ప్రధాన ఆదాయపు పన్ను కమిషనర్ కార్యాలయం, ఢిల్లీ రీజియన్ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అక్టోబర్ 17 నుంచి నవంబర్ 10 వరకు అప్లై చేయవచ్చు
మొత్తం ఖాళీలు: 119.
పోస్టు: టాక్స్ అసిస్టెంట్.
ఖాళీలు: 44.
విద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
వయసు: 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు వర్తిస్తుంది.
స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II
ఖాళీలు: 09.
విద్యార్హత: 12వ తరగతి లేదా సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు షార్ట్హ్యాండ్ , టైపింగ్ నైపుణ్యాలు ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు వర్తిస్తుంది.
మల్టీ-టాస్కింగ్ స్టాఫ్
ఖాళీలు: 66.
విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి లేదా సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు వర్తిస్తుంది.
క్రీడా అర్హతలు
అంతర్జాతీయ లేదా జాతీయ స్థాయి పోటీల్లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించిన వారు లేదా ఇంటర్- యూనివర్సిటీ టోర్నమెంట్లు, నేషనల్ స్కూల్ గేమ్స్ల్లో పతకాలు సాధించిన క్రీడాకారులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 17.
లాస్ట్ డేట్: నవంబర్ 10.
ఎంపిక విధానం: అప్లికేషన్ స్క్రీనింగ్, గ్రౌండ్ / స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.incometaxdelhi.gov.inను సందర్శించండి.






