☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Nagaland: నాగాలాండ్‌లో క‌ల్తీ మ‌ద్యం తాగి 19 మంది మృతి.. ముఠా గుట్టు విప్పేందుకు సిట్ ఏర్పాటు

Nagaland: నాగాలాండ్‌లో క‌ల్తీ మ‌ద్యం తాగి మృతిచెందిన వారి సంఖ్య 19కి చేరింది. దీంతో ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు ద‌ర్యాప్తును ముమ్మరం చేశారు. క‌ల్తీ మ‌ద్యం స‌ర‌ఫ‌రా చేస్తున్న ముఠాను ప‌ట్టుకునేందుకు సిట్ ఏర్పాటు చేశారు.
Nagaland: నాగాలాండ్‌లో క‌ల్తీ మ‌ద్యం తాగి 19 మంది మృతి.. ముఠా గుట్టు విప్పేందుకు సిట్ ఏర్పాటు

కోహిమా: నాగాలాండ్‌(Nagaland)లో క‌ల్తీ మ‌ద్యం తాగి మృతిచెందిన వారి సంఖ్య 19కి చేరింది. దీంతో ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు ద‌ర్యాప్తును ముమ్మరం చేశారు. క‌ల్తీ మ‌ద్యం స‌ర‌ఫ‌రా చేస్తున్న ముఠాను ప‌ట్టుకునేందుకు ఆప‌రేష‌న్ చేప‌ట్టారు. గ‌త రెండు రోజుల నుంచి రెండు జిల్లాల్లో మృతుల సంఖ్య అధికంగా ఉన్న‌ది. మోకాక్‌చుంగ్‌లో 8 మంది, టున్‌సాంగ్‌లో 11 మంది మృతిచెందారు. క‌ల్తీ మ‌ద్యం ముఠాను ప‌ట్టుకునేందుకు నాగా పోలీసులు సిట్ ఏర్పాటు చేశారు. న‌కిలీ మ‌ద్యం ఎక్క‌డ నుంచి స‌ర‌ఫ‌రా అవుతుందో తేల్చేందుకు ఆ సిట్ ప్ర‌త్యేక ఆప‌రేష‌న్ చేప‌ట్టింది.

అద‌న‌పు ఎస్పీ ఐ బుంగ్‌లాండ్ చాంగ్ , సీనియ‌ర్ ఎస్పీ వెసుప్రా కీజో నేతృత్వంలో ప‌నిచేయ‌నున్న‌ది. అనుమానిత లిక్క‌ర్ శ్యాంపిళ్ల‌ను ఫోరెన్సిక్ ప‌రీక్ష కోసం గౌహ‌తికి పంపించారు. ఈ కేసులో కొన్ని ఆధారాలు దొరికాయ‌ని, కానీ ఆ వివ‌రాల‌ను ఇప్పుడే వెల్ల‌డించ‌లేమ‌ని అధికారులు చెప్పారు. మృతుల సంఖ్య పెరగ‌డంతో.. ప‌లు ప్ర‌దేశాల్లో త‌నిఖీలు నిర్వ‌హించారు. క‌ల్తీ మ‌ద్యంతో లింకున్న సుమారు 19 మందిని అరెస్టు చేశారు. మూడు వేల బాటిళ్ల మ‌ద్యాన్ని సీజ్ చేశారు. వాస్త‌వానికి నాగాలాండ్‌లో 1990 నుంచి మ‌ద్య నిషేధం అమ‌లులో ఉన్న‌ది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయంThe Paradise | రెండు రోజుల్లోనే రూ. 114 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద నాని ‘ది ప్యారడైజ్’ ఊచకోత! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com