☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
నరసాపురం మున్సిపాలిటీపై కూటమి జెండా ఎగరేస్తాం! • Gold-Silver Prices Today : పండుగ వేళ బంగారం ధరల్లో కీలక మార్పులు.. తులం రేటు ఎంతంటే? • దసరా తర్వాతే పట్టాలెక్కే ఛాన్స్ • ఘోర ప్రమాదం: కాలువలో పడిన మినీ బస్సు.. 8 మంది మృతి • అబ్బా వీటిని అనవసరంగా లైట్‌ తీసుకున్నామే.. జుట్టురాలడానికి అసలు కారణం ఈ అలవాట్లేనా? • Vaibhav Sooryavanshi: గంభీర్ ఛాన్స్ ఎప్పుడు ఇస్తారు? వైభవ్ సూర్యవంశీ రెండు పదాలతో చెప్పిన సమాధానం ఇదే • Tesla: ఫ్లయింగ్ కారు కేవలం శాంపిల్ మాత్రమే.. మస్క్ నెక్ట్స్ ఈ మూడు ప్రాజెక్టుల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..! • ట్రంప్ కీలక నిర్ణయం.. రష్యాపై చమురు ఆంక్షల్లో మినహాయింపులు? •

కేసీఆర్ ఫామ్ హౌస్ లోగుట్టు కొండపోచమ్మకే ఎరుక..చెరువు నుంచి పైపులు.. సారింటికి నీళ్లు

కేసీఆర్ ఫామ్ హౌస్ లోగుట్టు కొండపోచమ్మకే ఎరుక..చెరువు నుంచి పైపులు.. సారింటికి నీళ్లు
కేసీఆర్ ఫామ్ హౌస్ లోగుట్టు కొండపోచమ్మకే ఎరుక..చెరువు నుంచి పైపులు.. సారింటికి నీళ్లు
కేసీఆర్ ఫామ్ హౌస్ లోగుట్టు కొండపోచమ్మకే ఎరుక..చెరువు నుంచి పైపులు.. సారింటికి నీళ్లు

హైదరాబాద్​, వెలుగు: కోటి ఆకాంక్షలతో తెచ్చుకున్న తెలంగాణలో బాగుపడిందెవరు?’ అనే చర్చ జరుగుతున్న టైంలో ఇటీవల కొన్ని సంచలన విషయాలు బయటకు వచ్చాయి. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు సిద్దిపేట జిల్లా మర్కూక్ ​మండలం ఎర్రవల్లిలోని వందల ఎకరాల్లో ఆయన, తన కుటుంబం నిర్మించుకున్న ఫాంహౌస్​లో పెద్ద ఎత్తున ప్రభుత్వ, అసైన్డ్​ భూములను కలిపేసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇందులో నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సమగ్ర సర్వే చేయిస్తోంది. ఇదిలా ఉండగా కొండపోచమ్మ సాగర్ నుంచి కేసీఆర్ ఫాంహౌస్ కు వాటర్​గ్రిడ్​ తరహాలో నీళ్లను మళ్లిస్తున్న వ్యవహారం తాజాగా వెలుగు చూసింది. ఇందులో వాస్తవాలను పరిశీలించేందుకు ‘వీ6 -వెలుగు’ టీమ్ క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఈ సందర్భంగా కళ్లు బైర్లు కమ్మే నిజాలు బయటపడ్డాయి.

కేసీఆర్ ఫాంహౌస్​కు కనుచూపు మేరలోనే కొండపోచమ్మ సాగర్ ఉంటుంది. దాదాపు 5 కిలోమీటర్ల దూరం. ఈ రిజర్వాయర్ నుంచి మొదలయ్యే ప్రధాన కాలువను ‘జగదేవ్​పూర్ కెనాల్​’ అంటారు. మొదట్లో భవానందపూర్, శివారు వెంకటాపూర్ అనే చిన్న గ్రామాలు మాత్రమే ఉంటాయి. అవి దాటగానే నేరుగా కేసీఆర్ ఫాంహౌస్ ముందు రోడ్డుకు సమాంతరంగా ఈ కాలువ సాగిపోతుంది. ఫాంహౌస్ ముందే ఈ కాలువకు సమాంతరంగా మరో చిన్న డైవర్షన్ కెనాల్​ నిర్మించారు. ఇది సరిగ్గా ఫాంహౌస్​కు ఎదురుగా ఉండే పాండురంగ చెరువులోకి పోతుంది. కొండపోచమ్మ కాలువ నీళ్లను మళ్లించి ఈ చెరువును నింపుతున్నారు. గూగుల్ మ్యాపులో పేరు కూడా కనిపించని ఈ చెరువే కేసీఆర్​ ఫాంహౌస్​కు ప్రధాన నీటి వనరు.

చెరువు నుంచి పైపులు.. సారింటికి నీళ్లు

డ్రిప్ ఇరిగేషన్ పేరుతో పాండురంగ చెరువులోకి భారీ సంఖ్యలో పైపులు వేశారు. దగ్గరలో పంపుహౌస్ నిర్మించారు. చెరువులోంచి నీళ్లను గుంజుకునే ఈ పైపులు భూగర్భంలోకి పోయి దగ్గరలో కొండపోచమ్మ కాలువను దాటుకొని కేసీఆర్ ఫాంహౌస్ లోకి వెళ్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. కోట్లుపెట్టి తవ్విన చెరువు, డ్రిప్ ఇరిగేషన్​తో మళ్లిస్తున్న నీళ్లు కేసీఆర్​ ఫాంహౌస్ సేవలో తరిస్తున్నాయి. దీని కోసమే అప్పట్లో సీఎం కేసీఆర్ దత్తత గ్రామాల పేరుతో దాదాపు 50 కోట్ల వ్యవసాయ శాఖ నిధులను మంజూరుచేసుకున్నారు. 100 శాతం సబ్సిడీతో రైతులకు బిందుసేద్యం
సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు.

►ALSO READ | జనం సొమ్ముతో పాండురంగ చెరువు నుంచి కెనాల్ మీదుగా కేసీఆర్ ఫామ్ హౌస్ లోకి పైప్ లైన్

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← Vidya Balan: MS సుబ్బులక్ష్మి బయోపిక్.. నా కల నెరవేరలేదుసీనియర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్టులు ..65 ఖాళీలతో సుప్రీంకోర్ట్ నోటిఫికేషన్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com