☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

గణపతి నిమజ్జనంపై రేణూ దేశాయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు

Renu Desai: గణపతి నిమజ్జన వేడుకల్లో డీజేల హోరు, మద్యం సేవించి రోడ్లపై హంగామా చేయడంపై నటి రేణూ దేశాయ్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సోషల్ మీడియాలో...
గణపతి నిమజ్జనంపై రేణూ దేశాయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు

Renu Desai: గణపతి నిమజ్జన వేడుకల్లో డీజేల హోరు, మద్యం సేవించి రోడ్లపై హంగామా చేయడంపై నటి రేణూ దేశాయ్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. వినాయక చవితి సందర్భంగా అర్ధరాత్రి వరకు భారీ శబ్దాలతో ఇబ్బందులు కలిగించడాన్ని ఆమె ప్రశ్నించడంతో కొందరు ఆమెను ట్రోల్ చేశారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై రేణూ దేశాయ్ మరోసారి స్పందించారు. తాను హిందూ ధర్మానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. పండుగలు జరుపుకోవడాన్ని తాను ఎప్పుడూ తప్పుపట్టలేదని.. అయితే పండుగ పేరుతో ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా న్యూసెన్స్ చేయడం, అనాచారాలకు పాల్పడటాన్ని మాత్రమే ప్రశ్నించానని ఆమె తెలిపారు.

Read Also : Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్‌లో అపూర్వ పవర్ గేమ్.. ముఖేష్‌కు కెప్టెన్సీ

Renu Desai
Renu Desai makes sensational comments again regarding the Ganpati immersion.

Renu Desai: “నాకంటే సనాతన ధర్మాన్ని పాటించేవారు ఉండరు”.. రేణూ దేశాయ్

తనను హిందువులను టార్గెట్ చేస్తున్నారని విమర్శిస్తున్న వారికి రేణూ దేశాయ్ ఘాటుగా సమాధానమిచ్చారు. “నన్ను విమర్శించే వారిలో నాకంటే గొప్పగా సనాతన ధర్మాన్ని పాటించేవారు ఉండరు. నాకంటే తీవ్రంగా రాముడిని, శివుడిని పూజించే భక్తులు ఉండరు. నా ధర్మం గురించి నాకు స్పష్టంగా తెలుసు కాబట్టే నా పండుగల గురించి మాట్లాడుతున్నాను. ఇతర మతాల గ్రంథాలు, పద్ధతులు నాకు తెలియవు కాబట్టి వారి గురించి మాట్లాడే అర్హత నాకు లేదు” అని స్పష్టం చేశారు.

సూర్యాస్తమయం లోపే నిమజ్జనం జరగాలి!

పాత పద్ధతులు, సంప్రదాయాలను గుర్తుచేస్తూ రేణూ దేశాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. “చిన్నప్పటి నుంచి మనకు నేర్పింది ఏంటంటే సాయంత్రం 6 గంటల లోపే వినాయకుడి నిమజ్జనం పూర్తికావాలి. మన ఇంట్లో ఏమైనా శుభకార్యాలు లేదా మంచి పనులు ఉంటే పగటి సమయంలోనే చేసుకుంటాం. నా చిన్నప్పుడు మధ్యాహ్నం మూడున్నర కాగానే సూర్యాస్తమయం లోపు నిమజ్జనం చేయాలని ఇంట్లో తొందర పెట్టేవారు. కానీ ఇప్పుడు ఇష్టమొచ్చినట్లు డీజేలు పెట్టుకుని, మద్యం తాగి గణపతి మూర్తి ముందు డాన్సులు చేస్తున్నారు. ఇందులో భక్తి ఎక్కడుంది?” అని ఆమె ప్రశ్నించారు.

రోడ్లపై అర్ధరాత్రి వేళల్లో చేసే శబ్దాల వల్ల ఇంట్లో ఉండే వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు, పసిపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె గుర్తుచేశారు. “ఇలాంటి చర్యలతో పక్కవారిని హింస పెడితే ఏ దేవుడు మీకు సుఖసంతోషాలు ఇస్తాడో చెప్పండి. మన దేవుడికి మనమే గౌరవం ఇవ్వకుండా మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నాం” అని ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

⬇ Full News JPG⬇ Short News JPG
← మత్స్యకారులకు ఫ్రీగా 50 కేజీల బియ్యం -సీఎం చంద్రబాబు ఆదేశాలుకొత్త AI ఫీచర్లు.. ఫొటో ఎడిటింగ్ మరింత ఈజీ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com