Free Rice : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలను ముంచెత్తిన వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతికూల వాతావరణం మరియు సముద్రం అలజడిగా ఉండటంతో వేటకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న మత్స్యకార కుటుంబాలకు తక్షణ సహాయంగా 50 కేజీల ఉచిత బియ్యాన్ని అందజేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వర్షాల కారణంగా జీవనోపాధి కోల్పోయిన తీరప్రాంత కుటుంబాలను ఆదుకోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు తేల్చి చెప్పారు.
Read Also : తిరుమలలో స్మార్ట్ బస్టాప్‌లు.. ఇక క్యూఆర్ కోడ్‌తో బస్ ట్రాకింగ్

రిజర్వాయర్లలో నీటిమట్టం మెరుగు: తగ్గిన వర్షపాతం లోటు
టెలీకాన్ఫరెన్స్ సందర్భంగా వివిధ జిల్లాల్లోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లకు వస్తున్న ఇన్ ఫ్లోలు మరియు నీటి నిల్వల వివరాలను ఇరిగేషన్ శాఖ అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. ఇటీవల కురిసిన విస్తారమైన వర్షాల వల్ల రాష్ట్రంలో నెలకొన్న వర్షపాతం లోటు గణనీయంగా తగ్గిందని అధికారులు వివరించారు. అంతకుముందు 50 శాతంగా ఉన్న వర్షపాతం లోటు ఈ తాజా వానలతో 31 శాతానికి పడిపోయిందని తెలిపారు. రిజర్వాయర్లలో నీటిమట్టాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రవాహాలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం యంత్రాంగాన్ని ఆదేశించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :






