద ఎన్ని సిమ్‌లు ఉన్నాయో ఇలా చెక్ చేసుకోండి
కొన్నిసార్లు మీకు తెలియకుండా ఎవరైనా సిమ్‌ కార్డు తీసుకోవచ్చు.. మీరు ఇచ్చి కూడా మర్చిపోవచ్చు.. అయితే, సంచార్ సాథీ ద్వారా మీ పేరుతో జారీ అయిన మొబైల్ కనెక్షన్లను పరిశీలించవచ్చు. తెలియని లేదా అవసరం లేని నంబర్లు కనిపిస్తే వాటిని రిపోర్ట్ చేసి డిస్‌కనెక్ట్ చేయించుకునే అవకాశం ఉంది. అలాగే మొబైల్ హ్యాండ్‌సెట్ IMEI వివరాలను కూడా సంచార్ సాథీ ద్వారా తనిఖీ చేయవచ్చు.

అయితే మీ పేరు మీద సిమ్ ఉన్నందుకు మాత్రమే రూ.50 లక్షల జరిమానా లేదా మూడేళ్ల జైలు శిక్ష విధిస్తారనే అర్థం కాదు. ఇవి నిర్దిష్ట టెలికాం ఉల్లంఘనలకు చట్టంలో ఉన్న గరిష్ఠ శిక్షలు. ముఖ్యంగా మోసపూరితంగా సిమ్ పొందడం, ఇతరుల పేరుతో అనుమతి లేకుండా కనెక్షన్లు తీసుకోవడం, సిమ్‌ను చట్టవిరుద్ధ వినియోగానికి అప్పగించడం, IMEI లేదా ఇతర టెలికాం ఐడెంటిఫయర్లను ట్యాంపర్ చేయడం వంటి చర్యలపై DoT హెచ్చరిస్తోంది.. ఇప్పటికైనా ఆలస్యం చేయకండి.. వెంటనే మీ పేరుపైన ఎన్ని సిమ్‌ కార్డులు ఉన్నాయి.. మీరు ఉపయోగించేవి ఏంటి.. మీ పేరుతో ఇతరులు ఎవరైనా వాడుతున్నారేమో చెక్‌ చేసి బ్లాక్‌ చేయండి..

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Turkey Earthquake: టర్కీలో భారీ భూకంపం.. 5.8 తీవ్రతతో కంపించిన భూమిFaria: నేనింకా ఇల్లు కొనలేదు.. సందీప్ కిషన్ చెప్పాక కొనాలనుకున్నా.! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com