సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 20 నుంచి నవంబర్ 10 వరకు అప్లై చేయవచ్చు.
పోస్టు పేరు: సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ (గ్రూప్–బి నాన్– గెజిటెడ్).
మొత్తం ఖాళీలు: 65.
విద్యార్హతలు
- గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- షార్ట్‌హ్యాండ్ (ఇంగ్లిష్): నిమిషానికి 110 పదాల వేగంతో షార్ట్‌హ్యాండ్‌లో ప్రావీణ్యం ఉండాలి.
- కంప్యూటర్ పరిజ్ఞానం: కంప్యూటర్ అప్లికేషన్లపై పరిజ్ఞానంతోపాటు నిమిషానికి 40 పదాల వేగంతో టైపింగ్ నైపుణ్యం ఉండాలి.
వయసు: 2026, అక్టోబర్ 1 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: అక్టోబర్ 15.
అప్లికేషన్ ఫీజు: జనరల్ అభ్యర్థులు రూ. 1500, ఎస్సీ/ ఎస్టీ, ఓబీసీ, ఎక్స్ సర్వీస్‌మెన్, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ. 750 చెల్లించాలి.
లాస్ట్ డేట్: నవంబర్ 10.
అబ్జెక్టివ్ టైప్ టెస్ట్ తేదీ: డిసెంబర్ 7.
సెలెక్షన్ ప్రాసెస్: ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్, షార్ట్ హ్యాండ్ టెస్ట్ (ఇంగ్లిష్), టైపింగ్ స్పీడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.sci.gov.inను సందర్శించండి.
సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్టులనియామక ప్రక్రియ నాలుగు దశల్లో ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ 100 మార్కులకు ఉంటుంది. 90 నిమిషాల్లో పూర్తిచేయాలి. జనరల్ ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్, భారత రాజ్యాంగంలోని న్యాయవ్యవస్థకు సంబంధించిన నిబంధనలు, సుప్రీంకోర్టు రూల్స్ 2013, కంప్యూటర్ ఆపరేషన్స్ పరిజ్ఞానంపై ప్రశ్నలు అడుగుతారు. ఈ ఎగ్జామ్‌లో అర్హత సాధించాలంటే కనీసం 50 మార్కులు సాధించాలి.
షార్ట్‌హ్యాండ్ టెస్ట్
ఇంగ్లిష్ షార్ట్‌హ్యాండ్‌లో నిమిషానికి 110 పదాల వేగంతో (7 నిమిషాల డిక్టేషన్, 45 నిమిషాల ట్రాన్స్క్రిప్షన్) పరీక్ష ఉంటుంది. ఇందులో అర్హత సాధించాలంటే 50 మార్కులు రావాల్సి ఉంటుంది.
కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ టెస్ట్
ఇంగ్లిష్ భాషలో కంప్యూటర్ ద్వారా నిమిషానికి కనీసం 40 పదాల వేగంతో టైపింగ్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇందులో అర్హత సాధించాలంటే కనీసం 10 మార్కులు రావాల్సి ఉంటుంది.
స్టేజ్–4లో ఇంటర్వ్యూ ఉంటుంది.


