☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కరవు ప్రాంతాల్లో గ్రామీణ కూలీలకు గుడ్‌న్యూస్.. 15 రోజుల్లో జాబ్‌కార్డులు • Viral Video: పిచ్చిదానిలా మారిన భార్యను రోడ్డుపై చూసి భర్త తట్టుకోలేక.. ఎలా ఏడ్చాడో చూడండి! వీడియో వైరల్ • వాస్తు ప్రకారం.. ఇంట్లో తులసి మొక్కను ఉంచకూడని ప్రదేశాలు • నేడు స్థిరంగా బంగారం ధరలు • అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి • Sarpanch Suicide Attempt | ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వేధింపులు.. కరీంనగర్‌ జిల్లాలో సర్పంచ్ ఆత్మహత్యాయత్నం! • OTT Cinema : థియేటర్లలో సంచలనం.. ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్.. ఓటీటీలోకి వస్తున్న రూ.140 కోట్ల సినిమా.. • Video: ఒకే ఓవర్‌లో రెండు మిస్టేక్స్.. లక్కీ ఛాన్స్ ఇస్తే ఇలా చేశావేంట్రా..! •

హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో..రేపటి(అక్టోబర్5) నుంచి 36 గంటలు మంచి నీళ్లు బంద్

హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో..రేపటి(అక్టోబర్5) నుంచి 36 గంటలు మంచి నీళ్లు బంద్
హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో..రేపటి(అక్టోబర్5) నుంచి 36 గంటలు మంచి నీళ్లు బంద్
హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో..రేపటి(అక్టోబర్5) నుంచి 36 గంటలు మంచి నీళ్లు బంద్

హైదరాబాద్ సిటీలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టు ఫేజ్–2లో చేపడుతున్న మరమ్మతు పనుల కారణంగా అక్టోబర్ 5 ఉదయం 6 గంటల నుంచి అక్టోబర్ 6 సాయంత్రం 6 గంటల వరకు నీటి సరఫరాపై ప్రభావం పడనుంది. మొత్తం 36 గంటల పాటు కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా, మరికొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా నీటి సరఫరా నిలిచిపోయే అవకాశం ఉందని జలమండలి అధికారులు తెలిపారు.

నాసర్లపల్లి–గోడకొండ్ల మధ్య ఉన్న 2375 ఎంఎం డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్‌పై మరమ్మతు పనులు చేపట్టనున్నారు. దెబ్బతిన్న ఎంఎస్ ఎయిర్ టీస్, వాల్వులను మార్చడంతో పాటు స్కవర్ పైప్‌లైన్‌లో లీకేజీ నివారణ పనులు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు.ఈ పనుల ప్రభావంతో పలు ప్రాంతాల్లో నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉండగా.. మరికొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా లేదా తక్కువ ప్రెషర్‌తో నీరు వచ్చే అవకాశం ఉంది.

ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాపై ప్రభావం

  • మరమ్మతు పనుల కారణంగా కింది ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది:
  • ఆదిబట్ల, కమ్మగూడ, గుర్రంగూడ
  • బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటోనగర్, అల్కాపురి
  • హబ్సిగూడ, రామంతాపూర్, ఉప్పల్, నాచారం, హెచ్‌ఎంటీ నగర్
  • తార్నాక, బౌద్ధనగర్, లాలాపేట్
  • హస్మత్‌పేట్, ప్రకాశ్‌నగర్, మేకలమండి, భోలక్‌పూర్
  • పద్మారావునగర్, బేగంపేట్, సికింద్రాబాద్ కంటోన్మెంట్
  • లాలాగూడ, అడ్డగుట్ట, పట్టిగడ్డ, నల్లగుట్ట
  • మీర్‌పేట్, బడంగ్‌పేట్, బాలాపూర్, మైసారం
  • బార్కాస్, ఎన్‌పీఏ, శంషాబాద్, మధుబన్

మరమ్మతు పనులు పూర్తయ్యే వరకు ప్రభావిత ప్రాంతాల్లో నీటి సరఫరా సాధారణ స్థాయిలో ఉండకపోవచ్చని జలమండలి సూచించింది. కొన్ని ప్రాంతాల్లో లో-ప్రెషర్‌తో నీరు సరఫరా అయ్యే అవకాశం ఉందని తెలిపింది.

అందువల్ల ప్రభావిత ప్రాంతాల ప్రజలు ముందుగానే అవసరమైన నీటిని నిల్వ చేసుకుని, మరమ్మతుల సమయంలో నీటిని పొదుపుగా వినియోగించాలని జలమండలి విజ్ఞప్తి చేసింది. పనులు పూర్తయిన అనంతరం నీటి సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావడానికి చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.



©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← నేవీలో హనీట్రాప్ కలకలం.. అధికారి అరెస్ట్! విశాఖ భద్రతా సమాచారాన్ని లీక్ చేశాడా?ఇండియా కూటమిలోకి టీవీకే పార్టీ.. కాంగ్రెస్ అధికారిక ప్రకటన →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com