☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కరవు ప్రాంతాల్లో గ్రామీణ కూలీలకు గుడ్‌న్యూస్.. 15 రోజుల్లో జాబ్‌కార్డులు • Viral Video: పిచ్చిదానిలా మారిన భార్యను రోడ్డుపై చూసి భర్త తట్టుకోలేక.. ఎలా ఏడ్చాడో చూడండి! వీడియో వైరల్ • వాస్తు ప్రకారం.. ఇంట్లో తులసి మొక్కను ఉంచకూడని ప్రదేశాలు • నేడు స్థిరంగా బంగారం ధరలు • అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి • Sarpanch Suicide Attempt | ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వేధింపులు.. కరీంనగర్‌ జిల్లాలో సర్పంచ్ ఆత్మహత్యాయత్నం! • OTT Cinema : థియేటర్లలో సంచలనం.. ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్.. ఓటీటీలోకి వస్తున్న రూ.140 కోట్ల సినిమా.. • Video: ఒకే ఓవర్‌లో రెండు మిస్టేక్స్.. లక్కీ ఛాన్స్ ఇస్తే ఇలా చేశావేంట్రా..! •

ఆధునిక సాంకేతికతతో హెచ్ఎంఇఎల్కు కొత్త దిశ

APHMEL : ఒకప్పుడు రూ.21 కోట్లకుపైగా పేరుకుపోయిన నష్టాలు, మూసి వేత అంచులకు చేరిన పరిస్థితి. భవి ష్యత్తుపై అనిశ్చితి ఇవీ ఒకనాటి ఏపీ ఎస్ఎంఈఎల్ (ఆంధ్రప్రదేశ్...
ఆధునిక సాంకేతికతతో హెచ్ఎంఇఎల్కు కొత్త దిశ

APHMEL : ఒకప్పుడు రూ.21 కోట్లకుపైగా పేరుకుపోయిన నష్టాలు, మూసి వేత అంచులకు చేరిన పరిస్థితి. భవి ష్యత్తుపై అనిశ్చితి ఇవీ ఒకనాటి ఏపీ ఎస్ఎంఈఎల్ (ఆంధ్రప్రదేశ్ హెవీ మెషినరీ అండ్ ఇంజినీరింగ్ లిమి టెడ్) ఎదుర్కొన్న సవాళ్లు. అదేసంస్థ నేడు వరుసగా లాభాలను నమోదు చేస్తూ, విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. 2025-26 ఆర్ధిక సంవ త్సరంలో రూ.23.33 కోట్ల నికర లాభం సాధించడం, సింగరేణి ఆధీనంలోకి వచ్చిన తర్వాత సంచిత లాభాలు రూ.60.85 కోట్లకు చేరడం మార్పుకు నిదర్శనం. గత మూడేళ్లలోనే రూ.34.20 కోట్ల నికర లాభాలు రావడం సంస్థ పునరుజ్జీవనానికి స్పష్టమైన సంకే తం. దీనిని కేవలం ఒక ప్రభుత్వ రంగ సంస్థ సాధించిన ఆర్ధిక ఘన విజయంగా చూడాల్సిన అవసరం ఉంది. నష్టాల్లో కూరుకుపోయిన సంస్థను నిలబెట్టడం ఒక దశ. దానిని లాభాల్లోకి తీసుకురావడం మరో దశ. కానీ అక్కడితో ఆగకుండా మార్కెట్ను విస్తరించడం, ఉత్పాదకతను పెంచడం, వ్యయాలను నియంత్రించడం, కొత్త ఉ త్పత్తులను అభివృద్ధి చేయడం, జాతీయ స్థాయిలో పోటీ పడే సామర్థ్యాన్ని పెంచడం ఈ విజయంలో మరో దశగా చెప్పాలి. ఈమార్పు వెనుక ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చొరవకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.

Read Also : AP Baby Kits: మళ్లీ ‘ఎన్టీఆర్ బేబీ కిట్లు’.. ఒక్కో కిట్ విలువ రూ.1,410

APHMEL
APHMEL

APHMEL : దేశవ్యాప్తం గా మార్కెట్ అవకాశాల

ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సింగ రేణి విస్తరణతోపాటు దాని అనుబంధ సంస్థల సామర్థ్యాలను కూడా పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్న లక్ష్యం తో ఆయన ఆలోచనలు ముందుకు సాగాయి. ఒకవైపుమాతృ సంస్థ సింగరేణిని బొగ్గు ఉత్పత్తితో పాటు రాగి, బంగారం, క్రిటికల్ మైనింగ్ లోకి పరుగులు పెట్టించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సింగరేణిని విస్తరించేలా ప్రణాళికా బద్దంగా పరుగులు పెట్టిస్తున్నారు. ఆ క్రమంలో ఏపీఎచ్ ఎంఈఎల్ను కేవలం సింగరేణికి యంత్రాలు, విడిభాగాలు సరఫరా చేసే సంస్థగా పరిమితం చేయకుండా, దేశవ్యాప్తం గా మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకునే భారీఇంజినీరింగ్ సంస్థగా తీర్చిదిద్దే దిశగా చర్యలు మొదలుపెట్టారు. సంస్థ ప్లాంటును స్వయంగా సందర్శించిన ఉప ముఖ్య మంత్రి అక్కడ పనితీరు, ఉత్పత్తి సామర్థ్యం, విస్తరణ ప్రణాళికలు, భవిష్యత్ వ్యాపార అవకాశాలపై సమీక్ష నిర్వహించారు. సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోవడం, ఉత్పత్తుల్లో వైవిధ్యం తీసుకురావడం, కొత్త మార్కెట్లను అన్వేషించడం ఈ సమీక్షలో ముఖ్యమైన అంశాలు. తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా అవకాశాలను అందిపు చ్చుకోవడం అనే దిశలో ఆయన ఆలోచన చేయడం సంస్థకు కొత్త భవిష్యత్తును ఇచ్చిందని చెప్పాలి. గత నష్టాలను లెక్క పెట్టి సంస్థ భవిష్యత్తును మూసివేతతో ముగించకుండా, అందుబాటులో ఉన్న సాంకేతిక సామర్థ్యం, మానవ వన రులు, మౌలిక వసతులను కొత్త అవకాశాలతో అనుసంధా నించాలన్న ఆలోచనే సంస్థకు కొత్తదిశనుచూపింది.

చిన్నా పెద్ద నిర్వహణ నిర్ణయాల సమాహారమే

2023-24లో రూ.1.05 కోట్లు, 2024-25లో రూ.9.87 కోట్లు, 2025-26లో రూ.23.33 కోట్ల రికార్డు నికర లాభాన్ని ఏపీఎచ్ఎంఈఎల్ ఆర్జించింది. ఈ మూడేళ్లలో లాభాల పరిమాణం గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా 2025-26లో నమోదైన రూ.23.33 కోట్ల నికర లాభం సంస్థ సుమారు ఐదు దశాబ్దాల చరిత్రలో అత్యధిక వార్షిక లాభంగా నిలిచింది. అంటే మార్పు కేవలం ప్రకటనల్లో కనిపించడం లేదు. సంస్థ ఆర్థిక ఫలితాల్లోనూ ప్రతిఫలిస్తోం ది. నష్టాల నుంచి లాభాల వైపు సాగిన ఈ ప్రయాణం వెనుక కేవలం ఆదాయం పెరగడం మాత్రమే కాదు, ఆర్డర్ల పెంపు, ఉత్పత్తుల్లో వైవిధ్యం, వ్యయ నియంత్రణ, ఉత్పాద కత పెంపు, అందుబాటులో ఉన్న మౌలిక వసతుల సమర్థ వినియోగం వంటి అంశాల సమ్మేళనం ఉంది. ఒక సంస్థను పునరుద్ధరించాలంటే ఒక్క నిర్ణయం సరిపోదు. అనేక చిన్నా పెద్ద నిర్వహణ నిర్ణయాల సమాహారమే పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. ఏపీఎచ్ఎంఈఎల్ పునరుద్ధరణలో సింగరేణి పాత్ర ను విస్మరించలేం. సంస్థ సంక్షోభంలో ఉన్న సమయంలో సింగరేణి ఆర్డర్ల ద్వారా అండగా నిలిచింది. అనంతరం పెట్టుబడులు పెట్టి ప్రధాన భాగస్వామిగా మారింది. ప్రస్తు తం సింగరేణికి సంస్థలో 81.54 శాతం వాటా ఉంది. సింగరేణి అనుబంధ సంస్థగా ఉండటం మాత్రమే ఏపీఎచ్ ఎంఈఎల్ భవిష్యత్ కాకూడదు. సింగరేణి అనుభవం, ఏపీ ఎస్ఎంఈఎల్ సాంకేతిక సామర్థ్యం కలిసేలా చేసి, మరింత విసృత మార్కెట్ను సాధించడమే తదుపరి లక్ష్యంగా మారాలి.

APHMEL
APHMEL

ప్రభుత్వరంగ సంస్థల పట్ల ఉన్న పాత దృక్పథాన్ని మార్చాలి

సంస్థను నిలబెట్టడం మొదటి అడుగు అయితే స్వయం బలంతో ఎదిగే స్థాయికి తీసుకెళ్లడం తదుపరి అడుగు. ఏపీ ఎచ్ఎంఈఎల్ వ్యాపార పరిధి కూడా క్రమంగా విస్తరిస్తోం ది. సింగరేణితోపాటు బీహెచ్ఈఎల్, జెన్కో, ఎన్ఎండీసీ, ఆర్ఎన్ఎల్ వంటి సంస్థలకు యంత్రాలు, విడిభాగాలు సరఫరా చేసే అవకాశాలను సంస్థ అందిపుచ్చుకుంటోంది. కొత్త ఆర్డర్లు, ఉత్పత్తుల వైవిధ్యం, వ్యయ నియంత్రణ, ఉత్పాదకత పెంపు వంటి చర్యలు ఆర్ధిక పనితీరును మెరు గుపరిచేందుకు దోహదపడుతున్నాయి. ఇక్కడే ప్రభుత్వరంగ సంస్థల పట్ల ఉన్న పాత దృక్పథాన్ని మార్చాల్సిన అవస రం కనిపిస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థ అంటే ప్రభుత్వంపై ఆధారపడి నడిచే వ్యవస్థ మాత్రమే కాదు. మార్కెట్నుఅర్ధం చేసుకోవడం, నాణ్యతను పెంచడం, సాంకేతికతను ఆధునీ కరించడం, ఖర్చులను నియంత్రించడం, సమర్థవంతమైన నిర్వహణను అమలు చేయడంజరిగితే ప్రభుత్వ రంగ సంస్థ లు కూడా పోటీ మార్కెట్లో తమ స్థానాన్ని నిలబెట్టుకోగ లవని ఏపీఎచ్ఎంఈఎల్ నిరూపించింది. సంస్థను లాభాల్లోకి తీసుకురావడం ఎంత ముఖ్యమో ఆ లాభాలను భవిష అత్ లోనూ నిలబెట్టుకోవడం అంతకంటే ముఖ్యం. ఈ దిశలో ప్లాంట్ ప్రాంగణంలో 300 కిలోవాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంటోం ది. దీని ద్వారా రోజుకు సుమారు 1,200 కిలోవాట్ల విద్యు త్ ఉత్పత్తి చేసి, నెలకు సుమారు రూ.2 లక్షల వరకు విద్యుత్ వ్యయాన్ని ఆదా చేసే అవకాశం ఉంది. ఇది మా మూలు అంశంలా కనిపించినా, పారిశ్రామిక సంస్థల దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వంలో ఇలాంటి చర్యలే కీలకం. లాభాలు పెంచడం ఒక వైపు, వ్యయాలను తగ్గించి లాభాలను నిల బెట్టుకోవడం వ్యూహంలో ఒక భాగం. ఏపీఎచ్ఎంఈఎల్ పునరుద్ధరణలో ఈ రెండింటి సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. |

-చామిరాజు శేషు బాబు

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

యూపీఐ ఛార్జీలపై NPCI కీలక ప్రకటన
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← ఆంక్షలతో అమెరికాకే నష్టం ..జేపీ మోర్గాన్ సీఈఓ హెచ్చ‌రిక‌..!పాఠశాల లంచ్‌బాక్స్‌లో మెంతి కూర తెచ్చినందుకు రూ.50 ఫైన్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com