శబరిమలలో బంగారు కిరీటం మాయమైంది... ఆలయం స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచిన 55.72 సవర్ల బంగారు కిరీటం స్థానంలో నకిలీ కిరీటం ఉండటం కలకలం రేపుతోంది. 2012లో తమిళనాడుకు చెందిన భక్తులు ఈ కిరీటాన్ని సమర్పించినట్లు చెబుతున్నారు ఆలయ అధికారులు. అప్పట్లో కిరీటం బరువు 445.78 గ్రాములు ఉన్నట్లు రిజిస్టర్లో నమోదు కాగా..ప్రస్తుతం స్ట్రాంగ్ రూమ్ లో ఉన్న నకిలీ కిరీటం బరువు కేవలం 240 గ్రాములు మాత్రమే ఉందని తెలిపారు అధికారులు.
అసలైన కిరీటంలో సగం బరువు ఉన్న కిరీటం స్ట్రాంగ్ రూమ్ లో ఉందని తెలిపారు అధికారులు. బంగారు కిరీటం మాయమవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆలయ నిబంధనల ప్రకారం స్ట్రాంగ్ రూమ్ లోకి వెళ్లేందుకు కేవలం కార్యనిర్వహణాధికారికి మాత్రమే అనుమతి ఉంటుందని అంటున్నారు అధికారులు.
కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు అమికస్ క్యూరీ జస్టిస్ కేటీ శంకరన్ ఆధ్వర్యంలో ఆలయంలోని విలువైన వస్తువుల జాబితా తయారీ, తనిఖీ ప్రక్రియ చేపట్టారు అధికారులు. ఈ క్రమంలో కిరీటం బరువులో తేడా కనిపించడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అధికారులు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


