☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కరవు ప్రాంతాల్లో గ్రామీణ కూలీలకు గుడ్‌న్యూస్.. 15 రోజుల్లో జాబ్‌కార్డులు • Viral Video: పిచ్చిదానిలా మారిన భార్యను రోడ్డుపై చూసి భర్త తట్టుకోలేక.. ఎలా ఏడ్చాడో చూడండి! వీడియో వైరల్ • వాస్తు ప్రకారం.. ఇంట్లో తులసి మొక్కను ఉంచకూడని ప్రదేశాలు • నేడు స్థిరంగా బంగారం ధరలు • అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి • Sarpanch Suicide Attempt | ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వేధింపులు.. కరీంనగర్‌ జిల్లాలో సర్పంచ్ ఆత్మహత్యాయత్నం! • OTT Cinema : థియేటర్లలో సంచలనం.. ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్.. ఓటీటీలోకి వస్తున్న రూ.140 కోట్ల సినిమా.. • Video: ఒకే ఓవర్‌లో రెండు మిస్టేక్స్.. లక్కీ ఛాన్స్ ఇస్తే ఇలా చేశావేంట్రా..! •

సమంత సినిమా స్ఫూర్తితో ఇంప్యూర్‌‌‌‌‌‌‌‌ చిత్రం

సమంత సినిమా స్ఫూర్తితో ఇంప్యూర్‌‌‌‌‌‌‌‌ చిత్రం Caption of Image. అమెరికాలో స్థిరపడిన తెలుగమ్మాయి వారాహి మల్లిపాముల కథను అందిస్తూ నిర్మించిన చిత్రం ‘ఇంప్యూర్‌‌‌‌‌‌‌‌’. నిశాంతి ఇవని దర్శకత్వం వహించారు. వారాహితో పాటు యషా ముత్తులూరి, సాయి కృష్ణ లీడ్ రోల్స్‌‌‌‌లో నటించారు. అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 2న సినిమా థియేటర్స్‌‌‌‌లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత వారాహి మాట్లాడుతూ ‘కాకినాడలో పుట్టిన నేను పెన్సిల్వేనియాలో పెరిగా. ప్రస్తుతం న్యూయార్క్‌‌‌‌లో ఉంటున్నా. టెక్‌‌‌‌ రంగంలో పనిస్తూనే ఎన్నో ఏళ్లుగా సినిమా ప్రయత్నాలు చేస్తున్నా. ఉమెన్‌‌‌‌ సెంట్రిక్‌‌‌‌ స్టోరీ కావడంతో నా స్క్రిప్ట్‌‌‌‌తో సినిమా తీసేందుకు నిర్మాతలు సందేహించారు. అయితే ‘మా ఇంటి బంగారం’ విజయంతో సమంత, నందిని రెడ్డి ఆ అపోహలను తొలగించారు. ఆ స్ఫూర
సమంత సినిమా స్ఫూర్తితో ఇంప్యూర్‌‌‌‌‌‌‌‌ చిత్రం
సమంత సినిమా స్ఫూర్తితో ఇంప్యూర్‌‌‌‌‌‌‌‌ చిత్రం

అమెరికాలో స్థిరపడిన తెలుగమ్మాయి వారాహి మల్లిపాముల కథను అందిస్తూ నిర్మించిన చిత్రం ‘ఇంప్యూర్‌‌‌‌‌‌‌‌’. నిశాంతి ఇవని దర్శకత్వం వహించారు. వారాహితో పాటు యషా ముత్తులూరి, సాయి కృష్ణ లీడ్ రోల్స్‌‌‌‌లో నటించారు. అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 2న సినిమా థియేటర్స్‌‌‌‌లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత వారాహి మాట్లాడుతూ ‘కాకినాడలో పుట్టిన నేను పెన్సిల్వేనియాలో పెరిగా. ప్రస్తుతం న్యూయార్క్‌‌‌‌లో ఉంటున్నా. టెక్‌‌‌‌ రంగంలో పనిస్తూనే ఎన్నో ఏళ్లుగా సినిమా ప్రయత్నాలు చేస్తున్నా. ఉమెన్‌‌‌‌ సెంట్రిక్‌‌‌‌ స్టోరీ కావడంతో నా స్క్రిప్ట్‌‌‌‌తో సినిమా తీసేందుకు నిర్మాతలు సందేహించారు.

అయితే ‘మా ఇంటి బంగారం’ విజయంతో సమంత, నందిని రెడ్డి ఆ అపోహలను తొలగించారు. ఆ స్ఫూర్తితో నేనే ఈ చిత్రాన్ని నిర్మించి, రిలీజ్ చేస్తున్నా. మోడ్రన్ రిలేషన్‌‌‌‌షిప్స్ డ్రామా ఇది. ఒక మహిళ కన్య కాదని ఆమె అత్తమామలకు తెలియడంతో ఆ పెళ్లిని రద్దు చేసే కథాంశంతో దీన్ని తెరకెక్కించాం. అంతర్జాతీయ ర్యాపర్ రాజా కుమారి పాటలు కంపోజ్ చేశారు. డీవోపీ జ్ఞానశేఖర్ వి.ఎస్. మా సినిమా స్థాయిని పెంచారు. స్త్రీ, పురుషుల సమస్యలపై ఒక కొత్త కోణాన్ని ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది’ అని చెప్పారు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← రోజుకొక స్పూన్ తింటే.. పొట్ట చుట్టూ ఉన్న మొండి కొవ్వు మైనంలా కరిగిపోతుందిపండుగ వేళ వ్యాపారులకు షాక్ ..కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరిగాయ్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com