☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Government Hospital | దవాఖానలో పట్టించుకుంటలేరని ఎమ్మెల్యే ఇంటికి..! మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘటన

ప్రభుత్వ దవాఖానలో వైద్యం అందడంలేదని ఆరోపిస్తూ తన తల్లిని వీల్‌చైర్‌పై ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు నివాసానికి తీసుకెళ్లి నిరసన తెలిపిన కొడుకు ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు బుధవారం సోషల్‌ మీడియాలో వైరలయ్యాయి. బాధితుల వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం పులిమడుగుకు చెందిన భూక్యా బుజ్జి కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నది.
Government Hospital | దవాఖానలో పట్టించుకుంటలేరని ఎమ్మెల్యే ఇంటికి..! మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘటన
  • 2 కిలోమీటర్లు వీల్‌చైర్‌లో తల్లిని తీసుకొచ్చిన కొడుకు
  • ప్రేమ్‌సాగర్‌రావు ఇంటివద్ద కుటుంబం ఆందోళన
  • మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘటన

మంచిర్యాల అర్బన్‌, సెప్టెంబర్‌ 30: ప్రభుత్వ దవాఖానలో వైద్యం అందడంలేదని ఆరోపిస్తూ తన తల్లిని వీల్‌చైర్‌పై ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు నివాసానికి తీసుకెళ్లి నిరసన తెలిపిన కొడుకు ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు బుధవారం సోషల్‌ మీడియాలో వైరలయ్యాయి. బాధితుల వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం పులిమడుగుకు చెందిన భూక్యా బుజ్జి కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నది.

మంగళవారం అర్ధరాత్రి ఆమె అస్వస్థతకు గురవడంతో కుమారుడు రాజ్‌కుమార్‌ మంచిర్యాల జిల్లా ప్రభుత్వ జనరల్‌ దవాఖానకుకు తీసుకువచ్చాడు. దవాఖాన సిబ్బంది స్పందించలేదని, కనీసం బెడ్‌ కూడా కేటాయించలేదని రాజ్‌ కుమార్‌ ఆవేదన వ్యక్తంచేశాడు. ప్రశ్నించినందుకు దవాఖాన సిబ్బంది తనపైనే దాడి చేశారని ఆరోపించాడు. తీవ్ర ఆవేదనకు గురైన రాజ్‌కుమార్‌ అదేరాత్రి తన తల్లిని అక్కడే ఉన్న వీల్‌చైర్‌లో కూర్చోబెట్టుకుని తోసుకుంటూ ప్రభుత్వ దవాఖాన నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోని ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు నివాసానికి వెళ్లాడు.

విషయం తెలుసుకున్న ప్రభుత్వ దవాఖాన ఆర్‌ఎంవో శ్రీధర్‌ ఎమ్మెల్యే నివాసానికి చేరుకుని.. బాధితులతో మాట్లాడి బుజ్జిని ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై ఆర్‌ఎంవోను వివరణ కోరగా రోగికి దవాఖానలో చికిత్స అందించడంలో ఎలాంటి జాప్యం చేయలేదని, రోగి కుమారుడు దవాఖా న సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించి, సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి పాల్పడినట్టు ఆర్‌ఎంవో తెలిపారు. అత్యవసర డయాలసిస్‌ అవసరం ఉండటంతో హయ్యర్‌ సెంటర్‌కు రెఫర్‌ చేయాలని సూచించామని, ప్రస్తుతం ఆమెను మెరుగైన వైద్యం కోసం వరంగల్‌ ఎం జీఎంకు తరలించినట్టు వెల్లడించారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← France | ఫ్రాన్స్‌లో జెన్‌ ఆల్ఫా నిరసనలు.. స్కూళ్ల సమస్యలపై విద్యార్థుల ఉద్యమంHarish rao | క్షుద్రపూజల కేసులో హరీశ్‌రావు వాంగ్మూలం.. 8న సాక్షుల వాంగ్మూలం నమోదు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com