☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

మహాలయ పక్షంలో ఒక్కరోజైనా ఈ కర్మ చేస్తే.. పితృదేవతలను స్మరించినట్లే!

భారతీయ సనాతన ధర్మంలో దేవతారాధనకు ఎంత ప్రాధాన్యత ఉందో, పితృ దేవతలను స్మరించి, వారిని పూజించడానికీ అంతే ప్రాముఖ్యత ఉంది. దేవతారాధన రెండు రూపాల్లో ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఒక రూపంలో రాముడు, కృష్ణుడు, దుర్గ వంటి దేవతలను పూజిస్తే, మరొక రూపంలో పితృ దేవతలను అర్చిస్తారు. ఈ పితృ దేవతలను పూజించే పవిత్ర సమయమే మహాలయ పక్షం. దీనినే పితృ పక్షాలు అని కూడా అంటారు.
మహాలయ పక్షంలో ఒక్కరోజైనా ఈ కర్మ చేస్తే.. పితృదేవతలను స్మరించినట్లే!
Pitru Paksha

భారతీయ సనాతన ధర్మంలో దేవతారాధనకు ఎంత ప్రాధాన్యత ఉందో, పితృ దేవతలను స్మరించి, వారిని పూజించడానికీ అంతే ప్రాముఖ్యత ఉంది. దేవతారాధన రెండు రూపాల్లో ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఒక రూపంలో రాముడు, కృష్ణుడు, దుర్గ వంటి దేవతలను పూజిస్తే, మరొక రూపంలో పితృ దేవతలను అర్చిస్తారు. ఈ పితృ దేవతలను పూజించే పవిత్ర సమయమే మహాలయ పక్షం. దీనినే పితృ పక్షాలు అని కూడా అంటారు.

Pitru Paksha 1

సాధారణంగా భాద్రపద మాసంలోని కృష్ణ పక్షం పాడ్యమి నుండి అమావాస్య వరకు పదిహేను రోజులను మహాలయ పక్షాలుగా పాటిస్తారు. అయితే, వాస్తవానికి ఆషాఢ మాసం కృష్ణ పక్షం పాడ్యమి మొదలుగా 75 రోజుల కాలం మహాలయ పక్షమే అని శాస్త్రం చెబుతోంది. దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమైన నేపథ్యంలో, ఈ కాలంలో పితృదేవతలు స్వర్గలోకాలను ఆశించేవారుగా మనలను ఆశ్రయిస్తారని విశ్వాసం.

Pitru Paksha 2

ఈ పవిత్రమైన రోజులలో మన పితరులకు కృతజ్ఞతలు చెప్పడమే మహాలయ పక్షంలో నిర్వహించే శ్రాద్ధ కర్మకు ప్రధాన ప్రయోజనం. తాత, ముత్తాతలతో సహా మన పూర్వీకులందరినీ స్మరించుకుంటూ, వసు, రుద్ర, ఆదిత్య స్వరూపాల్లో ఉన్న పితరులకు శ్రాద్ధ కర్మలు ఆచరిస్తారు. పితృదేవతలకు ప్రీతికరమైన ఆహార పదార్థాలను సిద్ధం చేసి దానం చేయడం, వారి మరణ తిథిని గుర్తుంచుకొని ఆ రోజున శ్రాద్ధ కర్మ నిర్వహించడం, నువ్వులను అరచేతిలో వేసుకొని తర్పణం విడిచిపెట్టడం వంటి ఆచారాలు పాటిస్తారు.

Pitru Paksha 3

శ్రాద్ధ కర్మలను ఆచరించడంలో నాలుగు రకాలు ఉన్నప్పటికీ, ప్రస్తుత కాలంలో అనేకమందికి అత్యంత సులభంగా ఉండేది హిరణ్య శ్రాద్ధం. పండితులు చెప్పిన దాని ప్రకారం, హిరణ్య శ్రాద్ధం కోసం ఒక పళ్ళెం లేదా అరిటాకులో బియ్యం పోసి, దాని పక్కన కందగడ్డ, గుమ్మడికాయ, చేమకూర, తోటకూర, గోరుచిక్కుడు వంటి దేశీయ కూరగాయలతో పాటు పెసరపప్పు, బెల్లం, ఉప్పు, పసుపు, చింతపండు వంటి పదార్థాలను వరుసగా ఉంచుతారు. ఈ పదార్థాలను అర్హులైన బ్రాహ్మణోత్తములకు పితరులను తలచుకొని సదక్షిణగా దానం చేయాలి. దీనినే హిరణ్య శ్రాద్ధం అంటారు. బ్రాహ్మణులను పిలిపించి పిండ ప్రదానాది కార్యక్రమాలతో పార్వణ శ్రాద్ధం వంటివి కూడా ధర్మశాస్త్రం బోధిస్తుంది.

Pitru Paksha 5

శ్రాద్ధం అంటే "శ్రద్ధయా దేయతే శ్రాద్ధం" - శ్రద్ధతో చేసేదే శ్రాద్ధం అని అర్థం. ఈ కర్మల వలన మనం సమర్పించే దానాలు, పూజలు పితరులకు ఎలా చేరుతాయి అనే సందేహం కలుగుతుంది. విదేశాలలో సంపాదించిన డాలర్లు, పౌండ్లు మన దేశంలో రూపాయలుగా మారినట్లుగానే, మనం చేసే పుణ్యకార్యాలు, దానధర్మాలు పుణ్యరూపంగా మారి, ఆ ప్రయోజనం పితృ దేవతలకు తప్పకుండా చేరుతుందని ధర్మశాస్త్రం వివరించింది. ఇది భారతీయ విశ్వాసంలో ఒక అంతర్భాగం. కనీసంగా ఒక్క రోజైనా శాస్త్రబద్ధంగా పితరులకు ధన్యవాదాలు తెలియజేసి, శ్రాద్ధ కర్మను ధర్మాచరణతో నిర్వహించడం వలన పూర్వీకుల ఆశీస్సులు పొంది, మన సంప్రదాయాన్ని పాటిద్దాం.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← డేకేర్ సెంటర్‌లో భరించలేని దుర్వాసన.. పోలీసుల ఎంట్రీతో షాకింగ్ నిజం వెలుగులోకి!Rain Alert: రానున్న రెండు రోజులు మోస్తరు వర్షాలు.. వాతావరణశాఖ కీలక సూచనలు! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com