☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కాక్రోచ్ పార్టీ 2.0 అట్టర్ ఫ్లాప్ : ఎగతాళి చేస్తున్న బీజేపీ • Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణ ఎలా ఉండబోతుందంటే? • విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సుస్మిత కొణిదెల • న్యాయవాదుల నిర్బంధంపై సీజేఐ జోక్యానికి SCBA విజ్ఞప్తి • Penguins: పెరుగుతున్న భూతాపం.. పిట్టల్లా రాలిపోతున్న పెంగ్విన్లు.. • నితిన్ కొత్త సినిమాలో..రుక్మిణీగా బాలీవుడ్ నటి? • తెలుగు అబ్బాయిలంటే ఇష్టం.. పెళ్లి కూడా చేసుకుంటా..! హీరోయిన్ క్రేజీ కామెంట్స్ • కాక్రోచ్ పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే నాయనమ్మ కన్నుమూత •

France | ఫ్రాన్స్‌లో జెన్‌ ఆల్ఫా నిరసనలు.. స్కూళ్ల సమస్యలపై విద్యార్థుల ఉద్యమం

బడుల్లో మెరుగైన సదుపాయాలను డిమాండ్‌ చేస్తూ ఫ్రాన్స్‌లో విద్యార్థులు మంగళవారం నిరసన ప్రదర్శనలు చేశారు. చెత్త బుట్టలకు నిప్పు పెట్టి పోలీసులపైకి వస్తువులను విసిరేశారు. దీంతో పోలీసులు వారిపై బాష్ప వాయువును ప్రయోగించారు.
France | ఫ్రాన్స్‌లో జెన్‌ ఆల్ఫా నిరసనలు.. స్కూళ్ల సమస్యలపై విద్యార్థుల ఉద్యమం

పారిస్‌ : బడుల్లో మెరుగైన సదుపాయాలను డిమాండ్‌ చేస్తూ ఫ్రాన్స్‌లో విద్యార్థులు మంగళవారం నిరసన ప్రదర్శనలు చేశారు. చెత్త బుట్టలకు నిప్పు పెట్టి పోలీసులపైకి వస్తువులను విసిరేశారు. దీంతో పోలీసులు వారిపై బాష్ప వాయువును ప్రయోగించారు. టైమ్‌టేబుల్‌, తరగతికి ఉండాల్సిన విద్యార్థుల సంఖ్య, టీచర్ల కొరత, ఉక్కపోతగా ఉన్న తరగతి గదులు తదితర సమస్యలపై వారం రోజుల నుంచి విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

మొదట పారిస్‌ చుట్టుపక్కల ప్రారంభమైన ఈ నిరసనలు ఆ తర్వాత దేశంలోని నగరాలన్నింటికీ విస్తరించాయి. దేశ వ్యాప్తంగా మూడు లక్షల మంది నిరసన కవాతుల్లో పాల్గొన్నారని సంఘాలు తెలిపాయి. ‘నగర శివార్లకు చెందిన మేము నిర్లక్ష్యానికి, విస్మరణకు గురయ్యాం. ఇక్కడ పరిస్థితులు అపరిశుభ్రంగా ఉన్నాయి’ అని విక్టోయిర్‌ (16) అనే విద్యార్థిని విమర్శించింది. విద్యాశాఖ ప్రకారం దేశ వ్యాప్తంగా నిరసనల వల్ల 400 స్కూళ్లు ప్రభావితమయ్యాయి. 440 మందిని అదుపులోనికి తీసుకొన్నట్టు హోం శాఖ మంత్రి లారెంట్‌ తెలిపారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Greater Hyderabad | గ్రేటర్‌ @ 34.2డిగ్రీలుGovernment Hospital | దవాఖానలో పట్టించుకుంటలేరని ఎమ్మెల్యే ఇంటికి..! మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘటన →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com